- Home
- Technology
- Tips
- Coriander Face Pack for Glowing Skin: కొత్తిమీరను ఇలా వాడితే ముఖంలో గ్లో పెరగడం పక్కా!
Coriander Face Pack for Glowing Skin: కొత్తిమీరను ఇలా వాడితే ముఖంలో గ్లో పెరగడం పక్కా!
సాధారణంగా మనం కొత్తిమీరను చాలా రకాల వంటల్లో వాడుతుంటాం. కానీ కొత్తిమీరను ముఖానికి వాడచ్చనే విషయం మీకు తెలుసా? కొత్తిమీర పేస్ట్ ని ముఖానికి రాసుకుంటే మొటిమలు, మచ్చలు తగ్గడంతోపాటు చాలా ప్రయోజనాలు ఉన్నాయట. అవేంటో ఇక్కడ చూద్దాం.

కొత్తిమీర ఫేస్ ప్యాక్
కొత్తిమీరను మనం అనేక వంటకాల్లో వాడుతుంటాం. దీని ఆకులు మాత్రమే కాదు, కాండం, విత్తనాలు, వేర్లు కూడా ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొత్తిమీర వంటలకు రుచి, వాసనను పెంచుతుంది. అంతేకాదు శరీరానికి అవసరమైన విటమిన్ ఇ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలను కూడా అందిస్తుంది. అందువల్ల ఇది వంటగదిని దాటి చర్మ సంరక్షణలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది. మరి కొత్తిమీరను చర్మానికి ఎలా ఉపయోగించాలో ఇక్కడ చూద్దాం.
నల్లటి మచ్చల నివారణకు..
ముఖం మీద నల్ల మచ్చలు.. అందాన్ని తగ్గిస్తాయి. ఈ సమస్యతో బాధపడేవారికి కొత్తిమీర మంచి పరిష్కారం. తాజా కొత్తిమీర ఆకులను శుభ్రంగా కడిగి.. పేస్ట్ లా చేయాలి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసుకొని 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ పేస్ట్ మొటిమలు, మచ్చలను తగ్గించడంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది.
మృదువైన చర్మం కోసం..
మృదువైన చర్మం కోసం కొత్తిమీరను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో పెరుగు, అలోవెరా జెల్, కొత్తిమీర పేస్ట్ కలపాలి. ఈ మిశ్రమానికి కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని ముఖానికి అప్లై చేసి ఓ 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ ప్యాక్ ను వారానికి రెండు సార్లు వాడవచ్చు. దీనివల్ల చర్మం మృదువుగా, అందంగా మారుతుంది.
శుభ్రమైన చర్మంకోసం..
కొత్తిమీర ఆకులను నీటిలో నానబెట్టి.. ఆ నీటిని ముఖానికి ఉపయోగించవచ్చు. లేదా కొత్తిమీర ఆకులను నీటిలో మరిగించి ఆ నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. దీనివల్ల మృతకణాలు తొలగిపోయి.. చర్మం శుభ్రపడుతుంది.
కొత్తిమీర, పుదీన ఫేస్ ప్యాక్..
కొత్తిమీర, పుదీనా ఆకులను కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఈ మిశ్రమంలో రాతి ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ చిట్కాలు పాటించడం ద్వారా అందమైన, కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది.