MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!

Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్ టూ ముంబై 3 గంటల్లోనే.. బుల్లెట్ ట్రైన్ డీపీఆర్ రెడీ! ఇక విమానం ఎక్కాల్సిన అవసరం లేదు!

Hyderabad Mumbai Bullet Train: హైదరాబాద్-ముంబై మధ్య రైలు ప్రయాణం 3 గంటలకు తగ్గనుంది. దీని కోసం హై-స్పీడ్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ సిద్ధమైంది. రూ. 2 లక్షల కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న ప్రాజెక్టు వివరాలు ఇలా ఉన్నాయి.. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 30 2026, 08:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
15 గంటల ప్రయాణం కేవలం 3 గంటలే.. తెలంగాణ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్
Image Credit : Gemini

15 గంటల ప్రయాణం కేవలం 3 గంటలే.. తెలంగాణ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్

హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్లాలంటే ప్రస్తుతం రైలులో దాదాపు 14 నుంచి 15 గంటల సమయం పడుతుంది. కానీ, భవిష్యత్తులో ఈ ప్రయాణం కేవలం 3 గంటలకు తగ్గనుంది. తెలంగాణ ప్రభుత్వ హైదరాబాద్-పుణె-ముంబై హై-స్పీడ్ రైల్ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్ రెడీ అయింది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దక్షిణ, పశ్చిమ భారతం మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా మారిపోనుంది.

సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ ప్రాజెక్టు వివరాలు వెల్లడించారు. హైదరాబాద్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకుని పొరుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలకు హై-స్పీడ్ కనెక్టివిటీని పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
761 కిలోమీటర్ల మేర కారిడార్.. గంటకు 330 కి.మీ వేగం
Image Credit : Gemini AI

761 కిలోమీటర్ల మేర కారిడార్.. గంటకు 330 కి.మీ వేగం

ఈ ప్రతిపాదిత కారిడార్ మొత్తం 761 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ప్రయాణించే బుల్లెట్ రైళ్లు గంటకు 320 నుండి 330 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందించారు. దీంతో హైదరాబాద్ నుంచి ముంబైకి ప్రయాణ సమయం మూడు గంటలకు తగ్గనుంది. ఈ మార్గంలో దాదాపు 10 నుండి 12 స్టేషన్లు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఎలివేటెడ్ ట్రాక్‌లు, భూగర్భ మార్గాలు ఉంటాయి.

Related Articles

Related image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Related image2
Strange Traditions: వధూవరులు మంటలపై నడిచే పెళ్లి.. ఛత్తీస్‌గఢ్‌లో వింత సంప్రదాయం వైరల్
35
వికారాబాద్ వద్ద 5 కిలోమీటర్ల టన్నెల్
Image Credit : Gemini AI

వికారాబాద్ వద్ద 5 కిలోమీటర్ల టన్నెల్

ఈ ప్రాజెక్టులో ఇంజనీరింగ్ పరంగా కొన్ని అద్భుతమైన నిర్మాణాలు కూడా ఉండనున్నాయి. వికారాబాద్ సమీపంలో సుమారు 4 నుండి 5 కిలోమీటర్ల పొడవైన టన్నెల్ నిర్మించాలని అధికారులు ప్రతిపాదించారు. భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా ఈ టన్నెల్ నిర్మాణం చేపట్టనున్నారు. అహ్మదాబాద్-ముంబై బుల్లెట్ రైలు ప్రాజెక్టు తర్వాత దేశంలోనే అత్యంత కీలకమైన హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుగా ఇది నిలవనుంది.

45
రూ. 2 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయం
Image Credit : Getty

రూ. 2 లక్షల కోట్ల భారీ అంచనా వ్యయం

ప్రాథమిక డీపీఆర్ అంచనాల ప్రకారం, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. ఇతర హై-స్పీడ్ రైలు ప్రాజెక్టుల వ్యయంతో పోల్చి ఈ అంచనాకు వచ్చారు. అయితే, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు, నిధుల లభ్యత, సాంకేతిక అంశాలను చెక్ చేసిన తర్వాత మొత్తం ఖర్చు ఎంతనేది ఫైనల్ కానుంది. ఈ ప్రాజెక్టు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ తో తెలంగాణ ప్రభుత్వం సమన్వయం చేసుకుంటోంది.

55
2027-28లో ప్రారంభం కానున్న పనులు?
Image Credit : Getty

2027-28లో ప్రారంభం కానున్న పనులు?

డీపీఆర్ రెడీ అయిన నేపథ్యంలో, నెక్ట్స్ కేంద్రం నుంచి అనుమతులు పొందడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2027 చివరిలో లేదా 2028 ప్రారంభంలో ఈ కారిడార్ నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది. నిర్మాణం ప్రారంభమైన తర్వాత 6 నుండి 8 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 

ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపు

ఈ కారిడార్ కేవలం ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా, ఆర్థికంగా కూడా ఎంతో కీలకం కానుంది. హైదరాబాద్, పుణె, సోలాపూర్, ముంబై వంటి ప్రధాన ఆర్థిక కేంద్రాలను కలపడం ద్వారా వాణిజ్యం, పారిశ్రామికాభివృద్ధి వేగవంతం అవుతుందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ముంబైతో పాటు బెంగళూరు, చెన్నై నగరాలకు కూడా హై-స్పీడ్ రైలు మార్గాలను అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్స్ రెడీ చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image2
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Recommended image3
Now Playing
రాజగోపాల్ రెడ్డి పేరు ఎత్తగానే దద్దరిల్లిన సభ | Uttam Kumar Speech at Nakrekal
Related Stories
Recommended image1
Rohit Sharma Net Worth: నాడు రూ. 275 ఫీజు కట్టలేక ఇబ్బందులు.. నేడు కోట్ల సామ్రాజ్యం.. రోహిత్ శర్మ నెట్‌వర్త్‌ ఎంత?
Recommended image2
Strange Traditions: వధూవరులు మంటలపై నడిచే పెళ్లి.. ఛత్తీస్‌గఢ్‌లో వింత సంప్రదాయం వైరల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved