MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Technology
  • Tips
  • Phone Charging Problem: మీ ఫోన్ త్వరగా పాడైపోవడానికి కారణమిదే

Phone Charging Problem: మీ ఫోన్ త్వరగా పాడైపోవడానికి కారణమిదే

Phone Charging Problem: కొందరు గంటలకొద్దీ ఫోన్లు వాడతారు. ఛార్జింగ్‍లో ఉన్నా వదలరు. అదే పనిగా ఛార్జింగ్ పెడుతూ, తీస్తూ ఉంటారు. ఫోన్ ఎంత ముఖ్యమో..దాని సరిగ్గా చూసుకోవడమూ అంతే అవసరం. చాలా మంది ఫోన్లు త్వరగా దెబ్బతినడానికి కొన్ని చిన్న కారణాలున్నాయి. 

2 Min read
Author : Nandini Arava
Published : Mar 07 2026, 10:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
చేతిలో ఫోన్ లేనిదే అడుగు పడని పరిస్థితి
Image Credit : our own

చేతిలో ఫోన్ లేనిదే అడుగు పడని పరిస్థితి

ఒకప్పుడు కూడు, గూడు, బట్ట ఉంటే చాలనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు అవేవీ లేకపోయినా పర్లేదు...చేతిలో సెల్‍ఫోన్ ఉంటే చాలు. ఈ రోజుల్లో ఫోన్ లేని వారు ఎవరున్నారు? కాసేపు చేతిలో లేకపోయినా విలవిలలాడిపోతారు. ఏదో పోగొట్టుకున్నట్లు ఫీలవుతారు. ఛార్జింగ్‍లో ఉన్నాసరే దానివంకే చూస్తారు. కొంతమంది ఆగలేక...ఛార్జింగ్‍ పెట్టినా కూడా వాడేస్తుంటారు. బాత్రూంకు వెళ్లినా, తింటున్నా, స్నానం చేస్తున్నా, ఇంట్లో పనులు చేస్తున్నా, ఎప్పుడైనా, ఎక్కడైనా ఫోన్ ఉండాల్సిందే. అది లేకపోతే మనిషి శరీరంలో ఒక పార్ట్ లేనట్టే భావిస్తారు. మనిషి జీవితంతో అలా అతుక్కుపోయింది మరి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఫోన్ ఎంత ముఖ్యమో, దాని వాడే విధానం అంతే ముఖ్యం
Image Credit : our own

ఫోన్ ఎంత ముఖ్యమో, దాని వాడే విధానం అంతే ముఖ్యం

ఫోన్ ముఖ్యమే. పదే పదే వాడుతూ ఉంటే దాని త్వరగా పాడైపోదు మరి. ఫోన్ ఎంత ముఖ్యమో, దాన్ని ఆలనా, పాలనా కూడా అంతే ముఖ్యం. చాలా మంది ఫోన్లు ఏళ్ల తరబడి బాగానే పనిచేస్తాయి. అయితే కొందరి ఫోన్లు మాత్రం మొబైల్ చార్జింగ్ పోర్ట్ లేదా జాక్ త్వరగా పాడవుతుంది. దీనికి కారణమయ్యే కొన్ని తప్పులు ఉన్నాయి.

Related Articles

Related image1
Phone Overheating : ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Related image2
Mobile Phone: ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ రావడం పక్కా
36
ఫోన్ పౌచ్ సరిగ్గా లేకపోవడం
Image Credit : our own

ఫోన్ పౌచ్ సరిగ్గా లేకపోవడం

ఫోన్ పౌచ్ వల్ల కూడా చార్జింగ్ పోర్ట్ దెబ్బతింటుంది. పౌచ్ చార్జింగ్ పోర్ట్‌ను కొంతమేర కప్పేసినట్లు ఉంటే చార్జర్ పెట్టేటప్పుడు పిన్‌ను బలవంతంగా లోపలికి పెట్టాల్సి ఉంటుంది. ఇలా రోజూ చేయడం వల్ల చార్జింగ్ జాక్ లూజ్ అవుతుంది. దీంతో ఫోన్ సరిగా చార్జింగ్ ఎక్కకపోవచ్చు.

46
చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయడం
Image Credit : our own

చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్ యూజ్ చేయడం

చాలా మంది ఫోన్ చార్జింగ్‌లో పెట్టినా రీల్స్ చూడటం, గేమ్స్ ఆడటం, మాట్లాడటం వంటివి చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల చార్జింగ్ కేబుల్‌పై ప్రెజర్ పడుతుంది. దీని వల్ల చార్జింగ్ పోర్ట్ నెమ్మదిగా పాడైపోతుంది.

56
క్వాలిటీ లేని చార్జర్లు వాడటం
Image Credit : our own

క్వాలిటీ లేని చార్జర్లు వాడటం

చాలామంది తమ ఫోన్‌కు అసలు చార్జర్ కాకుండా ఇతరుల చార్జర్లు వాడేస్తుంటారు. నాణ్యత లేని చార్లర్లైతే వేడెక్కే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఛార్జింగ్ పోర్టు దెబ్బతింటుంది. అలాగే వేర్వేరు చార్జర్ పిన్లు కూడా పోర్ట్‌కు నష్టం కలిగించవచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు మీ ఫోన్‌కు ఇచ్చిన అసలు చార్జర్‌ను ఉపయోగించడం మంచిది.

66
చార్జర్‌ పదేపదే పెడుతూ, తీయడం
Image Credit : our own

చార్జర్‌ పదేపదే పెడుతూ, తీయడం

కొంతమంది ఫోన్‌ ఛార్జింగ్ ఎక్కేవరకూ ఆగలేరు.కొద్దిసేపు పెట్టి మళ్లీ తీసేస్తుంటారు. ఇలా తరచూ చార్జర్ పిన్‌ను పెట్టడం, తీసేయడం వల్ల చార్జింగ్ పోర్ట్ గ్రిప్ లూజ్ అవుతుంది. తర్వాత చార్జర్ సరిగా ఫిట్ కాకపోవచ్చు.

చార్జింగ్ సమయంలో కేబుల్‌ను గట్టిగా లాగడం

ఫోన్ తీసేటప్పుడు కేబుల్‌ను ఒక్కసారిగా లాగకూడదు. గట్టిగా లాగేస్తే చార్జింగ్ జాక్ లోపల నుంచి దెబ్బతింటుంది. కాబట్టి చార్జర్‌ను ఎప్పుడూ మెల్లగా తీయాలి. బలవంతంగా లాగడం వల్ల మొబైల్ పోర్ట్ త్వరగా దెబ్బతింటుంది. సో సెల్‍ఫోన్ ఎక్కువకాలం పనిచేయాలంటే చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా ఉపయోగిస్తే జీవితకాలం పెరుగుతుంది.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
సాంకేతిక వార్తలు చిట్కాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
TV Remote: టీవీ రిమోట్ పనిచేయట్లేదా? 5 నిమిషాల్లో ఇంట్లోనే ఈజీగా రిపేర్ చేసేయండిలా!
Recommended image2
Smart Shopping Tips : ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఏ నెలలో చీఫ్ గా దొరుకుతుందో తెలుసా?
Recommended image3
Aadhaar: ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్.. జూలై 1 నుంచి ఫ్రీ అప్‌డేట్.. కొత్త యాప్‌లో సూపర్ ఫీచర్లు
Related Stories
Recommended image1
Phone Overheating : ఫోన్ వేడెక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image2
Mobile Phone: ఎప్పుడు చూసినా ఫోన్ పట్టుకునే ఉంటున్నారా? అయితే ఈ ప్రాబ్లమ్స్ రావడం పక్కా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved