పుదీనా నూనెలో మెంథాల్ ఉంటుంది. దీని ఘాటైన వాసనను కీటకాలు భరించలేవు. ఈ నూనెను నీటిలో కలిపి ఇల్లు తుడిస్తే సరిపోతుంది.
ఇల్లు తుడిచేటప్పుడు నీటిలో వెనిగర్, బేకింగ్ సోడా కలిపి తుడిస్తే చాలు. ఇక కీటకాల బెడద ఉండదు.
ఉల్లిపాయ, వెల్లుల్లి రసాన్ని నీటిలో కలిపి బొద్దింకలు వచ్చే ప్రదేశాల్లో తుడవాలి. వాటి వాసన కీటకాలకు నచ్చదు.
నీటిలో నిమ్మరసం, ఉప్పు కలిపి ఇల్లు తుడిస్తే చాలు. దీని వాసన, ఆమ్లత్వం బొద్దింకలు రాకుండా నివారిస్తాయి.
కర్పూరం, లవంగ నూనెను నీటిలో కలిపి బొద్దింకలు, బల్లులు తిరిగే ప్రదేశాల్లో తుడవాలి. దీని ఘాటైన వాసనను అవి తట్టుకోలేవు.
బిర్యానీ ఆకును ఉపయోగించి కూడా కీటకాలను దూరంగా ఉంచవచ్చు. దీని ఘాటైన వాసనను బొద్దింకలు తట్టుకోలేవు.
కాఫీ పొడిని ఉపయోగించి కూడా కీటకాలను తరిమికొట్టవచ్చు. బొద్దింకలు, బల్లులు ఎక్కువగా వచ్చే ప్రదేశాల్లో చల్లితే సరిపోతుంది.
Kitchen Hacks: ఈ వస్తువులను ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు!
Kitchen Hacks: కిచెన్ లో ఎక్కువరోజులు వాడకూడని వస్తువులు ఇవే!
Tips to Get Rid of Rats: ఇంట్లో ఒక్క ఎలుక కూడా ఉండకూడదంటే ఇలా చేయండి!
Tips and Tricks: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరాలంటే ఇలా చేయండి!