Long Weekend : ఈసారి వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్... వరుసగా మూడ్రోజులు సెలవులే..
Long Weekend : సాధారణంగా ఆదివారం సెలవుకే ఉద్యోగులు ఎగిరి గంతేస్తారు.. అలాంటిది ఈ వీకెండ్ వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి… వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్ వస్తోంది.

ఉద్యోగులకు గుడ్ న్యూస్
long weekend : తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు పరీక్షలు ముగిశాయి... వేసవి సెలవులు ప్రారంభయ్యాయి. ఇదే సమయంలో ఎండలు కూడా మండిపోతున్నాయి. దీంతో పేరెంట్స్ కి ఎప్పుడెప్పుడు సెలవులు వస్తాయా... ఎప్పుడు మంచి హాలిడే ట్రిప్ కు వెళదామా.. అని చాలామంది ఎదురుచూస్తుంటారు. అలాంటివారి కోసమే ఈసారి వీకెండ్ కాదు లాంగ్ వీకెండ్ వస్తోంది... వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయి. ఈ సెలవుల్లో హాయిగా హాలిడే ట్రిప్ ప్లాన్ చేసుకోవచ్చు... ఈ ఎండల నుండి ఉపశమనం పొందేందుకు చల్లని ప్రాంతాలకు వెళ్లి చిల్ కావచ్చు.
మే 1 నుండి 3 వరకు సెలవులే...
రేపు (ఏప్రిల్ 30, గురువారం) ఒక్కరోజు గడిస్తే చాలు… మే నెలలోకి ఎంటర్ అవుతాం. అయితే ప్రతిసారి లాగే ఈసారి కూడా మే సెలవుతో ప్రారంభమవుతోంది… కానీ ఒక్కరోజు కాదు ఉద్యోగులకు వరుసగా మూడ్రోజులు సెలవులు వస్తున్నాయి. మే 1 (శుక్రవారం)న అంతర్జాతీయ కార్మిక దినోత్సవం... కాబట్టి ఈరోజు ఉద్యోగులకు సెలవు ఉంటుంది. తర్వాత మే 2 శనివారం... ఈరోజు కూడా కార్పోరేట్, ఐటీ ఉద్యోగులకు సెలవు ఉంటుంది.... కొందరు ప్రభుత్వ ఉద్యోగులకూ సెలవే. ఇక మే 3 ఆదివారం... ఉద్యోగులందరికీ సాధారణ సెలవు ఉంటుంది. ఇలా వీకెండ్ కు మేడే సెలవు కలిసిరావడంతో వరుసగా మూడ్రోజుల హాలిడేస్ వస్తున్నాయి.
మేడే సెలవు లేకున్నా పెయిడ్ లీవ్ పొందవచ్చు... ఎలాగో తెలుసా..?
మే 1న కార్మిక దినోత్సవం సందర్భంగా సెలవు లేకున్నా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఉద్యోగులు పెయిడ్ లీవ్ పొందవచ్చు. ఈ రోజు బుద్ద పూర్ణిమ సందర్భంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో ఆప్షనల్ హాలిడే ప్రకటించారు... అంటే ఉద్యోగులు ముందుస్తు అనుమతితో ఈ రోజు శాలరీతో కూడిన సెలవు పొందవచ్చు. ఇలా సెలవు తీసుకుంటే శని, ఆదివారం వీకెండ్ సెలవులు కూడా కలిసివస్తాయి... ఈ మూడ్రోజులు ఫ్యామిలీలో హాయిగా గడపవచ్చు.
బ్యాంకులకు కూడా సెలవే..
మేడే సందర్భంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి. అయితే మే లో వచ్చే మొదటి శనివారం కాబట్టి మే 2న సెలవు ఉండదు... బ్యాంకులు యధావిధిగా నడుస్తాయి. తిరిగి మే 3న ఆదివారం బ్యాంకులు మళ్లీ మూత పడతాయి... ఉద్యోగులకు సెలవు ఉంటుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో రెండు రోజులు బ్యాంకులకు సెలవులున్నాయి. అయితే గుజరాత్, ఒడిషా, సిక్కిం, రాజస్థాన్, నాగాలాండ్, మేఘాలయా రాష్ట్రాల్లో మాత్రం బ్యాంకులకు మేడే సెలవు లేదు.

