MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Food
  • Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి..!

Hyderabad Biryani: హైదరాబాద్ బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఇలా చేసేయండి..!

హైదరాబాద్ బిర్యానీ అంటే తెలియని వారుండరు. హైదరాబాద్ వెళ్లారంటే కచ్చితంగా బిర్యానీ టేస్ట్ చేయాల్సిందే. మనలో చాలామంది ఇష్టంగా తినే ఫుడ్ బిర్యానీ. కానీ ఇంట్లో చేయడానికి మాత్రం వెనకడుగు వేస్తుంటారు. బిర్యానీ చేయడం చాలా కష్టం అనే ఫీలింగ్ ఉంటుంది చాలామందిలో. ఆ ఫీలింగ్ మీకు ఉంటే వెంటనే దాన్ని తీసేయండి. ఎందుకంటే హైదరాబాద్ బిర్యానినీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ ఉంది. ఓసారి ట్రై చేయండి.

2 Min read
Author : Kavitha G
Published : Apr 16 2025, 04:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బిర్యానీ చేయడం కష్టమైన పని అని చాలా మంది అనుకుంటారు. అందులోనూ హైదరాబాద్ స్టైల్ అంటే కాస్త టైం పడుతుంది. అన్నీ విడివిడిగా ఉడికించాలని అనుకుంటారు. కానీ ఇది చాలా సింపుల్ రెసిపీ. అన్నీ కరెక్ట్ కొలతల్లో వేస్తే చాలు.. మీకు వంట రాకపోయినా మీరు బిర్యానీ స్పెషలిస్ట్ అయిపోవచ్చు. ఇక్కడ ఒక సింపుల్ షార్ట్‌కట్ ఉంది. అదెంటో ఇప్పుడు తెలుసుకుందాం.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కావాల్సిన పదార్థాలు

కావాల్సిన పదార్థాలు

చికెన్ – 1/2 కేజీ
పెరుగు – 1/2 కప్పు
అల్లం-వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
కారం పొడి, పసుపు, ఉప్పు – తగినంత
ధనియాల పొడి – 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం – 1 టేబుల్ స్పూన్
పుదీనా, కొత్తిమీర – కొద్దిగా

35
ఇతర పదార్థాలు:

ఇతర పదార్థాలు:

బాస్మతి రైస్ – 1 కప్పు (30 నిమిషాలు నానబెట్టాలి)
ఉల్లిపాయలు – 2 (ముక్కలుగా కోసి, వేయించి పెట్టుకోవాలి)
నూనె, నెయ్యి – 2 టేబుల్ స్పూన్
గరం మసాలా (యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు) – కొద్దిగా
నీరు – 1 3/4 కప్పు

45
తయారీ విధానం:

తయారీ విధానం:

- పైన చెప్పిన పదార్థాలతో చికెన్‌ని బాగా కలిపి 30 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. సమయం లేకపోతే 10 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. 
- బిర్యానీ చేయడానికి ఒక కడాయిలో నూనె, నెయ్యి వేసి, అన్ని మసాలా దినుసులు, ఉల్లిపాయలు వేసి వేయించాలి.
- తర్వాత నానబెట్టిన చికెన్ ను వేసి 5 నిమిషాలు ఉడికించాలి.
-  తర్వాత నానబెట్టిన బియ్యం, పుదీనా, కొత్తిమీర, కొన్ని వేయించిన ఉల్లిపాయలు వేయాలి.
- తగినంత నీరు పోసి, మరుగు వచ్చాక సిమ్‌లో ఉంచి మూత పెట్టి 15–20 నిమిషాలు ఉడికించాలి.
- అంతే.. సువాసనతో కూడిన హైదరాబాద్ స్టైల్ బిర్యానీ రెడీ.
- ఇది ఒకే పాత్రలో వండుకునే ఈజీ బిర్యానీ. చాలా తక్కువ సమయంలో చాలా రుచికరమైన బిర్యానీని చేసుకోవచ్చు.
 

55
రుచి పెంచడానికి చిట్కాలు:

రుచి పెంచడానికి చిట్కాలు:

- బిర్యానీ ఉడికేటప్పుడు తరచుగా కలుపుతూ ఉండకూడదు. దీనివల్ల బియ్యం విరిగిపోతాయి, మెత్తబడిపోతాయి.
- చికెన్ అప్పటికే నీరు వదులుతుంది. దానికి తగ్గట్టుగా నీటి మోతాదు సర్దుబాటు చేసుకోండి.
- ఉల్లిపాయలు పచ్చిగా ఉండకూడదు. బాగా బ్రౌన్ రంగు వచ్చే వరకు వేయించాలి.
- ఉల్లిపాయలు, అల్లం-వెల్లుల్లి పచ్చి వాసన పోయే వరకు ఎంత వేగితే బిర్యాని అంత రుచిగా ఉంటుంది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆహారం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Asafoetida: రోజూ చిటికెడు ఇంగువ తీసుకుంటే ఏమౌతుందో తెలుసా?
Recommended image2
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Recommended image3
Paratha: పరోోటా రబ్బరులా సాగుతుందా? ఇలా చేస్తే దూదిలా మెత్తగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved