చిన్న చిన్న రంధ్రాల ద్వారా బల్లి సులభంగా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. కాబట్టి ఎక్కడైనా రంధ్రాలు ఉంటే మూసివేయండి.
కాఫీ పొడి ఉపయోగించి బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టవచ్చు. బల్లులు వచ్చే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు.
బల్లులను భయపెట్టే వాటిలో గుడ్డు పెంకులు ఒకటి. ఇవి ఉంటే ఆ ప్రాంతానికి బల్లి రాదు.
ఇళ్లు శుభ్రంగా లేకుంటే కీటకాలు, చీమలు, దోమలు వస్తుంటాయి. వాటిని పట్టుకోవడానికి బల్లులు వస్తాయి. కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి.
బల్లిని తరిమికొట్టడానికి కర్పూర తులసి నూనె వాడటం మంచిది. దీని ఘాటైన వాసన బల్లిని దూరంగా ఉంచుతుంది. బల్లి వచ్చే ప్రదేశాల్లో స్ప్రే చేస్తే చాలు.
బల్లిని తరిమికొట్టడానికి వెల్లుల్లి, ఉల్లిపాయ సహాయపడతాయి. వీటి ఘాటైన వాసనను బల్లి భరించలేదు.