MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Jobs
  • Banking Jobs : అల్లాటప్పా బ్యాంకులో కాదు ఆర్బిఐలోనే జాబ్... ఈ అర్హతలుంటే మీదే

Banking Jobs : అల్లాటప్పా బ్యాంకులో కాదు ఆర్బిఐలోనే జాబ్... ఈ అర్హతలుంటే మీదే

బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం చాలామంది ప్రయత్నిస్తుంటారు. అలాంటిది బ్యాంకులన్నింటికి బాస్ లాంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) లో భారీ ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మీకు అన్ని అర్హతలుంటే వెంటనే దరఖాస్తు చేసుకొండి.

2 Min read
Author : Arun Kumar P
Published : Dec 19 2025, 08:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
ఆర్బిఐ జాబ్స్
Image Credit : Gemini AI

ఆర్బిఐ జాబ్స్

భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 2026 సంవత్సరానికి కొత్త ఉద్యోగ ప్రకటనను విడుదల చేసింది. RBISB/DA/04/2025-26 నోటిఫికేషన్ నంబర్ కింద మొత్తం 93 ఇంజనీర్ ఆండ్ నిపుణుల పోస్టులను కాంట్రాక్ట్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. డేటా సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్షియల్ రిస్క్ మేనేజ్‌మెంట్, ఎకనామిక్ అనాలిసిస్ వంటి రంగాలలో అనుభవం ఉన్న నిపుణులకు ఇది ఒక ముఖ్యమైన అవకాశంగా పరిగణించవచ్చు. ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ ద్వారా స్వీకరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
RBI లో భర్తీ చేసే ఉద్యోగాలివే
Image Credit : Getty

RBI లో భర్తీ చేసే ఉద్యోగాలివే

ఈ రిక్రూట్‌మెంట్‌లో డేటా సైంటిస్ట్, డేటా ఇంజనీర్, ఐటీ సెక్యూరిటీ ఎక్స్‌పర్ట్, ఐటీ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఐటీ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్, ఏఐ / ఎంఎల్ స్పెషలిస్ట్, ఐటీ – సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, నెట్‌వర్క్ అడ్మినిస్ట్రేటర్, ప్రాజెక్ట్ మేనేజర్ వంటి వివిధ గ్రేడ్ ‘సి’, ‘డి’, ‘ఇ’ స్థాయి పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు పని చేసే ప్రదేశం ఎక్కువగా ముంబై, ఆర్‌బీఐ డేటా సెంటర్లు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉన్నత బాధ్యతలతో కూడిన సాంకేతిక ఉద్యోగాలలో చేరాలనుకునే వారికి ఇది ఒక అరుదైన అవకాశం.

Related Articles

Related image1
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
Related image2
Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
37
ఆర్బిఐ ఉద్యోగాలకు అర్హతలు
Image Credit : gemini

ఆర్బిఐ ఉద్యోగాలకు అర్హతలు

విద్యా అర్హతల విషయానికొస్తే BE / B.Tech / M.Tech / MCA / MSc / MBA / CA / ICWA వంటి డిగ్రీలు అవసరం. డేటా సైన్స్, ఐటీ, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వంటి రంగాలలో 3 నుంచి 10 సంవత్సరాల అనుభవం అవసరం. కొన్ని పోస్టులకు CISSP, CISA, CFA, FRM, PMP, AI/ML వంటి ప్రొఫెషనల్ సర్టిఫికేట్లు ఉంటే ప్రాధాన్యం ఇస్తారని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

47
వయోపరిమితి
Image Credit : Getty

వయోపరిమితి

వయోపరిమితి జనవరి 6, 2026 నాటికి కనీసం 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల వరకు నిర్ణయించారు. కొన్ని సీనియర్ స్థాయి పోస్టులకు గరిష్ట వయస్సు 45 లేదా 62 వరకు అనుమతించారు. SC/ST, OBC, వికలాంగులు, మాజీ సైనికులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయస్సు సడలింపులు ఉంటాయి.

57
శాలరీ
Image Credit : Getty

శాలరీ

జీతం వివరాల్లో, గ్రేడ్ ‘సి’ (లెవల్ 3) పోస్టులకు సంవత్సరానికి రూ.3.10 లక్షల వరకు, గ్రేడ్ ‘డి’ (లెవల్ 4) పోస్టులకు రూ.4.30 లక్షల వరకు, గ్రేడ్ ‘ఇ’ (లెవల్ 5) పోస్టులకు రూ.4.80 లక్షల వరకు CTC ఇస్తారు. ఇది అనుభవం ఉన్న నిపుణులకు చాలా ఆకర్షణీయమైన జీతం.

67
ఎంపిక ప్రక్రియ
Image Credit : Getty

ఎంపిక ప్రక్రియ

ఈ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ ప్రిలిమినరీ స్క్రీనింగ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ దశల ద్వారా జరుగుతుంది. దరఖాస్తు రుసుముగా SC/ST/మాజీ సైనికులు/వికలాంగులు రూ.100/-, ఇతర అభ్యర్థులు రూ.600/- ఆన్‌లైన్‌లో చెల్లించాలి.

77
దరఖాస్తు విధానం
Image Credit : Getty

దరఖాస్తు విధానం

అర్హత గల అభ్యర్థులు 06.01.2026 వరకు ఆర్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ https://opportunities.rbi.org.in/ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగ ప్రకటన, ఇతర వివరాలను ఆర్‌బీఐ వెబ్‌సైట్‌లో జాగ్రత్తగా చదివి, అర్హత ఉన్నవారు చివరి తేదీకి ముందే దరఖాస్తు చేసుకోవడం అవసరం.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Govt Job : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, ఎగ్జామ్ లేకుండానే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
Recommended image2
Jobs : తెలుగమ్మాయిలకు లక్కీ ఛాన్స్.. కేవలం పది పాసైతే చాలు, సొంత గ్రామంలో గవర్నమెంట్ జాబ్
Recommended image3
Bank Jobs : రాతపరీక్ష లేదు, కేవలం ఇంటర్వ్యూతోనే బ్యాంక్ జాబ్.. ఒకటిరెండు కాదు 2049 పోస్టులు
Related Stories
Recommended image1
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
Recommended image2
Bank Jobs : యువతకు సూపర్ ఛాన్స్.. రూ.93,960 జీతంతో మెనేజర్ స్థాయి ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved