జుట్టు పెరుగుదలను వేగవంతం చేసే గుణాలు ఉల్లిపాయ రసంలో ఉన్నాయి. ఇది తలపై చుండ్రును కూడా నివారిస్తుంది.
ఒకటి లేదా రెండు ఉల్లిపాయల పొట్టు తీసి శుభ్రం చేయాలి. తర్వాత ఉల్లిపాయను చిన్న ముక్కలుగా కోయాలి. వాటిని మిక్సీలో వేసి రసం తీయాలి.
ఈ రసాన్ని తల చర్మానికి, జుట్టుకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత మైల్డ్ షాంపూతో కడిగేయాలి.
వారానికి రెండు లేదా మూడు సార్లు ఇలా చేస్తే జుట్టు రాలడం తగ్గి, ఒత్తుగా పెరుగుతుంది.
ఒక టీస్పూన్ ఉల్లిపాయ రసం, రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె కలిపి మిశ్రమంగా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత కడిగేయాలి.
ఉల్లిపాయ రసం, కొద్దిగా కలబంద జెల్, టీ ట్రీ ఆయిల్ కలిపి తలకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత షాంపూతో కడిగేయాలి.
గుడ్డులోని తెల్లసొన, ఉల్లిపాయ రసం కలిపి తలకు పట్టించడం వల్ల చుండ్రు, జుట్టు రాలడం తగ్గుతాయి.
న్యూ ఇయర్ పార్టీ కోసం అదిరిపోయే హెయిర్ స్టైల్స్ ఇవిగో
బంగారంలా మెరిసేపోయే గాజులు.. ట్రెండీ డిజైన్స్ ఇవిగో
అదిరిపోయే డిజైన్లలో వెండి మెట్టెలు.. ధర కూడా తక్కువే
మల్లెపూలతో హెయిర్ స్టైల్స్.. ఎప్పుడైనా ట్రై చేశారా?