MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హైదరాబాద్ లో చల్లచల్లని టూరిస్ట్ స్పాట్స్.. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలను తప్పకుండా తీసుకెళ్లండి

హైదరాబాద్ లో చల్లచల్లని టూరిస్ట్ స్పాట్స్.. ఈ వేసవి సెలవుల్లో మీ పిల్లలను తప్పకుండా తీసుకెళ్లండి

Hyderabad : వేసవిలో హైదరాబాద్ హాట్ హాట్ గా ఉంటుంది… ఎండలు మండిపోతాయి. ఇలాంటి సమయంలోనూ కొన్ని ప్రాంతాలు, కొన్ని సమయాల్లో ఆహ్లాదకరంగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలేవో తెెలుసా..?   

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 31 2026, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
వేసవిలో తప్పకుండా సందర్శించాల్సిన టూరిస్ట్ స్పాట్స్...
Image Credit : Gemini AI

వేసవిలో తప్పకుండా సందర్శించాల్సిన టూరిస్ట్ స్పాట్స్...

తెలుగు రాష్ట్రాల్లో త్వరలోనే విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి. ఇదే సమయంలో ఎండలు కూడా ముదరనున్నాయి. ఈ క్రమంలో పిల్లలను ఎక్కడికైనా తీసుకెళ్లాలన్నా పేరెంట్స్ ఇబ్బందులు తప్పవు.. అలాగని పిల్లలను ఇంటికే పరిమితం చేయడం కూడా తగదు. కాబట్టి వేసవికాలంలోనూ కాస్త చల్లని వాతావరణం ఉండేవి, సాయంత్రం సమయంలో సరదాగా వెళ్లివచ్చే టూరిస్ట్ స్పాట్స్ హైదరాబాద్ లో అనేకం ఉన్నాయి. వాటిగురించి ఇక్కడ తెలసుకుందాం.

27
1. చార్మినార్
Image Credit : Asianet News

1. చార్మినార్

హైదరాబాద్ లోని చారిత్రక కట్టడాలు, సహజ అందాలు, సరస్సులు, వినోద ప్రదేశాలు పిల్లలకే కాదు ప్రతి వయసు వారికి ప్రత్యేక అనుభూతిని అందిస్తుంది. ఉష్ణోగ్రతలు పెరిగినా, సరైన ప్రదేశాలను ఎంచుకుంటే సేదతీరే అవకాశాలు ఉన్నాయి. ఇలా తెల్లవారుజామున లేదంటే సాయంత్రం వేళ సరదాగా వెళ్లివచ్చే ప్రాంతం చార్మినార్. నగరం మధ్యలో ఠీవీగా నిలిచిన ఈ చారిత్రక కట్టడం సందర్శకులను వెంటనే ఆకర్షిస్తుంది. పురాతన నిర్మాణ శైలితో కూడిన ఈ ప్రాంతం కేవలం ఫోటోలకే కాదు చరిత్రను అర్థం చేసుకునే అవకాశం ఇస్తుంది. సమీపంలోని లాడ్ బజార్ ప్రాంతంలో సంప్రదాయ వస్తువులు కనిపిస్తాయి. వేసవిలో ఉదయం లేదా సాయంత్రం సమయాల్లో ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే వేడి తక్కువగా ఉంటుంది.

Related Articles

Related image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Related image2
Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు
37
2. గోల్కొండ కోట
Image Credit : Asianet News

2. గోల్కొండ కోట

గోల్కొండ కోట మరో ముఖ్యమైన ప్రదేశం. ఇక్కడి నిర్మాణంలో ఉపయోగించిన శబ్ద ప్రతిధ్వని వ్యవస్థ ఇప్పటికీ ఆశ్చర్యపరుస్తుంది. కోట పైభాగానికి చేరుకున్నప్పుడు నగర దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. సాయంత్రం జరిగే లైట్ అండ్ సౌండ్ షో సందర్శకులకు ప్రత్యేక అనుభూతి ఇస్తుంది. ఉదయం ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది.... ఈ సమయంలో కోటను సందర్శించవచ్చు... రాత్రి సమయంలో లైట్ ఆండ్ సౌండ్ షో లో కోట అందాలు రెట్టింపు అవుతాయి... దీన్ని పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు.

