MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Heat Wave 2.0 : ఇవేం ఎండల్రా నాయనా... ఈ ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలే..!

Heat Wave 2.0 : ఇవేం ఎండల్రా నాయనా... ఈ ప్రాంతాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలే..!

Heat Wave Alert : ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మండుటెండలు కొనసాగుతున్నాయి. ఇక ఇప్పట్నుంచి హీట్ వేవ్ 2.0 కొనసాగుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. ఏఏ జిల్లాల్లో హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతాయంటే..

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 24 2026, 11:02 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఇకపైనే అసలుసిసలైన వేసవి..
Image Credit : Asianet News

ఇకపైనే అసలుసిసలైన వేసవి..

Heat Wave Alert : ఇంకా ఏప్రిల్ లోనే ఉన్నాం... అప్పుడే ఎండలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు నమోదవుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వీస్తున్న వడగాలులు, తీవ్రమైన ఉక్కపోతను ప్రజలు భరించలేపోతున్నారు... ఇక మే లో పరిస్థితిని తలుచుకుంటేనే భయంగా ఉంది. ఇప్పటివరకు ఎండలు ఒకఎత్తు... ఇవాళ (ఏప్రిల్ 24, శుక్రవారం) నుండి కాసే ఎండలు మరో ఎత్తు… హీట్ వేవ్ 2.0 మొదలవుతుందని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

25
తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్..
Image Credit : Getty

తెలంగాణలో హయ్యెస్ట్ టెంపరేచర్స్..

నేడు తెలంగాణవ్యాప్తంగా ఎండలు మండిపోతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అత్యధికంగా 44-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరించారు. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు... అంటే ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారన్నమాట. మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దని... అత్యవసరంగా వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇక కరీంనగర్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, గద్వాల, వనపర్తి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 43-44 డిగ్రీల హయ్యెస్ట్ టెంపరేచర్స్ నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ ప్రకటించారు. హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో 41 నుండి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని తెలిపారు. మిగతా అన్ని జిల్లాల్లోనూ 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

Related Articles

Related image1
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?
Related image2
Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
35
హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్..
Image Credit : Freepik

హైదరాబాద్ లో లోయెస్ట్ టెంపరేచర్..

నిన్న (ఏప్రిల్ 23, గురువారం) అత్యధికంగా ఆదిలాబాద్ లో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా హైదరాబాద్ శివారులోని పటాన్ చెరులో 24 డిగ్రీలు నమోదయ్యింది. ఇక నిజామాబాద్ లో 41.8, రామగుండంలో 41.2, మెదక్ లో 40.9, ఖమ్మంలో 40.8, మహబూబ్ నగర్ లో 40.6, భద్రాచలంలో 40.6 . నల్గొండలో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్ హకీంపేటలో 39.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

45
ఈ జిల్లాల్లో వర్షాలు..
Image Credit : freepik

ఈ జిల్లాల్లో వర్షాలు..

ఇదిలావుంటే మధ్యాహ్నమంతా ఎండలు కొనసాగినా సాయంత్రం ఆకాశం మేఘాలతో కమ్మేసి వాతావరణం ఆహ్లాదకరంగా మారుతోంది. ఇవాళ కూడా పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, సిద్దిపేట, జగిత్యాల, జనగాం, రాజన్న సిరిసిల్ల, మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ప్రకటించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో (గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో) కూడిన వర్షాలుంటాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది... ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

55
ఏపీ వెదర్ రిపోర్ట్..
Image Credit : PTI

ఏపీ వెదర్ రిపోర్ట్..

ఇక ఆంధ్ర ప్రదేశ్ విషయానికి వస్తే.. శుక్రవారం రాష్ట్రంలో 62 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 89 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) హెచ్చరించింది. అలాగే 26 జిల్లాల్లో, 382 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది. అలాగే రేపు (శనివారం) 07 మండలాల్లో తీవ్ర, 31 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4°C ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఇక కడపలో 45.1°C, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 45.1°C, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9°C గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇతర జిల్లాల్లో కూడా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు APSDMA తెలిపింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
హైద‌రాబాద్‌లో ఇక్క‌డ ల‌స్సీ ఉంట‌ది మామా.. అమృతం అంతే. 100 ఏళ్లుగా న‌డుస్తోన్న దుకాణం
Recommended image2
Telangana: ఆర్టీసీ స‌మ్మెలో విషాద సంఘ‌ట‌న‌.. ఎంత ప‌ని చేశావు డ్రైవ‌ర‌న్న‌.?
Recommended image3
Now Playing
Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ | Weather | Asianet News Telugu
Related Stories
Recommended image1
Summer Heat : ఏంటిది సూరీడూ.. తెలుగు నేలపై 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలా..! ఆలిండియా రికార్డులు బద్దలవుతాయా..?
Recommended image2
Heat Wave Alert : ఈ ఎండలు ట్రైలర్ మాత్రమే... ఇకపైనే అసలు సినిమా.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved