MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Technology
  • Tips
  • TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!

TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!

TV Remote: ఇంట్రెస్టింగ్‌గా టీవీ చూస్తున్నప్పుడు రిమోట్ పనిచేయకపోతే చాలా కోపం వస్తుంది. వెంటనే దాన్ని పక్కన పడేసి కొత్తది కొనడానికి వెళ్తాం. కానీ ప్రతీ సమస్యకు కొత్త రిమోట్ కొనాల్సిన పనిలేదు. ఇంట్లోనే దాన్ని ఈజీగా బాగుచేసుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

2 Min read
Author : Kavitha G
Published : Aug 04 2026, 10:30 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
టీవీ రిమోట్ రిపేరింగ్ టిప్స్
Image Credit : AI

టీవీ రిమోట్ రిపేరింగ్ టిప్స్

ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి రిమోట్ పనిచేయకపోతే కోపం రావడం సహజం. వెంటనే బ్యాటరీలు మార్చి చూస్తాం. అప్పటికీ పనిచేయకపోతే, రిమోట్ పాడైపోయిందని కొత్తది కొనడానికి వెళ్తాం. కానీ, టీవీ రిమోట్‌ను బాగుచేయడానికి కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. చాలావరకు రిమోట్ సమస్యలను కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి, కొత్త రిమోట్ కొనే ముందు ఈ టిప్స్ ప్రయత్నించి చూడండి. కచ్చితంగా ఉపయోగపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఇలా చెక్ చేయండి..
Image Credit : Gemini AI

ఇలా చెక్ చేయండి..

ముందుగా.. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఆన్ చేసి, రిమోట్ చివర ఉన్న IR బల్బును కెమెరాకు ఎదురుగా పెట్టాలి. ఇప్పుడు రిమోట్‌లోని ఏదైనా బటన్ నొక్కి చూడాలి. అప్పుడు ఫోన్ స్క్రీన్‌పై ఊదా రంగు లైట్ కనిపిస్తే, రిమోట్ సిగ్నల్ పంపిస్తున్నట్లు అర్థం. అప్పుడు సమస్య టీవీ సెన్సార్‌లో ఉండొచ్చు. లైట్ కనిపించకపోతే, సమస్య రిమోట్‌లోనే ఉన్నట్లు. 

అప్పుడు రిమోట్ నుంచి బ్యాటరీలను పూర్తిగా తీసేయాలి. ఆపై, పవర్ బటన్‌ను ఓ 30 సెకన్ల పాటు నొక్కి పట్టుకోవాలి. ఇది లోపల పేరుకుపోయిన అనవసరమైన విద్యుత్ ని బయటకు పంపుతుంది. ఆ తర్వాత కొత్త బ్యాటరీలు వేసి చెక్ చేయాలి. బ్యాటరీలు పెట్టే చోట తుప్పు లేదా మురికి ఉంటే, దాన్ని నెమ్మదిగా శుభ్రం చేయడం ముఖ్యం.

కొన్ని సందర్భాల్లో రిమోట్ బాగానే పనిచేస్తున్నా, టీవీ ముందు ఉన్న ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌ను ఏదైనా వస్తువు మూసివేస్తే సిగ్నల్ అందదు. టీవీ ముందు ఏవైనా వస్తువులు ఉంటే వాటిని తొలగించి మళ్లీ ప్రయత్నించాలి. అలాగే రిమోట్‌ను టీవీ వైపు సరిగ్గా చూపించి ఉపయోగించాలి.

Related Articles

Related image1
Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?
Related image2
Telugu Saying: ధర తక్కువని కొంటే, దురద ఎక్కువైందట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
34
రిమోట్‌ను విప్పి శుభ్రం చేయడం
Image Credit : Gemini AI

రిమోట్‌ను విప్పి శుభ్రం చేయడం

ఒకవేళ పైన చెప్పిన టిప్స్ పనిచేయకపోతే, రిమోట్ లోపల శుభ్రం చేయాల్సి ఉంటుంది. బ్యాటరీలు తీసేసి, రిమోట్ స్క్రూలను విప్పాలి. ఒక పల్చటి ప్లాస్టిక్ కార్డు లేదా ప్రైయింగ్ టూల్ సాయంతో రిమోట్ పక్క భాగాలను నెమ్మదిగా వేరుచేసి ఓపెన్ చేయాలి. లోపల ఉన్న రబ్బర్ కీ-ప్యాడ్, గ్రీన్ కలర్ సర్క్యూట్ బోర్డును వేరు చేయాలి. ఒక కాటన్ బడ్‌లో ఐసోప్రొపైల్ ఆల్కహాల్ కొద్దిగా తీసుకొని, సర్క్యూట్ బోర్డును నెమ్మదిగా తుడవాలి. రబ్బర్ కీ-ప్యాడ్‌ను సబ్బు నీటితో కడిగి, అది పూర్తిగా ఆరిన తర్వాత మళ్లీ బిగించాలి. కొద్దిగా తేమ ఉన్నా రిమోట్ మళ్లీ పాడయ్యే ప్రమాదం ఉంటుంది.

44
ప్రత్యామ్నాయ మార్గాలు?
Image Credit : Gemini AI

ప్రత్యామ్నాయ మార్గాలు?

ఇవన్నీ చేశాక కూడా రిమోట్ పనిచేయకపోతే, దాని IR LED లేదా మైక్రోచిప్ వంటి లోపలి భాగాలు పాడై ఉండొచ్చు. రిమోట్ కిందపడి పగిలిపోయినా లేదా నీళ్లలో పడినా, దాన్ని రిపేర్ చేయడం కన్నా కొత్తది కొనడమే మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image2
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Recommended image3
True 5G: ఫోన్‌లో ఫుల్ 5G సిగ్నల్ ఉన్నా ఇంటర్నెట్ రావడం లేదా? అయితే ఇలా చేయండి !
Related Stories
Recommended image1
Interesting Facts: నదిలో నీళ్లు ప్రవహిస్తున్నా బ్రిడ్జి ఎలా కడతారో తెలుసా?
Recommended image2
Telugu Saying: ధర తక్కువని కొంటే, దురద ఎక్కువైందట! పెద్దలు ఈ సామెత ఊరికే చెప్పలేదు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved