MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు... ఈ జిల్లాలకు ఏకంగా ఎల్లో అలర్ట్

Weather Update : ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలయ్యాయి… ఇకపై తెలంగాణలో కూడా వానలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఏఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంటే…

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 13 2026, 07:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్..
Image Credit : Gemini AI

తెెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్..

IMD Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి వర్షాలకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీంతో తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాదిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు మొదలవగా తెలంగాణలో మరో రెండ్రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. మొత్తంగా రాబోయే రోజుల్లో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు తగ్గి చల్లని వాతావరణం ఉంటుందన్నమాట. 

25
 ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు
Image Credit : X/APSDMA

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ద్రోణి ఏర్పడినట్లు వాతావరణ శాఖ చెబుతోంది. దీంతో ఆంధ్ర ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఇవాళ (మార్చి 13, శుక్రవారం) ఆకాశం మేఘావృతమై ఉంటుందని... వర్షాలు పడే అవకాశం ఉంటుందని తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. విశాఖపట్నం, కాకినాడ, నెల్లూరు వంటి తీరప్రాంత జిల్లాలపై ద్రోణి ప్రభావం ఎక్కువగా ఉంటుందని... ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

Related Articles

Related image1
IMD Rain Alert : మళ్లీ వర్ష బీభత్సం.. ఈ 16 జిల్లాల్లో అల్లకల్లోలమే, ఎల్లో అలర్ట్
Related image2
IMD Rain Alert : తెలంగాణలో జోరువానలు.. ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో అల్లకల్లోలమే
35
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Image Credit : X/Warangal Weatherman

ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

ఇక మరో తెలుగురాష్ట్రం తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు, రేపు (శుక్ర, శనివారం) ఎండల తీవ్రత కాస్త తక్కువగా ఉంటుందని... ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలకంటే తక్కువగా నమోదవుతాయని తెలిపింది. ఇక ఆదివారం(మార్చి 15న) ఆకాశం మేఘావృతమై ఉండి పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇలా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు,భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

45
హైదరాబాద్ లో వానలు
Image Credit : X/Hyderabad Traffic Police

హైదరాబాద్ లో వానలు

వచ్చే సోమవారం (మార్చి 16న) కూడా వర్షాలు కొనసాగుతాయని... మరిన్ని జిల్లాలకు ఇవి విస్తరిస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అలాగే మహబూబాబాద్, వరంగల్, హన్మకొంండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలకు వానలు వ్యాపిస్తాయని హైదరాబాద్ వాతవారణ కేంద్రం ప్రకటించింది. ఇలా ఆది, సోమవారం వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

1200 यूटीसी पर आधारित तेलंगाना का 7-दिवसीय पूर्वानुमान (रात) 2030 बजे IST पर जारी किया गया /7-day forecast(NIGHT) of TELANGANA based on 1200 UTC issued at 2030 hours IST Dated :12-03-2026 pic.twitter.com/z6yWzIqfJb

— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) March 12, 2026

55
వేసవి వర్షాలు ఇంత ప్రమాదకమా..!
Image Credit : X/APSDMA

వేసవి వర్షాలు ఇంత ప్రమాదకమా..!

సాధారణంగా వేసవిలో కురిసే కాస్త ప్రమాదకరంగా ఉంటాయి. వర్షపాతం తక్కువే అయినా ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలుల బీభత్సం ఎక్కువగా ఉంటుంది. వడగళ్ల వానలు కూడా పడుతుంటాయి. కాబట్టి ఈ వర్షాల కారణంగా కొన్నిసార్లు పంట, ఆస్తి నష్టమై కాదు ప్రాణనష్టం కూడా జరిగే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు మరీముఖ్యంగా రైతులు, కూలీలు వర్షాల సమయంలో జాగ్రత్తగా ఉండాలని... చెట్లకింద అస్సలు ఉండకూడదని సూచిస్తుంటారు..

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
హైదరాబాద్ లో Netflix | CM Revanth Reddy కీలక ప్రసంగం | Netflix | OTT Platform | Asianet News Telugu
Recommended image2
Netflix Eyeline Studios : లండన్, సియోల్ తర్వాత హైదరాబాద్‌లోనే.. నెట్‌ఫ్లిక్స్ ఐలైన్ స్టూడియో ప్రత్యేకతలివే !
Recommended image3
Half Day Schools: విద్యార్థుల‌కు పండ‌గే..హాఫ్ డే స్కూల్స్ ఎప్ప‌టి నుంచంటే. అధికారిక ప్ర‌క‌ట‌న
Related Stories
Recommended image1
IMD Rain Alert : మళ్లీ వర్ష బీభత్సం.. ఈ 16 జిల్లాల్లో అల్లకల్లోలమే, ఎల్లో అలర్ట్
Recommended image2
IMD Rain Alert : తెలంగాణలో జోరువానలు.. ఈదురుగాలులు, పిడుగులు, వడగళ్లతో అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved