Onion Juice for Hair Growth: ఉల్లి రసాన్ని ఇలా వాడితే జుట్టు ఒత్తుగా పెరగడం పక్కా!
జుట్టు.. ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది. అందుకే చాలామంది అమ్మాయిలు నల్లటి, పొడవాటి జుట్టును కోరుకుంటారు. చాలామంది జుట్టు పెరుగుదలకు.. ఉల్లి రసాన్ని వాడుతుంటారు. అయితే ఉల్లి రసాన్ని ఎలా వాడితో జుట్టు దట్టంగా పెరుగుతుందో ఇక్కడ చూద్దాం.

నల్లటి జుట్టుకోసం ఉల్లిరసం..
చాలామంది అమ్మాయిలు దట్టమైన, పొడవాటి జుట్టు కోసం ఉల్లి రసాన్ని వాడుతుంటారు. అయితే ఉల్లి రసం వాడినా జుట్టు సరిగ్గా పెరగట్లేదని కొందరు అనుకుంటారు. నిజానికి దాన్ని సరిగ్గా ఎలా వాడాలో తెలియకపోవడం కూడా జుట్టు పెరగకపోవడానికి కారణం అంటున్నారు నిపుణులు. మరి ఈ రసాన్ని ఎలా వాడితే మంచి ప్రయోజనాలు చేకూరుతాయో ఇక్కడ చూద్దాం...
ప్రతి ఒక్కరు నల్లటి, పొడవైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. కానీ కాలుష్యం, చెడు ఆహారపు అలవాట్లు, నిద్ర సరిగ్గా లేకపోవడం వంటి కారణాలతో జుట్టు సమస్యలు వస్తుంటాయి. వాటికి ఉల్లిరసంతో ఎలా చెక్ పెట్టాలో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంట్లో తయారు చేసిన ఉల్లిరసంతో..
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లితో తయారు చేసిన చాలా రకాల బ్యూటీ ప్రోడక్టులు దొరుకుతున్నాయి. అయితే మనం ఇంట్లో తయారుచేసుకొని వాడితేనే మంచి ఫలితాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి రసాన్ని ఎలా తయారుచేయాలి? జుట్టుకు ఎలా ఉపయోగించాలో చూద్దాం.
ఉల్లి రసాన్ని సరిగ్గా రాసుకోకపోతే?
నిపుణుల ప్రకారం ఉల్లిరసాన్ని జుట్టుకు తప్పుగా రాసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదు. సరిగ్గా రాసుకుంటేనే జుట్టు పొడవుగా, దట్టంగా పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటుంది.
ఉల్లి రసాన్ని ఎలా చేయాలంటే?
చాలామంది ఉల్లి రసాన్ని తయారు చేసిన వెంటనే నేరుగా లేదా ఫిల్టర్ చేసి రాసుకుంటారు. కానీ అలా చేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ఈ రసం పులిసే వరకు ఆగాలట. ఉల్లి రసాన్ని 72 గంటల వరకు పులియబెట్టి.. ఆ తర్వాత జుట్టుకు రాసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఉల్లి రసాన్ని ఎలా వాడాలంటే?
జుట్టుకు ఉల్లి రసం రాసుకోవాలంటే ముందుగా తలని తడి చేసుకోవాలి. తర్వాత పులిసిన ఉల్లి రసంతో జుట్టుకు 2-3 నిమిషాలు మసాజ్ చేయాలి. తర్వాత జుట్టు మొత్తాన్ని క్లాత్ తో కవర్ చేయాలి. 30-60 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత జుట్టును రెండుసార్లు శాంపూతో కడగాలి. 4-6 వారాల పాటు రోజుకు ఒకటి లేదా రెండుసార్లు వాడాలి. ఇలా వాడితే మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి.
గమనిక:
ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఇంటి చిట్కాలు పాటించే ముందు నిపుణులు లేదా వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.