MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • IMD Rain Alert : ఏకంగా 64 సెం.మీ వర్షపాతమా..! ఈ ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్, ఇక అల్లకల్లోలమే..

IMD Rain Alert : ఏకంగా 64 సెం.మీ వర్షపాతమా..! ఈ ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్, ఇక అల్లకల్లోలమే..

Rains Alert : తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. ఎండలు మండిపోయే సమయంలో వర్షాలు కురుస్తున్నాయి… దీంతో వాతావరణం చల్లబడింది. 

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 17 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు
Image Credit : X/APSDMA

తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు

Rain Alert : మండుటెండల నుండి ఉపశమనం కల్పిస్తూ తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మొదలయ్యాయి. ద్రోణి,  నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చాలాప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలే పడుతున్నాయి... ఒకటిరెండు చోట్ల మాత్రం భారీ వానలు, ఈదురుగాలుల బీభత్సం కొనసాగుతోంది. ఇలా గత ఆదివారం (మార్చి 15న) మొదలైన వర్షాలు సోమవారం (మార్చి 16న) మరింత జోరందుకున్నాయి... ఇవాళ (మార్చి 17, మంగళవారం) కూడా ఇరు తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు కురుస్తాయని వాతావరణ శాఖలు హెచ్చరికలు జారీ చేశాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
నేడు ఏపీలో వర్షాలు..
Image Credit : Asianet News

నేడు ఏపీలో వర్షాలు..

నేడు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ... ఇలా ఆంధ్ర ప్రదేశ్ లోని అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ(APSDMA) వెల్లడించింది. అలాగే పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది.

36
ఈ వేసవి వర్షాలతో తస్మాత్ జాగ్రత్త...
Image Credit : X/APSDMA

ఈ వేసవి వర్షాలతో తస్మాత్ జాగ్రత్త...

వేసవిలో కురిసే వర్షాలు పిడుగులు, ఈదురుగాలులను వెంటపెట్టుకుని వస్తాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు సంస్థ హెచ్చరించింది. ముఖ్యంగా వ్యవసాయ పనులకోసం పొలాలవద్ద ఉండే రైతులు, కూలీలు వర్ష సమయంలో చెట్లకిందకు వెళుతుంటారని... ఇలా అస్సలు చేయరాదని సూచించింది. చెట్లపైనే ఎక్కువగా పిడుగులు పడే ప్రమాదం ఉంటుందని... అంతేకాదు ఈదుగాలులకు కొమ్మలు విరిగిపడి ప్రమాదాలు జరగొచ్చని అంటోంది. అందుకే చెట్ల కింద కాకుండా సురక్షితమైన ప్రాంతాల్లో తలదాచుకోవాలని APSDMA సూచించింది.

46
తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..
Image Credit : X

తెలంగాణలో అత్యధిక వర్షపాతం ఇక్కడే..

తెలంగాణ విషయానికి వస్తే రాజధాని హైదరాబాద్ సహా అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి. నిన్న(సోమవారం) సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిశాయి... పాపన్నపేట మండలంలో వడగళ్ల వానలు పడ్డాయి. అత్యధికంగా వట్ పల్లిలో 64 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. హైదరాబాద్ లో కూడా చిరుజల్లులు కురిశాయి. ఆరెంజ్, ఎల్లో అలర్ట్ జారీచేసే స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి.

56
నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Image Credit : Gemini AI

నేడు ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

ఇవాళ (మార్చి 17, మంగళవారం) ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ వర్షాలకు ఉరుములు మెరుపులు, పిడుగులు తోడవుతాయని... గంటకు 30-40 కిలోమీటర్ల వేగం, గరిష్ఠంగా 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతవరణ కేంద్రం హెచ్చరించింది.

66
నేడు హైదరాబాద్ లో వర్షాలు
Image Credit : Getty

నేడు హైదరాబాద్ లో వర్షాలు

రాజధాని హైదరాబాద్ తో పాటు శివారు జిల్లాలైన రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరిలో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వారంమొత్తం ఇలాగే తెలంగాణవ్యాప్తంగా వర్షాలుంటాయని... ఎండల తీవ్రత తగ్గి వాతావరణం చల్లగానే ఉంటుందని వెల్లడించింది. మధ్యాహ్నం ఎండ, సాయంత్రం వానతో భిన్నమైన వాతావరణం ఉంటుందట... ఈ వెదర్ చేంజ్ కారణంగా ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలుంటాయి. కాబట్టి ప్రజలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విజయవాడ
విశాఖపట్నం
తిరుపతి
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Recommended image2
Rain Alert : ద్రోణితో జతకట్టిన నైరుతి గాలులు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved