Vegetables Price : ఈ శని, ఆదివారం సంతల్లో కూరగాయల ధరలు ఎలా ఉంటాయంటే...
వీకెండ్ వచ్చిందంటే చాలు చాలామంది చేతిలో సంచి పట్టుకుని కూరగాయలు కొనేందుకు వెళుతుంటారు. అయితే వీళ్లు ఈ శని, ఆదివారం జరిగే మార్కెట్స్ లో ధరలు ఎలా ఉంటాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

కూరగాయల ధరలు
Vegetables Price in Hyderabad : సాధారణంగా పెద్దపెద్ద నగరాలు, పట్టణాల్లో ప్రతి వీకెండ్ లో కూరగాయల మార్కెట్స్ జరుగుతుంటాయి. ఉద్యోగులకు వారాంతంలోనే సమయం దొరుకుతుంది... పిల్లలకు కూడా సెలవులు ఉంటాయి కాబట్టి గృహిణులకు కూడా ఖాళీసమయం ఉంటుంది. కాబట్టి వీరికి అనుకూలంగా ఉండే ఈ సమయంలో కాలనీల్లో కూరగాయల సంతలు వెలుస్తాయి... చిరు వ్యాపారులే కాదు నేరుగా రైతులు కూడా ఈ సంతల్లో తాము పండించిన పంటను అమ్ముతుంటారు.
అయితే కొన్నిసార్లు మార్కెట్ లో ఏ కూరగాయ ధర ఎంతుందో తెలియక వినియోగదారులు మోసపోయే అవకాశం ఉంటుంది. మరికొన్నిసార్లు నేరుగా మార్కెట్ కు పంటను తీసుకువచ్చే రైతులు కూడా సరైన ధర ఏదో తెలియక నష్టపోతుంటారు. అందుకే అందరికీ ఉపయోగపడేలా ప్రస్తుతం కూరగాయల ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలియజేస్తున్నాం.
టమాటా ధర ఎంతుంది..?
ప్రస్తుతం హైదరాబాద్ లో టమాటా ధర తక్కువగానే ఉంది. మార్కెట్ లో కిలో టమాటా కేవలం 20-25 రూపాయలకే లభిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సరుకు రవాణా ఆటోల్లో టమాటాలు తీసుకువచ్చిన రూ.100 కు 5 నుండి 6 కిలోలు అమ్ముతున్నారు. ఇలా ఈ వీకెండ్ మార్కెట్స్ లో కూడా అతి తక్కువ ధరకే టమాటాలు లభించనున్నాయి.
ఉల్లిపాయల ధర ఎలా ఉన్నాయి..?
ఉల్లిపాయల ధరలు చాలారోజులుగా స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో కిలో ఉల్లిపాయలు 15 నుండి 20 రూపాయలకు లభిస్తున్నాయి. ఉల్లి సైజు, నాణ్యతను బట్టి ధరలో స్వల్ప తేడా ఉండవచ్చు. రూ.100 కు ఐదారు కిలోలు అమ్ముతున్నారు. ఉల్లిపాయల ఎక్కువరోజులు నిల్వ ఉంటాయి కాబట్టి ధర తక్కువగా ఉన్నప్పుడే ఎక్కువగా కొనుగోలుచేయడం మంచిది.
ఇతర కూరగాయల ధరలు
చిక్కుడు కిలో రూ 25-30
పచ్చిమిర్చి కిలో రూ.50-60
బీట్ రూట్ కిలో రూ.15-20
ఆలుగడ్డ కిలో రూ.20-30
క్యాప్సికం కిలో రూ.40-45
కాకరకాయ కిలో రూ.30-40
సొరకాయ కిలో రూ.20-30
బీన్స్ కిలో రూ.45-50
క్యాబేజీ కిలో రూ.15-20
క్యారెట్ కిలో రూ.40
వంకాయలు కిలో రూ.40-50
బెండకాయలు కిలో రూ.40-45
బీరకాయ కిలో రూ. 30-40
దొండకాయ కిలో రూ.40-50
ఆకుకూరల ధరలు
పాలకూర కిలో రూ.30-40 (సైజుని బట్టి రూ.10-20 కట్ట ధర ఉంది)
పూదీనా రూ.10 కట్ట
కరివేపాకు రూ.10 కట్ట (కిలో రూ.120)
కొత్తిమీర రూ.20 కట్ట, చిన్న కట్ట రూ.10
మెంతి కూర కిలో రూ.10-20
చామకూర కిలో రూ.20 లభిస్తున్నాయి.
గమనిక : ఈ కూరగాయాలు, ఆకుకూరల ధరలు సూపర్ మార్కెట్లు, షాపులు, రైతుబజార్లు, వారాంతం సంతలు జరిగే ఏరియాను బట్టి మారుతుంటాయి... ఈ విషయాన్ని ప్రజలు గమనించాలి.

