MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Andhra Pradesh
  • IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే

IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే

Weather Report : ఈ వీకెండ్ కూడా తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణ పరిస్థితులే ఉంటాయని… ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు, సాయంత్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

2 Min read
Author : Arun Kumar P
Published : May 29 2026, 08:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలుగు రాష్ట్రాల్లో మిక్సుడ్ వెదర్..
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో మిక్సుడ్ వెదర్..

Weather Update : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతవారణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ఎండాకాలం నుండి వర్షకాలంలోకి ఎంటర్ అవుతున్న సమయమిది... అందుకే మిక్సుడ్ వెదర్ కనిపిస్తోంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు ఎండలు... సాయంత్రం కాగానే ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. మరి ఈ వీకెండ్ (శని, ఆదివారం) తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో వెదర్ ఎలా ఉండనుందో తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..
Image Credit : Gemini AI

ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు..

రేపు, ఎల్లుడి (శని, ఆదివారం) రెండ్రోజులు ఆంధ్ర ప్రదేశ్ లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరిస్తోంది. శనివారం తీవ్ర ఎండలతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని.... విభిన్న వాతావరణ పరిస్థితులు ఉంటాయని తెలిపింది.

నైరుతి బంగాళాఖాతం, ఆనుకుని ఉన్న తమిళనాడు తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. దీని ప్రభావంతో రేపు (శనివారం) అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

35
ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు..
Image Credit : ANI

ఆంధ్ర ప్రదేశ్ లో ఎండలు..

ఓవైపు వర్షాలు పడుతున్నా మరోవైపు మండుటెండలు కూడా కొనసాగుతున్నాయి. శనివారం 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. రాష్ట్రవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది.

జిల్లాలవారిగా ఉష్ణోగ్రతల అంచనా..

45°C – 46°C : పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాలు.

43°C – 44°C : విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాలు.

40°C – 42°C: శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలు

45
ఆదివారం వెదర్ ఎలా ఉంటుందంటే..
Image Credit : Gemini AI

ఆదివారం వెదర్ ఎలా ఉంటుందంటే..

శనివారం మాదిరిగానే ఆదివారం ఇలాంటి వాతావరణమే ఉంటుందని APSDMA తెలిపింది. అయితే మే 30న ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇదే సమయంలో వర్షాలు కాస్త పెరిగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల క్రింద, విద్యుత్ స్తంబాలు, హోర్డింగ్స్ క్రింద నిలబడొద్దని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

55
తెలంగాణలో వర్షాలు..
Image Credit : chatgpt

తెలంగాణలో వర్షాలు..

తెలంగాణలో కూడా శని, ఆదివారం రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. మే 30న నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు ఉంటాయట. ఉరుములు మెరుపులు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని ప్రకటించింది.

మే 31న అంటే ఈ ఆదివారం ఆదిలాబాద్, కొమ్రంభీ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురుస్తాయట. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ముక్కోటి దేవతలకు ఆహ్వానం | Tirumala Srivari Brahmotsavam | Asianet
Recommended image2
Now Playing
తిరుమల ఆలయంలో నూతన క్యాలెండర్ ఆవిష్కరించిన CM చంద్రబాబు | CM Chandrababu Unveils New Calendar
Recommended image3
ఆ ఇంజ‌క్ష‌న్ల వాడ‌కంపై ఏపీ ప్ర‌భుత్వం సీరియ‌స్‌.. 100 మెడికల్ షాపుల్లో తనిఖీలు
Related Stories
Recommended image1
Weather Update: రాబోయే 3 రోజులు దంచికొట్టనున్న వానలు.. ఈ ప్రాంతాల వారికి అలర్ట్
Recommended image2
IMD Rain Alert : ఒకేసారి ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎటాక్.. ఈ తెలుగు జిల్లాల్లో వర్ష బీభత్సం కంటిన్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved