- Home
- Telangana
- Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే
Top 5 Biryani Places : న్యూ ఇయర్ పార్టీకోసం అసలైన హైదరబాదీ బిర్యానీ కావాలా..? టాప్ 5 హోటల్స్ ఇవే
Top 5 Biryani Hotels in Hyderabad : మీరు కొత్త సంవత్సరం పార్టీ (New Year Party) కోసం సిద్దం అవుతున్నారా..? అయితే తప్పకుండా అసలుసిసలైన హైదరబాదీ బిర్యానీ రుచి చూడాలంటే ఈ టాప్ 5 హోటల్స్ గురించి తెలుసుకొండి.

టాప్ 5 హైదరబాదీ బిర్యానీ స్పాట్స్
Hyderabad Biryani : హైదరాబాద్ అనగానే ముందుగా గుర్తుకువచ్చేది బిర్యానీ... ఇక్కడ ఏ పార్టీ జరిగినా మెనూలో బిర్యానీ తప్పనిసరి. ఇతర ప్రాంతాలనుండి ప్రత్యేకంగా బిర్యానీ తినేందుకే హైదరాబాద్ కు వస్తుంటారంటే ఎంత ప్రత్యేకమో అర్థం చేసుకోవచ్చు. ముంబైని ఫైనాన్షియల్ క్యాపిటల్, బెంగళూరును ఐటీ క్యాపిటల్ అని ఎలాగైతే పిలుస్తారో హైదరాబాద్ ను బిర్యానీ క్యాపిటల్ అనవచ్చు.
నగరంలో వేలాది హోటల్స్ ఉన్నాయి... ప్రతిదగ్గరా బిర్యానీ లభిస్తుంది. కానీ అసలైన హైదరబాదీ బిర్యానీ రుచి చూడాలంటే మాత్రం కొన్ని హోటల్స్ కు వెళ్లాల్సిందే. ఈ న్యూ ఇయర్ పార్టీ మెనూలో హైదరాబాద్ బిర్యానీ చేర్చాలనుకుంటున్నారా..? అయితే ఈ టాప్ 5 హోటల్స్ గురించి తెలుసుకోవాల్సిందే. ఇక్కడ లభించే బిర్యానీకి సెపరేట్ అభిమానులు ఉన్నారు... రుచి చూశాక మీరు కూడా ఫిదా కావడం ఖాయం.
1. బావర్చి (ఆర్టిసి క్రాస్ రోడ్)
హైదరాబాద్ బిర్యానీ అనగానే టక్కున రెండుమూడు హోటల్స్ గుర్తుకువస్తాయి... ఇందులో తప్పకుండా బావర్చి ఉంటుంది. నగరంలో బావర్చి పేరుతో అనేక హోటల్స్ వెలిశాయి... కానీ అసలైన హైదరబాదీ బిర్యానీ కోసం ఆర్టిసి క్రాస్ రోడ్స్ వెళ్లాల్సిందే. ఇక్కడ బావర్చిలో లభించే బిర్యానీ రుచి మరెక్కడా ఉండదు.. అందుకే కాలేజీ విద్యార్థుల నుండి ఎంప్లాయిస్, ఫ్యామిలీస్ వరకు ఇక్కడ లభించే చికెన్ బిర్యానీని ఎంతగానో ఇష్టపడతారు.
2. షాదాబ్ (Charminar)
హైదరాబాద్ కు వెళితే తప్పకుండా రెండు పనులు చేయాలంటారు... ఒకటి నగరానికే తలమానికంగా నిలిచిన ప్రాచీన కట్టడం చార్మినార్ చూడాలి... రెండోది బిర్యానీ రుచిచూడాలి. ఈ రెండు ఒకేసారి జరగాలంటే ఓల్డ్ సిటీ ఘన్సీ బజార్ లోని షాదాబ్ కు వెళ్లాల్సింది. చార్మినార్ సమీపంలోని ఈ హోటల్ బిర్యానీకి ఫేమస్. ఛార్మినార్ ను పక్కనే ఘుమఘుమలాడే మసాలాలు దట్టించిన బిర్యానీ తింటూ... అందులోని ముక్కలు కొరుకుతుంటే ఆహా.. ఆ రుచి వర్ణనాతీతం.
3. కేఫ్ బహార్ (Himayatnagar)
రుచికరమైన హైదరబాదీ దమ్ బిర్యానీ తినాలంటే పర్పెక్ట్ స్పాట్ ఈ కేఫ్ బహార్. ఇక్కడ లభించే బిర్యానీని మిర్చీ కా సాలన్, రైతాతో కలుపుకుని తింటే ఆ రుచే వేరు. నగరంలో చాలాచోట్ల ఈ కేఫ్ బహార్ రెస్టారెంట్స్ ఉన్నాయి... కానీ హిమాయత్ నగర్ లో లభించే బిర్యానీ రుచి మరెక్కడా రాదు. అందుకే ఈ రెస్టారెంట్ లో తినేందుకు జనాలు ఎగబడుతుంటారు.
4. మెహఫిల్ (Narayanaguda)
మెహఫిల్ రెస్టారెంట్ లో కూడా హైదరాబాద్ బిర్యానీ అదిరిపోతుంది. తక్కువ ధరకే నగరవాసులకు రుచికరమైన చికెన్ బిర్యానీ రుచి చూపిస్తోంది మెహఫిల్. నారాయణగూడలోని మెహఫిల్ లో అయితే బిర్యానీ రుచి అదిరిపోతుంది. బిర్యానీ లవర్స్ కి ఇది పర్ఫెక్ట్ ప్లేస్.
5. ప్యారడైజ్ ( Secunderabad)
హైదరాబాద్ బిర్యానీని గ్లోబల్ లెవెల్ కి తీసుకెళ్లిన ఘనత ఈ ప్యారడైజ్ హోటల్ ది. హైదరాబాద్ లోనే కాదు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ బిర్యానీకి అభిమానులు ఉన్నారు. రాజకీయ, వ్యాపార, క్రీడా ప్రముఖులు చాలామంది నగరానికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ప్యారడైజ్ బిర్యానీని రుచిచూస్తుంటారు. ఈ బిర్యానీ రూచికి సెలబ్రిటీస్ నుండి సామాన్యుల వరకు ఫిదా అవుతుంటారు.

