MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • Weather Update: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. మరోవైపు 42 డిగ్రీల ఎండలు !

Weather Update: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. మరోవైపు 42 డిగ్రీల ఎండలు !

Weather Update: తెలంగాణలో భిన్న వాతావరణం నెలకొంది. కొన్ని జిల్లాలకు భారీ వర్షాల ఆరెంజ్ అలర్ట్, మరికొన్ని చోట్ల తీవ్ర వడగాల్పుల ముప్పు పొంచి ఉందని ఐఎండీ హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2026, 09:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
క్లైమేట్ ట్విస్ట్.. ఒక పక్క ఉరుముల వాన.. ఇంకో పక్క ఉడికించే ఎండ
Image Credit : Gemini AI

క్లైమేట్ ట్విస్ట్.. ఒక పక్క ఉరుముల వాన.. ఇంకో పక్క ఉడికించే ఎండ

తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం నెలకొంది. రుతుపవనాలు ఏంట్రీ ఇచ్చినప్పటికీ ఒకే టైంలో రెండు విభిన్నమైన సీన్లు కనిపిస్తున్నాయి. ఒకవైపు నైరుతి రుతుపవనాలు (Monsoon) స్పీడ్ పెంచడంతో వానలు దంచికొడుతుంటే, మరోవైపు భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు.

రాబోయే రెండు రోజులు స్టేట్‌లో వెదర్ కంప్లీట్‌గా ఛేంజ్ కాబోతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం క్లారిటీ ఇచ్చింది. అరేబియా సముద్రం నుంచి బంగాళాఖాతం వరకు విస్తరించిన ద్రోణి, అలాగే ఉపరితల ఆవర్తనం ఎఫెక్ట్‌తో కొన్ని చోట్ల కుండపోత వానలు, మరికొన్ని చోట్ల వడగాల్పులు ఉంటాయని తెలిపింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఆరెంజ్ అలర్ట్ టు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ
Image Credit : ANI

ఆరెంజ్ అలర్ట్ టు ఎల్లో అలర్ట్ ఇచ్చిన ఐఎండీ

నైరుతి రుతుపవనాల జోరుతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు భారత వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ముఖ్యంగా నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల్లో వాన తీవ్రత ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉంది.

ఇక ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నిర్మల్, రంగారెడ్డి, సూర్యాపేట, వనపర్తి, హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఖమ్మం జిల్లా కల్లూరులో రికార్డు స్థాయిలో 11.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Related Articles

Related image1
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
35
హైదరాబాద్ వాసులూ బి అలర్ట్
Image Credit : Gemini AI

హైదరాబాద్ వాసులూ బి అలర్ట్

హైదరాబాద్ లో అక్కడక్కడా చినుకులు పడ్డాయి. రాబోయే కొన్ని గంటల్లో నగరం మొత్తం భారీ వర్షంతో తడిసిముద్దయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉండే జనం అప్రమత్తంగా ఉండాలి. రోడ్లన్నీ చెరువుల్లా మారే ప్రమాదం ఉంది కాబట్టి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పవు. వర్షం పడేటప్పుడు కరెంట్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లకు దూరంగా ఉండాలని హైడ్రా (HYDRA), విద్యుత్ శాఖ అధికారులు హెచ్చరించారు.

45
ఉత్తర తెలంగాణలో భానుడి భగభగలు.. 42 డిగ్రీల ఎండలు
Image Credit : Getty

ఉత్తర తెలంగాణలో భానుడి భగభగలు.. 42 డిగ్రీల ఎండలు

దక్షిణ తెలంగాణలో వానలు పడుతుంటే.. ఉత్తర తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో తీవ్రమైన వడగాలులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో ఏకంగా 42.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. స్టేట్‌లోని దాదాపు 21 జిల్లాల్లో టెంపరేచర్స్ 42.2 నుంచి 42.8 డిగ్రీల మధ్య రికార్డయ్యాయి. రాబోయే మూడు రోజుల పాటు ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో వడగాల్పుల ముప్పు పొంచి ఉంది.

55
కోస్తా తీరంలో అల్లకల్లోలం.. ఏపీకి భారీ వర్ష సూచన
Image Credit : stockPhoto

కోస్తా తీరంలో అల్లకల్లోలం.. ఏపీకి భారీ వర్ష సూచన

తెలంగాణలోనే కాదు, అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వాతావరణం అల్లకల్లోలంగా మారబోతోంది. రుతుపవనాలు శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం వరకు విస్తరించాయి. దీనివల్ల అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. సముద్ర తీరంలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల స్పీడ్‌తో భయానక ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
వాతావరణం
తెలంగాణ
హైదరాబాద్
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
KCR : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీకి వెళతారు సరే.. ఇంతకీ కేసీఆర్ వెళతారా, లేదా?
Recommended image2
Holidays : విద్యార్థులు, ఉద్యోగులకు పండగే.. ఈ వినాయక చవితికి ఏకంగా ఆరు రోజులు సెలవులే
Recommended image3
Now Playing
Revanth Reddy Full Speech At Nakirekal Meeting | Asianet News Telugu
Related Stories
Recommended image1
Significance of Temple Bells: గుడిలో గంట ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న క్రేజీ సైన్స్ ఏంటో తెలుసా?
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved