MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Tech News
  • Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు

Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు

Free Aadhaar Update:ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఆధార్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. 6 నెలల పాటు రూ.75 ఫీజును యూఐడీఏఐ పూర్తిగా మినహాయించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2026, 12:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఆధార్‌ కొత్త రూల్స్ చూశారా? ఆరు నెలల పాటు ఆ ఫీజు పూర్తిగా రద్దు
Image Credit : Gemini

ఆధార్‌ కొత్త రూల్స్ చూశారా? ఆరు నెలల పాటు ఆ ఫీజు పూర్తిగా రద్దు

ఆధార్ కార్డ్ వాడుతున్న వారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. మీ ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే మీకు కేంద్ర ప్రభుత్వం సూపర్ ఛాన్స్ ఇచ్చింది. జూలై 1 నుంచి సరికొత్త ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని పూర్తిగా ఉచితంగా అప్‌డేట్ చేసుకోవచ్చు. ఈ మేరకు విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఒక కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డ్ హోల్డర్లు తమ వివరాలను అప్‌డేట్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు యూఐడీఏఐ ఈ నిర్ణయం తీసుకుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రూ. 75 ఫీజు పూర్తిగా మాఫీ
Image Credit : Asianet News

రూ. 75 ఫీజు పూర్తిగా మాఫీ

నిజానికి ప్రస్తుతం ఆధార్ కార్డ్‌లో ఈమెయిల్ అడ్రస్‌ను మార్చుకోవాలి అంటే రూ. 75 ఫీజు కట్టాల్సి ఉంటుంది. కానీ, ఇకపై ఆ అవసరం లేదు. కొత్త ఆధార్ మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ సర్వీస్ వాడుకుంటే ఒక్క రూపాయి కూడా కట్టక్కర్లేదు. ఈ ఫ్రీ సర్వీస్ ఆరు నెలల పాటు అందుబాటులో ఉంటుంది. అంటే 2026 జూలై 1 నుంచి 2026 డిసెంబర్ 31 వరకు ఎలాంటి ఫీజు లేకుండానే ఫ్రీగా ఈమెయిల్ ఐడీని అప్‌డేట్ చేసుకోవచ్చని యూఐడీఏఐ తన నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది.

Related Articles

Related image1
Graveyard Dating: స్మశానంలో డేటింగ్ ఏంటి బాబోయ్? యువత కొత్త పిచ్చి.. అసలు విషయం ఇదే !
Related image2
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
36
పాత ఎమ్‌ఆధార్ యాప్ క్లోజ్
Image Credit : Getty

పాత ఎమ్‌ఆధార్ యాప్ క్లోజ్

ఈ గుడ్ న్యూస్‌తో పాటే యూఐడీఏఐ మరో ఇంపార్టెంట్ అప్‌డేట్ కూడా ఇచ్చింది. ఇప్పటివరకు మనం వాడుతున్న పాత 'ఎమ్‌ఆధార్' (mAadhaar) మొబైల్ యాప్‌ను త్వరలోనే పూర్తిగా నిలిపివేయనున్నారు. అందుకే యూజర్లందరూ వెంటనే కొత్తగా లాంచ్ చేసిన 'ఆధార్ యాప్' (Aadhaar App) లోకి మారిపోవాలని అధికారులు సూచించారు. ఈ కొత్త యాప్ పాత దానికంటే చాలా ఫాస్ట్‌గా పనిచేస్తుందని, ఇందులో అదిరిపోయే అప్‌గ్రేడెడ్ ఫీచర్లు ఉన్నాయని చెప్పారు.

46
ఆధార్ సరికొత్త యాప్‌లో ప్రైవసీ ఫీచర్లు
Image Credit : Getty

ఆధార్ సరికొత్త యాప్‌లో ప్రైవసీ ఫీచర్లు

కొత్తగా వచ్చిన ఆధార్ యాప్‌ను డిజిటల్ ఐడెంటిటీని భద్రంగా ఉంచుకునేలా డిజైన్ చేశారు. ఇందులో ప్రైవసీకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. మన ఆధార్‌ను చాలా సేఫ్‌గా, ఈజీగా ఎక్కడైనా చూపించుకోవడానికి, వెరిఫై చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది. హోటల్ చెక్ ఇన్ సమయంలో ఓవీఎస్ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సినిమా టికెట్ల బుకింగ్ కోసం ఏజ్ వెరిఫికేషన్, హాస్పిటల్ అడ్మిషన్ల కోసం విజిటర్స్ వెరిఫికేషన్, అలాగే గిగ్ వర్కర్స్, సర్వీస్ పార్ట్‌నర్ల వెరిఫికేషన్ లాంటి ఎన్నో పనుల కోసం ఈ యాప్‌ను వాడుకోవచ్చు. ఫేస్ వెరిఫికేషన్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది.

