MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Andhra Pradesh
  • Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్

Weather Update: ఒకపక్క ఎండలు మరోపక్క వానలు.. ఈ ప్రాంతాలకు నెక్స్ట్ 4 రోజులు హై అలర్ట్

Weather Update: తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల 46 డిగ్రీల ఎండలు మండిపోతుంటే, మరికొన్ని చోట్ల వానలు దంచికొడుతున్నాయి. రాబోయే నాలుగు రోజులు పిడుగులతో కూడిన భారీ వర్షాల కురిసే అవకాశముందని ఐఎండీ అలర్ట్ ఇచ్చింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 30 2026, 08:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రుతుపవనాలు వస్తున్నాయి.. కానీ, ఏపీ తెలంగాణలో వింత వెదర్
Image Credit : Gemini

రుతుపవనాలు వస్తున్నాయి.. కానీ, ఏపీ తెలంగాణలో వింత వెదర్

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం రూట్ మార్చింది. ఒక పక్క భానుడు తన ప్రతాపం చూపిస్తూ నిప్పుల కొలిమిని తలపిస్తుంటే, మరోపక్క సడెన్‌గా నల్లటి మబ్బులు కమ్ముకుని పిడుగులతో వర్షాలు పడుతున్నాయి. ఈ వింత వాతావరణాన్ని చూసి జనాలు షాక్ అవుతున్నారు.

ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు కొద్దిగా జోరు పెంచాయని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. అంటార్కిటికా, ఆస్ట్రేలియా, తూర్పు ఆఫ్రికా ప్రాంతాల నుంచి వస్తున్న గాలి ప్రవాహాలు ఈ రుతుపవనాలను ఇండియా వైపు వేగంగా నెడుతున్నాయి. లక్షద్వీప్, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలకు ఇవి రాబోయే రెండు మూడు రోజుల్లో విస్తరించే ఛాన్స్ ఉంది. మే 31 లేదా జూన్ 1వ తేదీ కల్లా రుతుపవనాలు కేరళను తాకొచ్చని ఐఎండీ అంచనా వేస్తోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బంగాళాఖాతంలో ఆవర్తనాలు
Image Credit : Gemini AI

బంగాళాఖాతంలో ఆవర్తనాలు

ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న మార్పుల వల్లే ఈ సడెన్ ట్విస్టులు కనిపిస్తున్నాయి. తమిళనాడు తీరాన్ని ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల సముద్ర మట్టానికి దాదాపు 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు భారీగా మేఘాలు పేరుకుపోయాయి. అటు ఆగ్నేయ అరేబియా సముద్రంలో కూడా మరో ఆవర్తనం యాక్టివ్‌గా ఉంది. వీటికి తోడు తూర్పు మధ్య, ఆగ్నేయ బంగాళాఖాతంలో మూడో ఆవర్తనం కూడా తోడైంది.

దీని ప్రభావం వల్ల మేఘాలు ఏకంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించాయి. ఉత్తరాంధ్ర మీదుగా ఉన్న మరో ఆవర్తనం మధ్య బంగాళాఖాతంలో చేరింది. ఇది కనుక మరింత బలపడితే అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో గంటకు 57 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.

35
ఏపీలో 46 డిగ్రీల మంట.. ఎక్కడెక్కడంటే?
Image Credit : AI

ఏపీలో 46 డిగ్రీల మంట.. ఎక్కడెక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో ఎండల తీవ్రత నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. శనివారం నాడు రాష్ట్రంలోని 11 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 64 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపించనుంది. ముఖ్యంగా పోలవరం, కాకినాడ, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో 45 నుంచి 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉంది.

విజయనగరం, గోదావరి జిల్లాలు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 43 నుంచి 44 డిగ్రీలు.. రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉండబోతున్నాయి. ఆదివారం నుంచి ఎండలు కాస్త తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

45
సడెన్ పిడుగుల అలర్ట్.. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు
Image Credit : AI

సడెన్ పిడుగుల అలర్ట్.. గంటకు 70 కిలోమీటర్ల వేగంతో గాలులు

ఇంతటి ఎండల్లోనే ఐఎండీ భారీ వర్షాలు, పిడుగుల అలర్ట్ ఇచ్చింది. మే 30 నుంచి జూన్ 2 వరకు కోస్తాంధ్రా, యానాం, రాయలసీమతో పాటు తెలంగాణలో పిడుగులు, మెరుపులతో కూడిన లైట్ టు మోడరేట్ వానలు పడే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మే 30, 31 తేదీల్లో తీర ప్రాంత ఏపీలో పిడుగులు పడే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది.

వాన పడటానికి ముందు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్లు, కొన్నిసార్లు ఏకంగా 70 కిలోమీటర్ల వేగంతో భీకరమైన ఈదురు గాలులు వీస్తాయి.

55
గ్లోబల్ ఎఫెక్ట్.. టైపూన్ జంగ్మీ అలజడి
Image Credit : Getty

గ్లోబల్ ఎఫెక్ట్.. టైపూన్ జంగ్మీ అలజడి

ఇక ప్రపంచ వాతావరణ పరిస్థితులను చూస్తే.. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన టైపూన్ జంగ్మీ (Typhoon Jangmi) క్రమంగా బలపడుతోంది. ఇది గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటోంది. ఇది ఎల్ నినో కి మరింత బూస్ట్ ఇస్తుండటంతో ఆగ్నేయ ఆసియా వైపు వేడి గాలులు వీచే ప్రమాదం ఉంది. అయితే భారత్ చుట్టుపక్కల మాత్రం భూమధ్యరేఖ అంతటా మేఘాలు దట్టంగా ఉన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
ఆంధ్ర ప్రదేశ్
అమరావతి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Chandrababu Massive Speech | స్టేజిని షేక్ చేసిన Chandrababu | Asianet Telugu
Recommended image2
Now Playing
Bonda Uma ని చూసి CM Chandrababu Reaction చూడండి | Asianet Telugu
Recommended image3
Now Playing
స్టూడెంట్స్ మాటలకూ పొట్టపగిలేలా నవ్వుతున్న Chandrababu | Asianet Telugu
Related Stories
Recommended image1
Cheapest Tesla EV India: ఇండియాలోకి టెస్లా చీపెస్ట్ ఈవీ కార్.. సింగిల్ ఛార్జ్‌తో 500 కిలోమీటర్ల మైలేజ్.. అదిరిపోయే ఫీచర్లు!
Recommended image2
Visakhapatnam: ఏపీ ప్రజల దశాబ్దాల కల.. జూన్ 1 నుంచి విశాఖ రైల్వే జోన్ షురూ.. కలిగే లాభాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved