MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Telangana
  • IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్

IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్

IMD Cold Wave Alert : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి… చలి పెరుగుతోంది. చలి ఎక్కువగా ఉండే జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 09 2026, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల వాతావరణం...
Image Credit : ChatGPT

తెలుగు రాష్ట్రాల వాతావరణం...

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ చలి పెరిగింది. రాత్రులు, ఉదయం వేళల్లో చలి చంపేస్తుంటే మధ్యాహ్నం ఎండలు, ఉక్కపోత ఉంటోంది. ఇక రాబోయే రోజుల్లో వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వేసవికి ముందు ఇలా చలి, ఎండా, వానతో వింత వాతావరణ పరిస్థితులు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఉత్తర భారతదేశంలో అధికపీడనం
Image Credit : Getty

ఉత్తర భారతదేశంలో అధికపీడనం

ఉత్తర భారతదేశంలో నెలకొన్న అధికపీడనం కారణంగా చలిగాలులు దక్షిణాదివైపు వీస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది... ఇది కొన్నిరోజులు కొనసాగే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయి.

Related Articles

Related image1
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
Related image2
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
36
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
Image Credit : X/metcentrehyd

ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్

రాబోయే రెండు రోజులు తెలంగాణలో అక్కడక్కడా కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుండి 3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కొమ్రంభీ ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అందుకే ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. 

46
తెలంగాణలో మళ్లీ చలి
Image Credit : Getty

తెలంగాణలో మళ్లీ చలి

నిన్న (ఆదివారం) అత్యల్పంగా కొమ్రంభీం జిల్లా సిర్పూర్ లో 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. సంగారెడ్డి జిల్లా కోహీర్ లో 10.1, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ లో 11.4, వికారాబాద్ జిల్లా మర్పల్లిలో 12.6, నిర్మల్ జిల్లా పెంబిలో 13, సిద్దిపేట జిల్లా కొండపాకలో 13.1, రంగారెడ్డి జిల్లా కందుకూరులో 13.2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

56
హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
Image Credit : Getty

హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రతలు

హైదరాబాద్ లో అత్యల్పంగా శేరిలింగంపల్లిలో 12 డిగ్రీలు నమోదయ్యింది. మౌలాలి, ఆల్వాల్, తిరుమలగిరి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, షేక్ పేట్, బోయినిపల్లి, నేరేడ్ మెట్ లో కూడా 15 డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇలా ఫిబ్రవరి 12 వరకు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలిగాలులు వీస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు.

66
ఏపీలో చలిగాలులు
Image Credit : X@IndianTechGuide

ఏపీలో చలిగాలులు

ఆంధ్ర ప్రదేశ్ లో చలితో పాటు పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. ముఖ్యంగా కోస్తాంధ్ర, ఏజెన్సీ ప్రాంతాల్లో సాధారణం కంటే 3 నుండి 4 డిగ్రీలు తక్కువగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అరకులో అత్యల్పంగా 7-8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇంకొన్ని రోజులు చలి కొనసాగుతుందని... ఆ తర్వాత క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
కేసీఆర్ ఇంటివద్ద హై టెన్షన్ చుట్టుముట్టిన కాంగ్రెస్ నేతలు | High Tension at KCR Erravelli Residence
Recommended image2
Telangana: స్పీకర్ ఎందుకు కంటతడి పెట్టుకున్నారు.? అసలు అసెంబ్లీలో ఏం జరిగింది.?
Recommended image3
Telangana: తెలంగాణ యువ‌త‌కు విదేశాల్లో ఉద్యోగాలు.. జ‌పాన్‌తో కీల‌క ఒప్పందాలు
Related Stories
Recommended image1
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
Recommended image2
Weather Alert : చలి ఫినిషింగ్ టచ్ ఇచ్చేస్తోంది .. ఈ తెలుగు జిల్లాల ప్రజలు మళ్లీ గజగజా వణకాల్సిందేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved