MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!

Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!

Weather : ప్రస్తుతం చలికాలమా లేక ఎండాకాలమా..? తెలియని డైలమాలో తెలుగు ప్రజలు ఉన్నాయి. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో చలి, ఎండతో మిక్సింగ్ వాతావరణం కొనసాగుతోంది.  

2 Min read
Author : Arun Kumar P
Published : Feb 10 2026, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం...
Image Credit : ChatGPT

తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం...

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం చలి, ఎండలు కొనసాగుతున్నాయి. ఉదయం, రాత్రి సమయంలో చలి ఇరగదీస్తుండగా మధ్యాహ్నం సమయంలో ఎండ, ఉక్కపోత ఉంటోంది. ఇలా ఒకేరోజు వేరువేరు వాతావరణ పరిస్థితులు ఉండటం ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. ప్రస్తుతం చాలామంది దగ్గు, గొంతునొప్పి, చలిజ్వరం, తలనొప్పి వంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు... దీంతో హాస్పిటల్స్ లో రద్దీ పెరిగింది.

26
ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే...
Image Credit : Getty

ఏపీలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఇక్కడే...

ఆంధ్ర ప్రదేశ్ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... మధ్యాహ్నం సమయంలో నడినెత్తిపైకి వస్తున్న భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. ఇంకా ఫిబ్రవరిలోని ఉన్నాం... చలికాలమే కొనసాగుతోంది... కానీ నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది... మరికొన్నిచోట్ల కూడా ఇదే స్థాయిలో వేడి వాతావరణం కొనసాగుతోంది. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే అసలైన వేసవి కాలంలో ఎండలు ఎలా ఉంటాయోనని ప్రజలు కంగారుపడిపోతున్నారు.

Related Articles

Related image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related image2
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
36
ఏపీ వాతావరణం
Image Credit : X@IndianTechGuide

ఏపీ వాతావరణం

ఇక ఏజెన్సీ ప్రాంతాల్లో చలి కొనసాగుతోంది... అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి వేళల్లో చలితో పాటు పొగమంచు కురుస్తోంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి... అరకు లోయ ప్రాంతంలో 7 నుండి 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు ఉంటున్నాయి. మరికొన్నిరోజులు ఈ ప్రాంతాల్లో చలి, పొగమంచు కొనసాగనుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.

46
తెలంగాణలో చలి, వేడి వాతావరణం
Image Credit : Generated by google gemini AI

తెలంగాణలో చలి, వేడి వాతావరణం

తెలంగాణలో కూడా ఏపీలో మాదిరిగానే చలి, ఎండ వాతావరణం కొనసాగుతోంది. అత్యల్పంగా ఆదిలాబాద్ లో 12.2 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే అత్యధికంగా మహబూబ్ నగర్ లో 34.9 డిగ్రీల టెంపరేచర్ నమోదయ్యింది. హన్మకొండ, రామగుండంలలో 13.5, మెదక్ 13.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ చలి ఎక్కువగా ఉంది. ఖమ్మంలో 34.4, భద్రాచలంలో 33.2 డిగ్రీలతో అత్యధిక ఎండలు ఉన్నాయి. ఇలా తెలంగాణ జిల్లాల్లో చలి, వేడి పరిస్థితులు ఉన్నాయి.

56
హైదరాబాద్ వెదర్
Image Credit : Getty

హైదరాబాద్ వెదర్

హైదరాబాద్ లో చలి ఇరగదీస్తోంది.... అత్యల్పంగా పటాన్ చెరులో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాజేంద్ర నగర్ లో కూడా 11, దుండిగల్ లో 15.1, బేగంపేటలో 15.4 అత్యల్ప ఉష్ణోగ్రతలు. అత్యధికంగా దుండిగల్ లో 32, హకీంపేటలో 31.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది.

66
తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు
Image Credit : Getty

తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు

ఇవాళ (ఫిబ్రవరి 10, మంగళవారం) తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్,మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయిని హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది... చలిగాలులు కొనసాగుతాని వాతావరణ శాఖ హెచ్చరించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Recommended image2
ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Recommended image2
Weather Alert : తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం.. ఏపీలో 'మినీ సమ్మర్', తెలంగాణలో 'మినీ వింటర్'
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved