- Home
- Telangana
- Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
Telangana Jobs : తెలుగు యువతకు సూపర్ ఛాన్స్ ... నెలనెలా రూ.81.400 శాలరీతో గవర్నమెంట్ జాబ్స్
TGSRTC Jobs : తెెలంగాణ ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇవాళ్టి నుండి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం అయ్యింది. ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకుని అర్హతలుంటే దరఖాస్తు చేసుకొండి.

తెలంగాణలో గవర్నమెంట్ జాబ్స్ రిక్రూట్మెంట్
TGSRTC Recruitment : తెలంగాణ యువతకు అద్భుత అవకాశం... ప్రభుత్వరంగ సంస్థ ఆర్టిసిలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టిజిఎస్ ఆర్టిసి) మొత్తం 198 ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. ఆర్టిసిలో ఉద్యోగం చేయాలనే ఆసక్తిగల అభ్యర్థులు ఇక్కడ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకొండి... అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.
పోస్టులు, జోన్ల వారిగా ఖాళీలు
పోస్టుల వారిగా ఖాళీలు :
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ (TST) - 84 ఖాళీలు
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ (MST) - 114 పోస్టులు
జోన్ల వారిగా ఖాళీలు :
ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ
జోన్ 1 - కాళేశ్వరం - 8
జోన్ 2 - బాసర - 11
జోన్ 3 - రాజన్న -13
జోన్ 4 - భద్రాద్రి - 12
జోన్ 5 - యాదాద్రి - 9
జోన్ 6 - చార్మినార్ - 25
జోన్ 7 - జోగులాంబ - 6
మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ
జోన్ 1 - కాళేశ్వరం - 12
జోన్ 2 - బాసర - 17
జోన్ 3 - రాజన్న -19
జోన్ 4 - భద్రాద్రి - 13
జోన్ 5 - యాదాద్రి - 11
జోన్ 6 - చార్మినార్ - 34
జోన్ 7 - జోగులాంబ - 8
అర్హతలు
ట్రాఫిక్, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ ఉద్యోగాలకు పురుషులు, మహిళలు అర్హులు. అంతేకాదు ప్రతి కేటగిరీలో 33 శాతానికి పైగా ఉద్యోగాలు మహిళలకు కేటాయించారు.
విద్యార్హతలు :
ట్రాఫిక్ సూపర్వైజర్ ఉద్యోగాలకు ఏదైనా గుర్తింపుపొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుండి డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. జూలై 1, 2025 లోపు ఈ డిగ్రీ పూర్తయి ఉండాలి.
మెకానికల్ సూపర్వైజర్ ఉద్యోగాలకు మాత్రం ఆటోమొబైల్/ మెకానికల్ ఇంజనీరింగ్ లో డిప్లమా చేసి ఉండాలి. BE/B Tech వంటి ఉన్నత చదువులు చదివినవారు కూడా అర్హులే... వీరికి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది.
వయో పరిమితి
18 నుండి 25 ఏళ్లలోపు వయసుగల అభ్యర్థులు అర్హులు. మాజీ సైనికులకు 3 ఏళ్లు… ఎస్సి, ఎస్టి, బిసి, ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఇక డిపార్ట్మెంటల్ ఎస్సి, ఎస్టి, బిసిలు గరిష్ఠం 45 ఏళ్లలోపు వారు అర్హులు. ఇతర డిపార్ట్మెంటల్ అభ్యర్థుల గరిష్ఠ వయసు 40 ఏళ్లు,
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ : 25 డిసెంబర్ 2025
ఆన్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభం : 30 డిసెంబర్ 2025
అప్లికేషన్స్ కు చివరితేదీ : 20 జనవరి 2026
వయసు పరిగణలోకి తీసుకునే తేదీ : 01 జూలై 2025
దరఖాస్తు, ఎంపిక ప్రక్రియ
దరఖాస్తు ఫీజు :
ఎస్సి, ఎస్టీలకు రూ.400, ఇతరులకు రూ. 800 (ఆన్లైన్ లోనే చెల్లించాలి)
తెలంగాణ ఆర్టిసి అధికారిక వెబ్ సైట్ www.tgprb.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక ప్రక్రియ :
రాతపరీక్ష ద్వారా ఎంపికచేస్తారు. తెలుగుతో పాటు ఇంగ్లీష్, ఉర్దూలో ప్రశ్నపత్రం ఉంటుంది.
మెడికల్ టెస్ట్, సర్టిఫికేట్ వెరికేషన్ తర్వాత తుది ఎంపిక ఉంటుంది.
శాలరీ
నెలనెలా రూ.27,080 నుండి రూ.81,400 వరకు శాలరీ ఉంటుంది.
12 నెలల ట్రైనింగ్ కాలంలో స్టైఫండ్ మాత్రమే లభిస్తుంది.

