Hair growth: జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలంటే.. ఇదొక్కటి పెడితే చాలు!
నెయ్యి ఆరోగ్యానికి ఎంత మంచిదో మనకు తెలుసు. కానీ నెయ్యి జుట్టుకు కూడా మేలు చేస్తుందనే విషయం మీకు తెలుసా? జుట్టు పొడవుగా, ఒత్తుగా పెరగడానికి నెయ్యి చక్కగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నెయ్యిని ఎలా వాడితే జుట్టు బాగా పెరుగుతుందో ఇక్కడ చూద్దాం.

పొడవైన జుట్టు కోసం చిట్కాలు
జుట్టు అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ప్రస్తుత లైఫ్ స్టైల్, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాల వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతోంది. అంతేకాదు.. చాలా మందికి 30 ఏళ్లు కూడా దాటకముందే తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు పలచబారడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. మరి ఇలాంటి సమస్యలకు నెయ్యితో చెక్ పెట్టవచ్చు అంటున్నారు నిపుణులు. ఎలాగో ఇక్కడ చూద్దాం.
నెయ్యిలోని పోషకాలు
నెయ్యి అనేక విటమిన్లు, ఖనిజాలకు మంచి మూలం. నెయ్యి మన శరీర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో జుట్టు, చర్మానికి కూడా అంతే మేలు చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. నెయ్యి.. జుట్టుకు అవసరమైన తేమను అందించి.. ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుందని సూచిస్తున్నారు.
నెయ్యి ఎలా పనిచేస్తుందంటే?
నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, ముఖ్యమైన విటమిన్లు A, D లు ఉంటాయి. ఇవి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. తలపై చర్మం బాగా పోషణ పొందేలా చూసుకుంటాయి.
నెయ్యి జుట్టును మృదువుగా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. దీన్ని ఒకటి లేదా రెండుసార్లు వాడితే దెబ్బతిన్న జుట్టు తిరిగి ఆరోగ్యంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎలా ఉపయోగించాలి?
నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించవచ్చు. నూనెకు బదులుగా, రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని తీసుకుని రెండు చుక్కల తేనెతో కలిపి జుట్టు అంతా మాస్క్ లాగా అప్లై చేయాలి. కొంత సమయం తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఉత్తమ ఫలితాల కోసం..
తేనె సహజ మాయిశ్చరైజర్ లాగా పనిచేస్తుంది. ఇది నెయ్యితో కలిపి ఉత్తమ ఫలితాలను అందిస్తుంది. నెయ్యిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ E ఉంటాయి. తేనెలోని యాంటీ బాక్టీరియల్ లక్షణాలు జుట్టును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.