56
ఒకే యాప్‌లో ఫ్యామిలీ ప్రొఫైల్స్
Image Credit : Getty

ఒకే యాప్‌లో ఫ్యామిలీ ప్రొఫైల్స్

ఈ లేటెస్ట్ యాప్‌లో సింగిల్ క్లిక్‌తో బయోమెట్రిక్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోవచ్చు. మీ ఆధార్ ఎక్కడెక్కడ వాడారో అథెంటికేషన్ హిస్టరీని కూడా చెక్ చేసుకోవచ్చు. కాంటాక్ట్ డీటెయిల్స్ షేర్ చేయడానికి క్యూఆర్-బేస్డ్ కాంటాక్ట్ కార్డ్ ఫీచర్ కూడా ఉంది. అన్నిటికంటే బెస్ట్ ఫీచర్ ఏంటంటే.. "వన్ ఫ్యామిలీ - వన్ యాప్" కాన్సెప్ట్‌తో ఒకే మొబైల్ డివైజ్‌లో ఐదు ఆధార్ ప్రొఫైల్స్ వరకు మేనేజ్ చేయవచ్చు. అడ్రస్ అప్‌డేట్‌తో పాటు, ప్రస్తుతం రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను కూడా ఈ యాప్ ద్వారా మార్చుకోవచ్చు. భవిష్యత్తులో మరికొన్ని అప్‌డేట్ సర్వీసులు తీసుకురానున్నారు.

66
ఆధార్ డేటా మినిమైజేషన్.. నో టెన్షన్
Image Credit : Aadhaar Official/Instagram

ఆధార్ డేటా మినిమైజేషన్.. నో టెన్షన్

ఈ యాప్‌లో ఉన్న ఇంకొక క్రేజీ ఫీచర్ ఏంటంటే 'సెలెక్టివ్ క్రిడెన్షియల్ షేరింగ్'. అంటే ఎక్కడైనా వెరిఫికేషన్ అవసరమైనప్పుడు కస్టమైజ్డ్ క్యూఆర్ కోడ్స్ ద్వారా మీకు కావాల్సిన గుర్తింపు వివరాలను మాత్రమే షేర్ చేయవచ్చు. దీనివల్ల వెరిఫై చేసే వాళ్లు మీ పూర్తి ఆధార్ నంబర్‌ను స్టోర్ చేసుకోలేరు. కేవలం డిజిటల్ సైన్ ఉన్న వెరిఫైడ్ వివరాలు మాత్రమే వెళ్తాయి. ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ చట్టానికి లోబడి డేటా మినిమైజేషన్‌ను ప్రోత్సహిస్తుంది. కాబట్టి ప్రైవసీ లీక్ అవుతుందనే టెన్షనే ఉండదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
భారత దేశం
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Reels: రీల్స్ తెగ చూస్తుంటారా.? మీ జేబుకు చిల్లు ప‌డుతున్న‌ట్లే, ఎలాగంటే
Recommended image2
iQOO Neo 11 Ultra: 9100mAh బ్యాటరీ, 2K డిస్‌ప్లేతో ఐక్యూ కొత్త స్మార్ట్‌ఫోన్.. అదిరిపోయే ఫీచర్లు ఇవే
Recommended image3
Planetary Parade: నక్షత్రాల వర్షం.. ఆకాశంలో అరుదైన అద్భుతం.. ఒకే రోజు 4 ఖగోళ వింతలు
Related Stories
Recommended image1
Graveyard Dating: స్మశానంలో డేటింగ్ ఏంటి బాబోయ్? యువత కొత్త పిచ్చి.. అసలు విషయం ఇదే !
Recommended image2
Indian Cricketers Padma Shri: రోహిత్ శర్మకు దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం.. పద్మశ్రీ అందుకున్న 16 మంది క్రికెటర్లు వీరే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved