- Home
- Telangana
- Railway Offer : సంక్రాంతికి ఊరెళ్లేందుకు టికెట్స్ కావాలా..? ఈ యాప్ ద్వారా కొంటే సూపర్ డిస్కౌంట్
Railway Offer : సంక్రాంతికి ఊరెళ్లేందుకు టికెట్స్ కావాలా..? ఈ యాప్ ద్వారా కొంటే సూపర్ డిస్కౌంట్
Railway Offer : ఇండియన్ రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లే తెలుగువారికి తక్కువ ధరకే టికెట్స్ ఇచ్చేలా స్పెషల్ డిస్కౌంట్స్ ప్రకటించింది.

ఇలా రైలు టికెట్ కొన్నారో.. మీకు కూడా డిస్కౌంట్
RailOne App : సంక్రాంతి పండక్కి సొంతూళ్లకు వెళ్లేందుకు ఇప్పటికే చాలామంది సిద్దం అయివుంటారు. పిల్లలకు సెలవులు రావడమే ఆలస్యం... పట్టణాల నుండి పల్లెల బాట పడుతుంటారు. అయితే ఒకేసారి ఇలా ప్రయాణికుల రద్దీ పెరగడంతో టికెట్ల ధరలు అమాంతం పెరిగిపోతాయి... ప్రభుత్వ రవాణా సంస్థలే ప్రత్యేక బస్సుల్లో టికెట్ ధరలు పెంచుతుంటాయి... ఇక ప్రైవేట్ ట్రావెల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రయాణికుల రద్దీని బట్టి టికెట్ ధరలు పెంచి సామాన్యుల జేబులు ఖాళీ చేస్తుంటాయి.
ఇలా పండగ సమయంలో ప్రయాణికుల అవస్థను గుర్తించిన రైల్వే శాఖ సూపర్ డిస్కౌంట్స్ తో ముందుగా వచ్చింది. సరిగ్గా పండగ సమయంలో అందరూ టికెట్ ధరలు పెంచితే రైల్వే శాఖ మాత్రం తగ్గిస్తామంటోంది. ప్రత్యేక యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులు డిస్కౌంట్స్ అందించనున్నట్లు రైల్వే తెలిపింది. ఇంతకూ ఆ యాప్ ఏమిటి? ఎలాగైతే టికెట్ కొనుగోలుపై డిస్కౌంట్ పొందవచ్చు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
రైల్ వన్ యాప్ లో సూపర్ డిస్కౌంట్...
RailOne (రైల్ వన్) యాప్ ... టికెట్ కొనుగోలుతో పాటు రైల్వే శాఖ అందించే అనేక సేవలను ఈ యాప్ ద్వారా ప్రయాణికులు పొందవచ్చు. ఈ యాప్ ను ఇప్పటికే చాలామంది ఉపయోగిస్తున్నారు... అయితే దీన్ని ప్రయాణికులకు మరింత దగ్గర చేసేందుకు టికెట్ కొనుగోలుపై ఆఫర్లు ప్రకటించారు.
ఈ రైల్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులు డిజిటల్ పేమెంట్ మోడ్ ను ఉపయోగిస్తే టికెట్ ధర తగ్గుతుంది. ఇలా డిజిటల్ పేమెంట్స్ చేసేవారికి టికెట్ ధరపై 3 శాతం రాయితీ లభించనుంది. అయితే ఇది కేవలం అన్ రిజర్వుడ్ టికెట్ కొనుగోలుకు మాత్రమే వర్తిస్తుంది.
పరిమిత కాల ఆఫర్... ఎప్పటినుండి ఎప్పటివరకు..?
రైల్ వన్ యాప్ లో అన్ రిజర్వుడ్ టికెట్స్ కొనుగోలుపై డిస్కౌంట్ పరిమిత కాల ఆఫర్. ఇది సరిగ్గా సంక్రాంతి నుండి ప్రారంభం అవుతుంది. 14 జనవరి 2026 నుండి 14 జూలై 2026 వరకు అంటే సరిగ్గా ఆరు నెలలపాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. సంక్రాంతి పండగ సమయంలో రాకపోకలు సాగించే ప్రయాణికులకు ఈ ఆఫర్ ఉపయోగపడుతుంది. ఇక రెగ్యులర్ గా రైల్వేలో ప్రయాణించేవారు రైల్ వన్ యాప్ ద్వారా తక్కువ ధరకే టికెట్ కొనుగోలు చేయవచ్చు... తద్వారా డబ్బులు ఆదా అవుతాయి.
రైల్ వన్ యాప్ మరో ఆఫర్...
ప్రస్తుతం రైల్ వన్ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసినా డిస్కౌంట్ లభిస్తుంది... ఇందుకోసం ఆర్-వాలేట్ ద్వారా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అయితే వెంటనే డిస్కౌంట్ కాకుండా క్యాష్ బ్యాక్ రూపంలో తర్వాత డిస్కౌండ్ డబ్బులు వస్తాయి. కానీ ఈ ఆఫర్ ను అన్ని డిజిటల్ పేమెంట్స్ కు విస్తరిస్తోంది రైల్ వన్... దీనికి తగినట్లుగా సాప్ట్ వేర్ వ్యవస్థలో మార్పులు చేయాలని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (CRIS) కు రైల్వే శాఖ ఆదేశించింది.
జనవరి 14 నుండి రైల్ వన్ యాప్ లో టికెట్ కొనుగోలుపై మాత్రమే ఈ డిస్కౌంట్ లభించనుంది... ఇతర మార్గాల్లో కొనుగోలుపై ఈ ఆపర్ వర్తించదని రైల్వే శాఖ స్పష్టం చేసింది. డిజిటల్ పేమెంట్స్ ను ప్రోత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ చెబుతోంది.

