Kitchen tips: వీటిని పొరపాటున కూడా స్టీల్ పాత్రల్లో పెట్టకూడదు! ఎందుకో తెలుసా?
ఇంట్లో మనం స్టీల్ పాత్రలను రెగ్యులర్ గా వాడుతుంటాం. అయితే కొన్ని ఆహార పదార్థాలను స్టీలో పాత్రల్లో అస్సలు నిల్వచేయకూడదట. వాటి వల్ల ఆరోగ్యానికి హాని జరిగే అవకాశం ఉందట. మరి ఏ పదార్థాలను స్టీల్ పాత్రల్లో పెట్టకూడదో ఇక్కడ తెలుసుకుందాం.
- FB
- TW
- Linkdin
Follow Us

స్టీల్ పాత్రల్లో ఆహారాన్ని ఉంచితే ఏమవుతుంది?
సాధారణంగా మనలో చాలామంది ఆహారాన్ని స్టీల్ పాత్రల్లో వండుతుంటారు. నిల్వ కూడా చేస్తుంటారు. అయితే కొన్ని ఆహార పదార్థాలను స్టీల్ పాత్రల్లో ఉంచడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఆ ఆహారాలు స్టీల్‌తో రసాయన చర్య జరిపి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయట. మరి వేటిని స్టీల్ పాత్రల్లో ఉంచకూడదో ఇక్కడ చూద్దాం...
ఊరగాయ
నిపుణుల ప్రకారం.. స్టీల్ పాత్రల్లో ఊరగాయ నిల్వ చేయకూడదు. దానిలోని ఆమ్ల గుణం స్టీల్‌తో రసాయన చర్య జరిపి.. హానికరమైన పదార్థాలను రిలీజ్ చేస్తాయి. అంతేకాదు.. స్టీల్ పాత్రలో నిల్వ చేసిన ఊరగాయ రుచి మారుతుంది. బూజు కూడా పట్టవచ్చు. కాబట్టి ఊరగాయను గాజు లేదా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం మంచిది.
పెరుగు
స్టీల్ పాత్రల్లో పెరుగు నిల్వ చేయకూడదు. దానిలోని బ్యాక్టీరియా స్టీల్‌తో చర్య జరిపి ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. అంతేకాకుండా స్టీల్ పాత్రలో నిల్వ చేసిన పెరుగు త్వరగా పాడవుతుంది. కాబట్టి పెరుగును గాజు లేదా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం మంచిది. దానివల్ల రుచి తగ్గదు. ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది.
నిమ్మకాయతో చేసిన వంటకాలు
స్టీల్ పాత్రల్లో నిమ్మకాయ కలిపిన వంటకాలను నిల్వ చేయకూడదు. నిమ్మకాయలో ఆమ్లాలు ఉంటాయి. ఇవి స్టీల్‌తో కలిసి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా స్టీల్ పాత్రలో నిల్వ చేస్తే ఈ పదార్థాల రుచి తగ్గుతుంది. కాబట్టి గాజు లేదా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం మంచిది.
టమాటతో చేసిన పదార్థాలు
టమాటాతో చేసిన పదార్థాలను స్టీల్ పాత్రల్లో నిల్వ చేయకూడదు. టమాటాలోని ఆమ్లాలు స్టీల్‌తో కలిసి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేయవచ్చు. అంతేకాకుండా స్టీల్ పాత్రలో నిల్వ చేసిన టమాటా వంటకాల రుచి కూడా మారుతుంది. కాబట్టి వాటిని గాజు లేదా ప్లాస్టిక్ పాత్రల్లో నిల్వ చేయడం మంచిది.
పండ్ల సలాడ్
స్టీల్ పాత్రల్లో పండ్లు, పండ్ల సలాడ్‌లను నిల్వ చేయకూడదు. పండ్లలో సహజ ఆమ్లాలు ఉంటాయి. ఇవి స్టీల్‌తో చర్య జరిపి హానికరమైన పదార్థాలను ఉత్పత్తి చేస్తాయి. అంతేకాకుండా స్టీల్ పాత్రలో నిల్వ చేసిన పండ్ల రుచి మారుతుంది.