MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Tips
  • Hair Growth: జుట్టు బాగా రాలుతోందా? వీటిని రాస్తే.. ఇంకెప్పుడు ఆ సమస్య రాదు!

Hair Growth: జుట్టు బాగా రాలుతోందా? వీటిని రాస్తే.. ఇంకెప్పుడు ఆ సమస్య రాదు!

జుట్టు రాలే సమస్యను నివారించడానికి చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. కానీ ఇంట్లోనే దొరికే కొన్ని సహజ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో.. ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Jul 01 2025, 03:35 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
జుట్టు సమస్యల నివారణకు..

జుట్టు సమస్యల నివారణకు..

మనలో చాలామంది రకరకాల జుట్టు సమస్యలతో బాధపడుతుంటారు. ఈ సమస్యను నివారించడానికి.. కొంతమంది మార్కెట్లో దొరికే ఉత్పత్తులను ఉపయోగిస్తుంటారు. మరికొంతమంది పార్లర్‌లకు వెళ్లి హెయిర్ ట్రీట్‌మెంట్ చేయించుకుంటారు. దీనివల్ల జుట్టుకు హాని కలిగే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇంట్లో దొరికే సహజ పదార్థాలతో జుట్టు సమస్యలకు చెక్ పెట్టడం మంచిది అంటున్నారు నిపుణులు. ఆ పదార్థాలు ఏంటో.. వాటిని ఎలా వాడాలో ఇక్కడ తెలుసుకుందాం.  

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
గుడ్డు, పాలతో హెయిర్ మాస్క్

గుడ్డు, పాలతో హెయిర్ మాస్క్

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి అరకప్పు పాలు కలపండి. అందులో రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేయండి. కొద్దిగా ఆలివ్ నూనె వేయండి. అన్నింటిని బాగా కలిపి ప్యాక్ తయారుచేయండి. 

38
ఎలా వాడాలంటే?

ఎలా వాడాలంటే?

ఈ మిశ్రమాన్ని జుట్టు కొసల నుంచి వేర్ల వరకు పట్టించండి. కొంతసేపు అలాగే ఉంచి, తర్వాత షాంపూతో కడిగేయండి. గుడ్డు, పాలు జుట్టుకు ఎలా పోషణనిస్తాయో, అలాగే నిమ్మకాయ గుణం వల్ల చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు రాలే సమస్య ఆగుతుంది.  

48
పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్

పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్

పెరుగు, ఆపిల్ సైడర్ వెనిగర్, తేనెతో హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఒక గిన్నెలో అరకప్పు పెరుగు తీసుకుని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ కలపండి. 1 టీ స్పూన్ తేనె వేయండి. వాటిని బాగా కలిపి ప్యాక్ తయారు చేయండి.  

58
హెయిర్ మాస్క్ ఎలా వాడాలంటే?

హెయిర్ మాస్క్ ఎలా వాడాలంటే?

ఈ మిశ్రమాన్ని జుట్టు కొసల నుంచి వేర్ల వరకు పట్టించండి. కొంతసేపు అలాగే ఉంచి, షాంపూతో శుభ్రం చేయండి. ఇది జుట్టు రాలే సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది. దీనివల్ల జుట్టు రాలే సమస్య తగ్గి ఒత్తైన జుట్టు మీ సొంతమవుతుంది. 
 

68
అరటిపండు, కొబ్బరినూనెతో..

అరటిపండు, కొబ్బరినూనెతో..

అరటి పండు, కొబ్బరి నూనెతో మాస్క్ తయారు చేసుకోవచ్చు. సగం అరటిపండు తీసుకుని దాన్ని మెత్తగా చేయాలి. అందులో 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేయాలి. రెండింటిని బాగా కలిపి ప్యాక్ చేయాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పూర్తిగా పట్టించాలి. కొంతసేపు అలాగే ఉంచి.. షాంపూతో కడిగేయాలి. 

78
ఆముదం, కొబ్బరినూనె..

ఆముదం, కొబ్బరినూనె..

ఆముదం, కొబ్బరి నూనె, అలోవెరా జెల్‌తో కూడా హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ముందుగా అలోవెరా జెల్ తీసుకొని అందులో కొబ్బరి నూనె, ఆముదం కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివరి వరకు పట్టించాలి. అది ఆరిన తర్వాత షాంపూతో కడిగేయాలి.  

88
గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్

గుడ్డు, పెరుగు హెయిర్ మాస్క్

ఒక గిన్నెలో గుడ్డు పచ్చసొన తీసుకోండి. దీనికి 2 స్పూన్ల పెరుగు కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి పట్టించండి. అది ఆరిన తర్వాత షాంపూ చేయండి. వారానికి ఒకసారి ఈ మాస్క్ వాడితే జుట్టు రాలే సమస్య తగ్గుతుంది.  

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సౌందర్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
మహిళలు
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
Hair growth: జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే.. ఇదొక్కటి పెడితే చాలు!
Recommended image2
Onion Juice for Hair Growth: ఉల్లి రసాన్ని ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved