MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Romanchakam Movie Review
Ayodhya Ram Mandir CEO
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Telangana
  • Syrup: మీ ఇంట్లో ఈ సిర‌ప్ ఉందా? వెంట‌నే బ‌య‌ట‌ ప‌డేయండి.. తెలంగాణ ప్ర‌భుత్వం అల‌ర్ట్‌

Syrup: మీ ఇంట్లో ఈ సిర‌ప్ ఉందా? వెంట‌నే బ‌య‌ట‌ ప‌డేయండి.. తెలంగాణ ప్ర‌భుత్వం అల‌ర్ట్‌

Syrup: తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తెలంగాణ ఔషధ నియంత్రణ విభాగం (telangana drug control) ఓ సిర‌ప్ వినియోగానికి సంబంధించి ఆదేశాలు జారీ చేసింది. స‌ద‌రు సిర‌ప్‌ను నిషేధిస్తూ ప్ర‌క‌ట‌న చేశారు. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 10 2026, 02:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆల్మంట్ కిడ్ సిరప్‌పై తక్షణ నిషేధం
Image Credit : Gemini AI

ఆల్మంట్-కిడ్ సిరప్‌పై తక్షణ నిషేధం

పిల్లలకు వినియోగించే ఆల్మంట్-కిడ్ సిరప్ వాడకాన్ని వెంటనే నిలిపివేయాలని తెలంగాణ ఔష‌ధ నియంత్ర‌ణ అడ్మినిస్ట్రేషన్ ఆదేశాలు జారీ చేసింది. ఈ సిరప్‌లో ప్రమాదకర రసాయనం కలిసినట్లు గుర్తించడంతో ప్రజలను అప్రమత్తం చేసింది. ఇంట్లో ఈ సిరప్ ఉన్నవారు ఎలాంటి ఆలస్యం చేయకుండా వాడకం ఆపేయాలని స్పష్టం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కోల్‌కతా నుంచి వచ్చిన హెచ్చరికతో వెలుగులోకి
Image Credit : Asianet News

కోల్‌కతా నుంచి వచ్చిన హెచ్చరికతో వెలుగులోకి

కోల్‌కతాలోని సెంట్రల్ drugs స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (CDSCO – ఈస్ట్ జోన్) నుంచి తెలంగాణ అధికారులకు హెచ్చరిక సమాచారం అందింది. పరీక్షల్లో ఈ సిరప్‌లో ఇథిలీన్ గ్లైకాల్ అనే విషపూరిత పదార్థం కలిసినట్లు నిర్ధారణ అయింది. ఈ సమాచారం అందిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా అధికారులు చర్యలు ప్రారంభించారు.

Related Articles

Related image1
Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్... మేక‌దా లేక కుక్క‌దా.?
Related image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
35
కల్తీగా తేలిన సిరప్ పూర్తి వివరాలు
Image Credit : Getty

కల్తీగా తేలిన సిరప్ పూర్తి వివరాలు

అప్రమత్తం చేసిన సిరప్ వివరాలు ఇలా ఉన్నాయి

మందు పేరు: Almont-Kid Syrup

సంయోజనం: లెవోసెటిరిజైన్ డైహైడ్రోక్లోరైడ్, మోంటెలుకాస్ట్ సోడియం

బ్యాచ్ నంబర్: AL-24002

తయారీ తేదీ: జనవరి 2025

గడువు: డిసెంబర్ 2026

తయారీ సంస్థ: ట్రైడస్ రెమెడీస్, వైశాలి, బిహార్

ఈ బ్యాచ్‌కు చెందిన సిరప్ రాష్ట్రంలో ఎక్కడా అందుబాటులో ఉండకూడదని స్పష్టం చేశారు.

45
ఇథిలీన్ గ్లైకాల్ ఎంత ప్రమాదకరం?
Image Credit : X

ఇథిలీన్ గ్లైకాల్ ఎంత ప్రమాదకరం?

ఇథిలీన్ గ్లైకాల్ సాధారణంగా యాంటీఫ్రీజ్ తయారీలో వాడే రసాయనం. ఇది మందుల్లో కలిసితే తీవ్రమైన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా

కిడ్నీలపై తీవ్ర ప్రభావం

మెదడుకు నష్టం

వాంతులు, మూర్ఛ

అధిక మోతాదులో ప్రాణాపాయం

పిల్లల్లో ఈ ప్రభావం మరింత ప్రమాదకరంగా ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

55
ప్రజలు, ఆసుపత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Image Credit : Getty

ప్రజలు, ఆసుపత్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ Drug కంట్రోల్ అధికారులు పలు సూచనలు జారీ చేశారు. ఇంట్లో ఈ సిరప్ ఉంటే వెంటనే వాడకం ఆపాలి. దగ్గరలోని అధికారులకు సమాచారం ఇవ్వాలి. రిటైలర్లు, పంపిణీదారులు, ఆసుపత్రులు ఈ బ్యాచ్‌ను అమ్మకాలు చేయకూడదు. అనుమానిత కేసులు ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1800-599-6969 కు సమాచారం ఇవ్వాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు Drugsఇన్‌స్పెక్టర్లు ఇప్పటికే దుకాణాలు, ఆసుపత్రుల్లో తనిఖీలు చేపట్టారు. ప్రజారోగ్యం దృష్ట్యా ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
తెలంగాణ
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
అలా చేయకపోతే రేవంత్ రెడ్డి తప్పుకుంటా అన్నారా.? కొండా సురేఖ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
Recommended image2
Weather Update: ఏపీ, తెలంగాణకు ఐఎండీ వార్నింగ్.. అల్పపీడనం ఎఫెక్ట్‌తో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image3
Konda Surekha: కొండా సురేఖకు బిగ్ షాక్.. ఈ రచ్చకు కారణమేంటి?
Related Stories
Recommended image1
Mutton: మీరు కొంటున్న మ‌ట‌న్... మేక‌దా లేక కుక్క‌దా.?
Recommended image2
Gold Price: వెనిజులాలో బంగారం ధ‌ర ఎంతో తెలిస్తే.. వెంట‌నే ఫ్లైట్ ఎక్కేస్తారు..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved