MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే

హైదరాబాద్‌ లో స్పా కి వెళుతున్నారా..? మీరు తప్పకుండా పాటించాల్సిన జాగ్రత్తలివే

Hyderabad : మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించుకునేందుకు చాలామంది స్పా సెంటర్లకు వెళుతుంటారు. అయితే స్పాకి వెళ్లేముందు కొన్ని జాాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం… లేదంటే ఇబ్బందులు తప్పవు.   

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 25 2026, 01:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
స్పాకి వెళ్లేవారు ఈ విషయాలు తెలుసుకొండి..
Image Credit : gemini ai

స్పాకి వెళ్లేవారు ఈ విషయాలు తెలుసుకొండి..

ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవనశైలిలో మానసిక, శారీరక ఒత్తిడి బాగా పెరిగింది. అందుకే ప్రశాంతత కోసం, ఒత్తిడిని తగ్గించుకోవడానికి చాలామంది స్పా సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. అయితే స్పా వెళ్లడం అనేది కేవలం విశ్రాంతి కోసమే కాకుండా, అది మన ఆరోగ్యానికి సంబంధించిన విషయం కూడా కావడంతో కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
1. మసాజ్ సెంటర్ గురించి తెలుసుకొండి..
Image Credit : Gemini AI

1. మసాజ్ సెంటర్ గురించి తెలుసుకొండి..

మీరు స్పాకి వెళ్లాలని నిర్ణయించుకున్నప్పుడు మొదటగా చేయవలసిన పని ఆ సెంటర్ నాణ్యత, పరిశుభ్రతను తనిఖీ చేయడం. గదులు ఎంత శుభ్రంగా ఉన్నాయి, వారు ఉపయోగించే టవల్స్, ఇతర వస్తువులు క్రిమిరహితం చేయబడినవా లేదా అనేది గమనించాలి. ఆన్ లైన్ లో చెక్ చేస్తుంటే రివ్యూలు చూసుకోవాలి... దీంతో అక్కడి పరిస్థితులు తెలుస్తాయి.

37
2. లీగల్ సమస్యలు లేకుండా జాగ్రత్తపడండి..
Image Credit : Getty

2. లీగల్ సమస్యలు లేకుండా జాగ్రత్తపడండి..

స్పా ఎంపికలో అప్రమత్తత వహించకపోతే ఆరోగ్యంతో పాటు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ముందుగా మీరు సందర్శించే స్పా కేంద్రానికి ప్రభుత్వం నుంచి పొందిన అధికారిక అనుమతులు (Trade License), ధృవీకరణ పత్రాలు ఉన్నాయో లేదో పరిశీలించాలి. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు నిర్వహించే కేంద్రాల వల్ల వినియోగదారులు కూడా అనవసరమైన లీగల్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నమ్మకమైన, గుర్తింపు పొందిన సెంటర్లను మాత్రమే ఎంచుకోవాలి.

47
3. వ్యక్తిగత ప్రైవసీ చాలా ముఖ్యం..
Image Credit : Getty

3. వ్యక్తిగత ప్రైవసీ చాలా ముఖ్యం..

వ్యక్తిగత గోప్యత (Privacy) విషయంలో స్పా యాజమాన్యం అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలను పరిశీలించాలి. ముఖ్యంగా గదులలో సిసిటివి కెమెరాలు ఎక్కడున్నాయో చూసుకోవాలి. దీనివల్ల మన వ్యక్తిగత వీడియోలు, ఫోటోలు బయటకు రాకుండా ఉంటాయి.

57
4. అహార నియమాలు
Image Credit : Gemini AI

4. అహార నియమాలు

స్పా థెరపీకి వెళ్లే కనీసం రెండు గంటల ముందు వరకు భారీ ఆహారాన్ని తీసుకోకపోవడం మంచిది. ఖాళీ కడుపుతో లేదా చాలా తేలికపాటి ఆహారం తీసుకుని వెళ్లడం వల్ల మసాజ్ సమయంలో మీ శరీరం అసౌకర్యానికి గురికాకుండా ఉంటుంది.

67
6. ఆరోగ్యం జాగ్రత్త
Image Credit : Getty

6. ఆరోగ్యం జాగ్రత్త

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు, అలర్జీలు లేదా చర్మ సంబంధిత ఇబ్బందులు ఉంటే వాటి గురించి ముందుగానే అక్కడి థెరపిస్టుకు తెలియజేయాలి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, రక్తపోటు లేదా గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు డాక్టర్ సలహా తీసుకున్న తర్వాతే స్పాకి వెళ్లడం ఉత్తమం. స్పాకి వెళ్లేముందు మీ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడం చాలా అవసరం, కాబట్టి తగినంత నీరు తాగాలి.

77
7, విలువైన వస్తువులు తీసుకెళ్ళకండి..
Image Credit : Getty

7, విలువైన వస్తువులు తీసుకెళ్ళకండి..

థెరపీ సమయంలో మీ వ్యక్తిగత విలువైన వస్తువులను, బంగారు ఆభరణాలను ఇంట్లోనే ఉంచి వెళ్లడం లేదా స్పాలో సురక్షితంగా ఉంచుకోవడం మంచిది. చివరగా, స్పా అనుభవం మీకు పూర్తిస్థాయిలో లభించాలంటే కనీసం 15 నిమిషాల ముందే అక్కడికి చేరుకుని, మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
ఆరోగ్యం
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
RTC: ద‌స‌రా పండ‌గ‌కి ఊరుకెళ్తున్నారా.? భారీ ఏర్పాట్లు చేస్తున్న ఆర్టీసీ
Recommended image2
Most Expensive Apartment: ఇండియాలో రిచెస్ట్ అపార్ట్‌మెంట్.. ఒక్కోప్లాట్ ఎన్ని కోట్లో తెలుసా?
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వెదర్.. అక్కడ ఉరుములతో వానలు, ఇక్కడ ఊపేస్తున్న ఉక్కపోత
Related Stories
Recommended image1
Best Spas in Hyderabad : నో రిస్క్, బెస్ట్ సర్వీస్.. హైదరాబాద్ లో టాప్ 5 స్పా సెంటర్లు ఇవే
Recommended image2
Spa Center : స్పా ముసుగులో అసలు కథ వేరే ఉంది.. కండోమ్‌ల కుప్పలు చూసి షాకైన పోలీసులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved