MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Update
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
Maremma Movie Review
Yash Ramayana Movie Remuneration
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Life
  • Woman
  • Glowing face: 15 రోజులపాటు రాత్రి పడుకునే ముందు ఈ 5 చేసినా చాలు.. మెరిసే ముఖం మీ సొంతం!

Glowing face: 15 రోజులపాటు రాత్రి పడుకునే ముందు ఈ 5 చేసినా చాలు.. మెరిసే ముఖం మీ సొంతం!

ప్రస్తుతం చాలామందికి చిన్న వయసులోనే ముఖం మీద ముడతలు, మచ్చలు సాధారణమైపోయాయి. అయితే రాత్రి పడుకునే ముందు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా ముఖాన్ని కాంతివంతంగా మార్చుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Feb 27 2026, 06:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Night Skincare Steps
Image Credit : Getty

Night Skincare Steps

ముఖం అందంగా, కాంతివంతంగా, మృదువుగా ఉండాలంటే కేవలం మేకప్ సరిపోదు. సరైన స్కిన్‌కేర్ రొటీన్ అవసరం. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు చర్మాన్ని సరిగ్గా సంరక్షించుకోవడం అత్యంత కీలకం. దుమ్ము, దూళి, సూర్యకిరణాలు, మేకప్, చెమట వంటి అనేక కారణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. మరి ఎక్కువకాలం అందంగా, యవ్వనంగా కనిపించాలంటే రాత్రిపూట కొన్ని పనులు తప్పకుండా చేయాలంటున్నారు నిపుణులు. అవేంటో వాటి వల్ల కలిగే ప్రయోజనాలేంటో వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫేస్ క్లీనింగ్
Image Credit : Getty

ఫేస్ క్లీనింగ్

మొదటగా ముఖాన్ని పూర్తిగా శుభ్రం చేసుకోవడం అవసరం. రోజంతా పేరుకుపోయిన మలినాలు, మేకప్ అవశేషాలు, అదనపు ఆయిల్ చర్మ రంధ్రాలను మూసివేస్తాయి. దీంతో మొటిమలు, బ్లాక్‌హెడ్స్, చర్మం మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. కాబట్టి మైల్డ్ ఫేస్‌వాష్ లేదా క్లెన్సర్‌తో ముఖాన్ని సున్నితంగా కడగాలి. గోరువెచ్చని నీటితో కడిగితే ఇంకా మంచిది. ముఖం శుభ్రం చేసుకోవడానికి స్కిన్ టోన్ కి సరిపోయే క్లెన్సర్ ఎంచుకోవాలి.

Related Articles

Related image1
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Related image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
36
ఎక్స్‌ఫోలియేషన్
Image Credit : Getty

ఎక్స్‌ఫోలియేషన్

చర్మంపై పేరుకుపోయిన మృతకణాలను తొలగించడం కోసం వారానికి రెండు లేదా మూడు సార్లు ఎక్స్‌ఫోలియేట్ చేయడం మంచిది. మృతకణాలు ఉంటే చర్మం నిస్సారంగా కనిపిస్తుంది. అయితే రోజూ ఎక్స్‌ఫోలియేట్ చేయడం మంచిది కాదు. అధికంగా చేస్తే చర్మం పొడిబారడం, ఇర్రిటేషన్ కలగవచ్చు. సరైన పద్ధతిలో సరైన పరిమితిలో చేస్తే ముఖం మృదువుగా, కాంతివంతంగా మారుతుంది.

46
టోనర్ వాడటం
Image Credit : pinterest

టోనర్ వాడటం

టోనర్ చర్మ pH స్థాయిని సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. క్లెన్సింగ్ తర్వాత రంధ్రాలు కొద్దిగా తెరుచుకుంటాయి. టోనర్ వాటిని కుదించి చర్మాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. కాటన్ ప్యాడ్‌తో మెల్లగా అప్లై చేయడం మంచిది. రోజ్ వాటర్, ఆలొవెరా వంటి సహజ పదార్థాలతో తయారైన టోనర్లు చర్మానికి మరింత ఉపయుక్తంగా ఉంటాయి.

56
మాయిశ్చరైజర్ వాడటం
Image Credit : pinterest

మాయిశ్చరైజర్ వాడటం

నిపుణుల ప్రకారం ప్రతి ఒక్కరికీ మాయిశ్చరైజర్ అవసరం. ఇది చర్మంలో తేమను నిల్వ ఉంచి పొడిబారకుండా కాపాడుతుంది. రాత్రిపూట మాయిశ్చరైజర్ వాడితే నిద్ర సమయంలో చర్మం రిపేర్ అవుతుంది. డ్రై స్కిన్ ఉన్నవారు క్రీమ్ బేస్డ్ మాయిశ్చరైజర్, ఆయిలీ స్కిన్ ఉన్నవారు లైట్ జెల్ బేస్డ్ ప్రొడక్ట్ వాడటం మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా, హెల్తీగా ఉంచుతుంది.

66
సీరం అప్లై చేయడం
Image Credit : Getty

సీరం అప్లై చేయడం

సీరమ్స్‌లో విటమిన్ C, హైల్యూరానిక్ యాసిడ్ వంటి శక్తిమంతమైన పదార్థాలు ఉంటాయి. ఇవి చర్మ సమస్యలను దూరం చేస్తాయి. డార్క్ స్పాట్స్, ముడతలు, పిగ్మెంటేషన్ తగ్గించడంలో సీరం సహాయపడుతుంది. టోనర్ తర్వాత కొన్ని చుక్కల సీరం తీసుకుని మెల్లగా ముఖంపై అప్లై చేసుకొని తర్వాత మాయిశ్చరైజర్ వాడితే ఫలితం మెరుగ్గా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair Growth: రోజూ ఇవి తింటే.. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది
Recommended image2
Toe Ring Designs: మగువల మనసుదోచే మెట్టెల డిజైన్లు..పాదాలకే అందం
Recommended image3
Mini Jhumka: కేవలం 2 గ్రాముల్లో డైలీవేర్ కి అదిరిపోయే జుంకా డిజైన్లు
Related Stories
Recommended image1
Cumin Saunf Ajwain Water: 11 రోజులపాటు పరగడుపున జీలకర్ర, సోంపు, వాము కలిపిన వాటర్ తాగితే ఏమవుతుంది?
Recommended image2
Cumin Water: పరగడుపున కాదు.. రాత్రి పడుకునే ముందు జీలకర్ర నీరు తాగితే కలిగే 5 లాభాలు ఇవే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved