Mehandi: ఐదు నిమిషాల్లో చేతులకు అందాన్ని తెచ్చే మెహందీ డిజైన్స్
చేతుల నిండా మెహందీ పెట్టుకుంటే అందంగా ఉంటుంది. కానీ, ఆ మెహందీని కేవలం ఐదు నిమిషాల్లో పెట్టుకోవాలంటే ఈ డిజైన్స్ ఎంచుకోవాల్సిందే.

మెహందీ డిజైన్స్..
మహిళల చేతికి మెహందీ ఎంత అందాన్ని ఇస్తుందో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. చేతుల నిండా డిజైన్స్ వేయించుకుంటారు చాలా మంది. అయితే.. ప్రతిసారీ అలా గంటలసేపు కూర్చొని మెహందీ పెట్టుకోవాలంటే కష్టంగా ఉంటుంది. కానీ, ఈ డిజైన్లు మాత్రం కేవలం ఐదు నిమిషాల్లోనే వేసుకోవచ్చు. అలాంటి డిజైన్స్ ఓసారి చూద్దాం…
చుక్కల మెహందీ డిజైన్
ముందు చేతిపై మెహందీ కోన్ తో చుక్కలు పెట్టి, వేళ్ల కణుపులను నింపి, వెనుక చేతిపై పూలు, ఆకుల డిజైన్ వేసుకుని అందంగా ముస్తాబవ్వండి.
స్టాంప్ తో మెహందీ
ఇప్పుడు మెహందీ స్టాంప్ లు దొరుకుతాయి. పూల డిజైన్ స్టాంప్ తీసుకుని, అరచేతిపై పెట్టి 5-10 నిమిషాల్లో కడిగేస్తే అందమైన ఎర్ర రంగు వస్తుంది.
గుండె ఆకారం మెహందీ
ఇన్స్టంట్ మెహందీ కోన్ తో అరచేతి నిండా చిన్న చిన్న గుండెలు వేసుకుని, 5-10 నిమిషాల తర్వాత కడిగేస్తే, అందమైన మెహందీ వస్తుంది.
బో డిజైన్ మెహందీ
చేతిపై ప్రత్యేకమైన డిజైన్ కావాలంటే, బో డిజైన్ వేసుకోవచ్చు. వెనుక చేతిపై కూడా చిన్న చిన్న బో డిజైన్లు వేసుకోవచ్చు.
బటర్ ఫ్లై మెహందీ
చేతులపై బటర్ ఫ్లై డిజైన్ అందంగా ఉంటుంది. ముందు చేతిపై పెద్ద, చిన్న బటర్ ఫ్లైలు వేసుకుని, వెనుక చేతిపై వేళ్లపై డిజైన్, మధ్యలో బటర్ ఫ్లై వేసుకోవచ్చు.