- Home
- Business
- Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..
Gold Rate : గూగుల్, న్యూస్ ధరలు కాదు.. రియల్ టైమ్ బంగారం రేటు కచ్చితంగా తెలుసుకోవడం ఎలాగంటే..
Gold Price : మీరు బంగారం కొనాలనుకుంటున్నారా..? అయితే ఒక్కోచోట ఒక్కో రకంగా బంగారం ధరలు ఉండటం చూసి కన్ఫ్యూజ్ అవుతున్నారా..? అయితే రియల్ టైమ్ బంగారం ధర కచ్చితంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలో తెలుసా?

రియల్ టైమ్ బంగారం ధర తెలుసుకోండిలా...
Gold Price : బంగారం... ప్రతి ఒక్కరు ఇష్టపడే లోహం. ఎంత ఎక్కువ బంగారం ఉంటే అంత రిచ్ గా ఫీల్ అవుతుంటారు... అందుకే దీన్ని కొనేందుకు ఇష్టపడుతుంటారు. మహిళలే కాదు పురుషులు కూడా బంగారు ఆభరణాలపై మోజు పెంచుకుంటున్నారు... దీంతో గోల్డ్ కు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో వందల్లో... తర్వాత వేలల్లో... ఇప్పుడు లక్షల్లో బంగారం ధర పలుకుతోంది... రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే బంగారం కొనడంకంటే దాని ధర ఎంతో తెలుసుకోవడం ప్రస్తుతం పెద్ద టాస్క్ గా మారింది. గూగుల్ ఒకరేటు చెబుతుంది... ఇదే సమయంలో టీవీలో న్యూస్ ఛానల్స్ మరో ధర చెబుతాయి... బంగారం షాపుకు వెళితే వాళ్లు ఇంకో ధర చెబుతారు... దీంతో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బంగారం రేటు ప్రతిరోజు మారుతుండటం కూడా గందరగోళానికి కారణం అవుతోంది. మరి రియల్ టైమ్ బంగారం ధర తెలుసుకోవడం ఎలా..? ఈ ప్రశ్నకు సమాధానమే GJC వెబ్ సైట్.
ఏమిటీ GJC వెబ్ సైట్...
All India Gem And Jewellery Domestic Council (GJC)... ఇది ప్రభుత్వానికి, గోల్డ్ ఆండ్ డైమండ్స్ పరిశ్రమకు మధ్య వారధిగా నిలుస్తుంది. దీని అధికారిక వెబ్ సైట్ www.gjc.org.in లో ప్రతిరోజు దేశంలో బంగారం ధర ఎంత ఉందో ప్రకటిస్తారు. బంగారం కొనుగోలు ధర, అమ్మకం ధర వేరువేరుగా పేర్కొంటారు. ఇలా ప్రతిరోజు రెండుసార్లు బంగారం ధరలను అప్ డేట్ చేస్తారు. ఇక్కడ మీరు రియల్ టైమ్ లో బంగారం ధరలు తెలుసుకోవచ్చు.
గూగుల్, న్యూస్ ఛానల్స్ లో పేర్కొనే బంగారం ధరలు కూడా నిజమే... కానీ అవి హోల్ సేల్ రేట్స్. మనం షాప్ లో కొనే బంగారం రిటెయిల్ రేట్స్ లో అమ్ముతారు. కాబట్టి రెండింటి ధరలు తేడాగా ఉంటాయి... దీంతో మనం కన్ఫ్యూజ్ అవుతుంటాం. GJC వెబ్ సైట్ లో రిటెయిల్ బంగారం ధరనే పేర్కొంటారు. కాబట్టి ఎవరో చెప్పిన మాటలు నమ్మకుండా బంగారం కొనే సమయంలో ఈ వెబ్ సైట్ ను సందర్శిస్తే అసలు ధర తెలుస్తుంది... కొనుగోలు ఈజీ అవుతుంది.
బంగారం కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించండి... లేకుంటే మోసపోతారు
బంగారం కొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి.. ఎందుకంటే దాని ధర రోజురోజుకు పెరుగుతోంది కాబట్టి ఈ వ్యాపారంలో చాలా మోసాలుంటాయి. కొందరు బంగారం వ్యాపారులే కాదు పెద్దపెద్ద జువెల్లర్స్ కూడా తక్కువ ధరకే బంగారం ఇస్తామని నమ్మిస్తుంటారు. చివరకు ప్రస్తుత మార్కెట్ ధరకంటే తక్కువకే బంగారం ఇస్తామని తెగ ప్రచారం చేస్తుంటారు. ఇలాంటివారికి నమ్మితే మోసపోయే అవకాశాలుంటాయి. తక్కువ ధర చెప్పి ఇతర విషయాల్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తుంటారు.
తక్కువ ధరకే బంగారం పేరిట జరిగే మోసమిదే..
ఉదాహరణకు ప్రస్తుతం గ్రాము బంగారం ధర రూ.13,000 ఉందనుకుందాం. కానీ దీన్ని కేవలం రూ.12,000 లేదా 12,500 ఇస్తామని చెబుతారు... ఓ రూ.500-1000 తగ్గుతుంది కదా అని మారివద్దే కొనాలనుకుంటాం. కానీ ఇక్కడే అసలు మోసం దాగివుంది. ఇలా మార్కెట్ రేటు కంటే బంగారం ధర తగ్గించి మనకు లాభం చేస్తున్నట్లే కనిపిస్తుంది... కానీ తయారీ ఛార్జీలు, తరుగు అంటూ భారీగా డబ్బులు బాదుతారు. ఇలా ఎక్కువమొత్తంలో బంగారం కొంటే వేలు కాదు లక్షల్లో నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తక్కువ ధరకు బంగారం దొరుకుతుందని వేయి రెండువేలకు కక్కుర్తి పడకుండా మంచి సర్టిఫైడ్ వ్యాపారుల వద్ద బంగారం కొనుగోలు చేయడం మంచిది.
ప్రస్తుతం బంగారం ధర ఎంతుంది..?
GJC వెబ్ సైట్ ప్రకారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
బంగారం కొనుగోలు స్టాండర్డ్ ధర : 1,41,000 రూపాయలు
బంగారం అమ్మకం స్టాండర్డ్ ధర : రూ.1,42,000 రూపాయలు
22 క్యారెట్ :
కొనుగోలు ధర : 1,30,100 రూపాయలు
అమ్మకం ధర : 1,32,100 రూపాయలు
18 క్యారెట్ :
కొనుగోలు ధర : 1,08,800 రూపాయలు
అమ్మకం ధర : 1,10,800 రూపాయలు
14 క్యారెట్ :
కొనుగోలు ధర : 90,300 రూపాయలు
అమ్మకం ధర : 92,300 రూపాయలు
వెండి ధర :
స్టాండర్డ్ అమ్మకం ధర : 2,78,200

