MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • Tips
  • Cockroach Removal Tips: ఇలా చేస్తే ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు!

Cockroach Removal Tips: ఇలా చేస్తే ఇంట్లో ఒక్క బొద్దింక కూడా ఉండదు!

వర్షాకాలంలో బొద్దింకల సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి. ముఖ్యంగా కిచెన్, బాత్రూమ్ లలో ఎక్కువగా ఉంటాయి. ఇవి చాలా ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. అయితే కొన్ని చిట్కాలతో బొద్దింకలను తరిమి కొట్టవచ్చు. ఎలాగో ఇక్కడ చూద్దాం.  

1 Min read
Author : Kavitha G
Published : Jul 30 2025, 04:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
బొద్దింకల సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు
Image Credit : our own

బొద్దింకల సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు

వర్షాకాలంలో తేమ, మురికి వల్ల బొద్దింకల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా బాత్రూమ్‌లు, వంటగదుల్లో బొద్దింకల సైన్యం బీభత్సం సృష్టిస్తుంది. ఏ మూలలో చూసినా అవే కనిపిస్తాయి. వీటివల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అయితే కొన్ని చిట్కాలతో బొద్దింకలను ఇంట్లో నుంచి తరిమి కొట్టవచ్చు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం.  

26
ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి
Image Credit : AI

ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి

బొద్దింకలు ఎక్కువగా రావడానికి కారణం అపరిశుభ్ర వాతావరణం. కాబట్టి ఇంటిని పొడిగా, శుభ్రంగా ఉంచండి. దానివల్ల బొద్దింకల సమస్య తగ్గుతుంది. మురికి పాత్రలను వెంటనే శుభ్రం చేయండి. ఆహార పదార్థాలపై మూతపెట్టి ఉంచండి.

Related Articles

Related image1
Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!
Related image2
Insects Control Tips: ఇలా చేస్తే ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు వెంటనే పారిపోతాయి..!
36
బేకింగ్ సోడాతో..
Image Credit : freepik

బేకింగ్ సోడాతో..

బేకింగ్ సోడా, పంచదారతో బొద్దింకల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఒక గిన్నెలో సమాన పరిమాణంలో బేకింగ్ సోడా, పంచదార కలపండి. బొద్దింకలు తిరిగే ప్రదేశాల్లో చల్లండి. పంచదార వాటిని ఆకర్షిస్తుంది. బేకింగ్ సోడా తిన్న వెంటనే అవి చనిపోతాయి.

46
వేప నూనె..
Image Credit : Getty

వేప నూనె..

వేప.. బొద్దింకలకు సహజ శత్రువు. వేప నూనెను నీటిలో కలిపి స్ప్రే చేయండి. లేదా ఇంట్లోని మూలల్లో వేప ఆకులు వేయండి. దీని ఘాటైన వాసన బొద్దింకలను తరిమి కొడుతుంది. ఈ పద్ధతి చాలా సురక్షితం. పర్యావరణానికి కూడా మంచిది.

56
బోరాక్స్ పౌడర్
Image Credit : freepik

బోరాక్స్ పౌడర్

బోరాక్స్ పౌడర్‌ను పంచదార లేదా పిండితో కలిపి చిన్న ఉండలుగా చేయండి. వాటిని వంటగది, అల్మారాలు లేదా తడిగా ఉండే ప్రదేశాల్లో ఉంచండి. వాటిని తిన్న తర్వాత బొద్దింకలు చనిపోతాయి. పిండి ఉండలను.. చిన్న పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచండి.

66
పగుళ్లు, రంధ్రాలు ఉంటే..
Image Credit : Getty

పగుళ్లు, రంధ్రాలు ఉంటే..

బొద్దింకల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే ఇంటి గోడలు, పగుళ్లను మూసివేయండి. వర్షాకాలంలో రంధ్రాలు, పగుళ్లు సర్వసాధారణం. బొద్దింకలు ఈ పగుళ్లలో నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి. కాబట్టి ఈ రంధ్రాలను సిమెంట్, లేదా సిలికాన్‌తో మూసివేయండి. ఇది బొద్దింకల ప్రవేశాన్ని ఆపుతుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఆరోగ్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bluetooth vs Wired Earphones.. వీటిలో ఏది బెటర్? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
Recommended image2
వీటితో ఇల్లు తుడిస్తే చాలు.. బొద్దింకలు, బల్లులు పరార్
Recommended image3
నాన్ స్టిక్ పాత్రను ఎంతకాలం వాడొచ్చు? వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
Related Stories
Recommended image1
Lizards: ఇలా చేస్తే.. ఇంట్లో ఒక్క బల్లి కూడా ఉండదు!
Recommended image2
Insects Control Tips: ఇలా చేస్తే ఇంట్లో ఉన్న బొద్దింకలు, బల్లులు వెంటనే పారిపోతాయి..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved