- Home
- Telangana
- ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు మీ ఇల్లు సేఫ్.. బల్బ్‌లా కనిపించే సీక్రెట్ కెమెరా, ఎలా పని చేస్తుందంటే
ఇంట్లో ఇదొక్కటి ఉంటే చాలు మీ ఇల్లు సేఫ్.. బల్బ్‌లా కనిపించే సీక్రెట్ కెమెరా, ఎలా పని చేస్తుందంటే
Bulb Camera: ఇంటి భద్రత కోసం మార్కెట్లో ఎన్నో స్మార్ట్ సెక్యూరిటీ పరికరాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో Securinnov 3MP Indoor WiFi Light Bulb Camera ఒకటి. సాధారణ LED బల్బ్‌లా కనిపించే దీని లోపల హై-డెఫినిషన్ కెమెరా వంటి ఎన్నో ఆధునిక ఫీచర్లు ఉన్నాయి

360 డిగ్రీల కెమెరా.. గదిలో ప్రతి మూల కనిపిస్తుంది
ఈ బల్బ్ కెమెరాలో 3MP HD రిజల్యూషన్‌తో కూడిన ఫిష్‌ఐ లెన్స్ ఉంటుంది. ఇది 360 డిగ్రీల ప్యానోరమిక్ వ్యూ అందించడంతో గదిలోని ప్రతి మూలను స్పష్టంగా చూడవచ్చు. సాధారణ CCTV కెమెరాల్లో ఉండే బ్లైండ్ స్పాట్లు ఇందులో చాలా వరకు ఉండవు. అందువల్ల ఒకే కెమెరాతో పెద్ద గదిని కూడా పూర్తిగా పర్యవేక్షించవచ్చు.

రెండు దిశల్లో మాట్లాడే సదుపాయం
ఈ స్మార్ట్ బల్బ్ కెమెరాలో మైక్రోఫోన్, స్పీకర్ ఏర్పాటు చేశారు. దీంతో మొబైల్ యాప్ ద్వారా ఇంట్లో ఉన్న వారితో నేరుగా మాట్లాడవచ్చు. చిన్నపిల్లలు, వృద్ధులు లేదా పెంపుడు జంతువులను పర్యవేక్షించడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంటి వద్దకు వచ్చిన సందర్శకులతో కూడా ఫోన్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంటుంది.
నైట్ విజన్, మోషన్ అలర్ట్స్‌తో 24 గంటల భద్రత
రాత్రి సమయంలో కూడా స్పష్టమైన వీడియో రికార్డింగ్ కోసం ఇన్‌ఫ్రారెడ్ నైట్ విజన్ ఫీచర్‌ను అందించారు. పూర్తిగా చీకటిలో కూడా పరిసరాలను గమనించవచ్చు. అలాగే కెమెరా ముందు ఎవరైనా కదలిక కనిపిస్తే వెంటనే మొబైల్‌కు నోటిఫికేషన్ పంపుతుంది. దీంతో అనుమానాస్పద కదలికలను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుంది.
మొబైల్ యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా పర్యవేక్షణ
ఈ కెమెరా Wi-Fi ద్వారా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అవుతుంది. ఆండ్రాయిడ్, ఐఫోన్ మొబైల్ ఫోన్లలో పనిచేసే V380 Pro యాప్ ద్వారా లైవ్ వీడియో చూడవచ్చు. ఇంట్లో లేకపోయినా ప్రపంచంలో ఎక్కడి నుంచైనా ఫోన్ ద్వారా కెమెరాను యాక్సెస్ చేయడం సాధ్యమవుతుంది. వీడియోలను చూడడం, సెట్టింగ్స్ మార్చడం, రికార్డింగ్స్ పరిశీలించడం వంటి పనులు యాప్‌లోనే చేయవచ్చు.
ఇన్‌స్టాలేషన్ చాలా సులభం
ఈ కెమెరాను అమర్చడానికి ప్రత్యేక వైరింగ్ లేదా డ్రిల్లింగ్ అవసరం లేదు. సాధారణ B22 బల్బ్ హోల్డర్‌లో బల్బ్‌ను అమర్చినట్లే స్క్రూ చేస్తే సరిపోతుంది. పవర్ అందిన వెంటనే Wi-Fi కనెక్ట్ చేసి ఉపయోగించవచ్చు. అద్దె ఇళ్లలో నివసించే వారికి కూడా ఇది సులభమైన సెక్యూరిటీ పరిష్కారంగా ఉపయోగపడుతుంది. LED లైట్‌గా కూడా పనిచేయడం వల్ల లైటింగ్‌తో పాటు భద్రతను ఒకే పరికరంలో పొందవచ్చు.
ఇక ఇందులో 3MP HD కెమెరా, 360° ప్యానోరమిక్ వ్యూ, కలర్ నైట్ విజన్, మోషన్ డిటెక్షన్ అలర్ట్స్, టూ-వే ఆడియో కమ్యూనికేషన్, Wi-Fi కనెక్టివిటీ, V380 Pro మొబైల్ యాప్ సపోర్ట్, B22 బల్బ్ సాకెట్ ఇన్‌స్టాలేషన్, ఇండోర్, అవుట్‌డోర్ వినియోగానికి అనుకూలంగా ఉంటుంది.