47
3. హుస్సేన్ సాగర్
Image Credit : Gemini AI

3. హుస్సేన్ సాగర్

వేసవిలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా సరస్సులు, పార్కులు వైపు మొగ్గు చూపుతారు. ఇలా వేసవి వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగర నడిబొడ్డున గల హుస్సేన్ సాగర్ కు జనాలు తండోపతండాలుగా తరలివస్తుంటారు. ఉదయం లేదా సాయంత్రం సమయంలో ట్యాంక్ బండ్, ఎన్టీఆర్, నెక్లెస్ రోడ్ లో నడక అద్భుతంగా ఉంటుంది. నీటి మధ్యలో నిలిచిన బుద్ధ విగ్రహానికి దగ్గరగా సూర్యుడు... ఆ సన్నివేశం కనువిందు చేస్తుంది. పడవ ప్రయాణం ద్వారా సరస్సు మధ్యకు వెళ్లడం ఒక మధుర అనుభవం.

57
4. కేబిఆర్ పార్క్
Image Credit : stockPhoto

4. కేబిఆర్ పార్క్

కేబీఆర్ నేషనల్ పార్క్ ప్రకృతి ప్రేమికులకు ఒక అద్భుతమైన ప్రదేశం. నగరంలో ఉన్నప్పటికీ ఇది అడవి వాతావరణాన్ని అందిస్తుంది. చెట్ల నీడలో నడక చేస్తూ వేడిని కొంతవరకు తప్పించుకోవచ్చు. పక్షుల కిలకిలలు, ప్రశాంత వాతావరణం ఇక్కడి ప్రధాన ఆకర్షణలు.

67
5. అనంతగిరి కొండలు
Image Credit : gemini

5. అనంతగిరి కొండలు

అనంతగిరి కొండలు నగరానికి కొంత దూరంలో ఉన్నప్పటికీ వేసవిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటి. ఎత్తైన ప్రదేశం కావడంతో ఇక్కడ ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. అడవి మార్గాల్లో ట్రెక్కింగ్ చేసే అవకాశం కూడా ఉంది.

77
వేసవిలో కుటుంబంతో సందర్శించే మరిన్ని ప్రాంతాలు..
Image Credit : Asianet News

వేసవిలో కుటుంబంతో సందర్శించే మరిన్ని ప్రాంతాలు..

వేసవిలో కుటుంబంతో కలిసి వెళ్లే ప్రదేశాలు కూడా హైదరాబాద్‌లో బాగానే ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియోగా గుర్తింపు పొందింది. ఇక్కడ సినిమాల షూటింగ్ సెట్లు మాత్రమే కాకుండా వినోద కార్యక్రమాలు కూడా అందుబాటులో ఉంటాయి. రోజంతా గడిపేలా వివిధ థీమ్ పార్కులు, షోలు ఏర్పాటు చేశారు.

ఓషన్ పార్క్, వండర్లా వంటి వాటర్ పార్కులు వేసవిలో ఎక్కువగా సందర్శకులను ఆకర్షిస్తాయి. నీటిలో ఆటలు, స్లైడ్లు, స్విమ్మింగ్ పూల్స్ వేడిని తగ్గించడంలో సహాయపడతాయి. చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ అనుకూలమైన వినోదం ఇక్కడ లభిస్తుంది.

నెహ్రూ జూలాజికల్ పార్క్ కూడా కుటుంబాలతో వెళ్లేందుకు సరైన ప్రదేశం. వివిధ జంతువులను దగ్గరగా చూసే అవకాశం పిల్లలకు ప్రత్యేకంగా ఉంటుంది. అయితే వేడి ఎక్కువగా ఉండే సమయాలను తప్పించి ఉదయం వేళల్లో సందర్శించడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Jobs : తెలుగు యువతకు లక్కీ ఛాన్స్... 2,929 ఉద్యోగాల భర్తీ, అర్హతలుంటే ఓ ఉద్యోగం మీదే
Recommended image2
Now Playing
మా దగ్గర కూడా కండలు తిరిగినోళ్లు ఉన్నారు: Revanth Reddy warns Kaushik Reddy & BRS | Asianet Telugu
Recommended image3
హైదరాబాద్‌లో బ‌య‌ట‌ప‌డ్డ మ‌రో క‌ల్తీ దందా.. ఉస్మానియా బిస్కెట్స్ కావివి ప్రాణాలు తీసే విషం
Related Stories
Recommended image1
Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక
Recommended image2
Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved