MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Telangana
  • National Highway: తెలంగాణలో ఆ జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి.. కేంద్రం మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ !

National Highway: తెలంగాణలో ఆ జిల్లాల రూపురేఖలు మారబోతున్నాయి.. కేంద్రం మైండ్ బ్లోయింగ్ గిఫ్ట్ !

National Highway: తెలంగాణలో రోడ్ల నెట్‌వర్క్‌ సూపర్ స్పీడ్ అందుకోనుంది. రూ.7,597 కోట్ల బడ్జెట్‌తో 191 కిలోమీటర్ల మేర జాతీయ రహదారులను 4 లేన్లుగా మార్చేందుకు కేంద్ర కేబినెట్ ఓకే చెప్పింది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 05 2026, 02:53 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలంగాణకు సూపర్ బూస్ట్.. భారీ హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఓకే
Image Credit : Gemini

తెలంగాణకు సూపర్ బూస్ట్.. భారీ హైవే ప్రాజెక్టులకు కేంద్రం ఓకే

తెలంగాణలో రోడ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్‌కు భారీ బూస్ట్ లభించింది. రాష్ట్రంలో రవాణా వ్యవస్థను మరింత ఈజీగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు.

నేషనల్ హైవే-63 లోని ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల సెక్షన్‌తో పాటు, నేషనల్ హైవే-563 లోని జగిత్యాల-కరీంనగర్ సెక్షన్‌ను 4 లేన్లుగా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ రెండు ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.7,597.16 కోట్లు కావడం విశేషం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మూడు ప్యాకేజీలుగా 191 కిలోమీటర్ల రోడ్డు
Image Credit : stockPhoto

మూడు ప్యాకేజీలుగా 191 కిలోమీటర్ల రోడ్డు

ఈ మెగా రోడ్డు ప్రాజెక్టుల మొత్తం పొడవు 190.76 కిలోమీటర్లు. పనులను వేగంగా పూర్తి చేయడం కోసం మొత్తం మూడు ప్యాకేజీలుగా దీనిని విభజించారు. మొదటిది ఆర్మూర్-జగిత్యాల సెక్షన్ (63.6 కి.మీ), రెండోది జగిత్యాల-మంచిర్యాల సెక్షన్ (68.295 కి.మీ). ఈ రెండూ ఎన్‌హెచ్-63 కిందకు వస్తాయి.

వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ పద్ధతిలో డెవలప్ చేస్తారు. ఇక మూడో ప్యాకేజీ కింద ఎన్‌హెచ్-563 లోని జగిత్యాల-కరీంనగర్ మధ్య ఉన్న 58.866 కిలోమీటర్ల రోడ్డును బిల్డ్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (BOT-Toll) పద్ధతిలో నిర్మించనున్నారు.

Related Articles

Related image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Related image2
Plastic Water Bottle Ridges: వాటర్ బాటిళ్లపై ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? క్రేజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిక్ !
36
ట్రాఫిక్ కష్టాలకు ఇక బైబై
Image Credit : Gemini

ట్రాఫిక్ కష్టాలకు ఇక బైబై

ప్రస్తుతం ఈ రూట్లలో ప్రయాణించాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. జనాభా ఎక్కువగా ఉండటం, ఇరుకైన రోడ్ల వల్ల విపరీతమైన ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్మూర్-జగిత్యాల-మంచిర్యాల కారిడార్ పరిధిలోని అంకసాపూర్, కోరుట్ల, జగిత్యాల, ధర్మపురి, లక్సెట్టిపేట, మంచిర్యాల లాంటి ఏరియాల్లో ప్రయాణం నరకంగా మారింది.

అలాగే జగిత్యాల-కరీంనగర్ సెక్షన్‌లోని పొతారం, గంగాధర, కరీంనగర్ లాంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. ఈ 4 లేన్ హైవేల వల్ల ఈ నగరాలు, గ్రామాల చుట్టూ బైపాస్ రోడ్లు వస్తాయి. అంతేకాదు, ఇందులో ఓపెన్ టోలింగ్ సిస్టమ్ ఉంటుంది. దీనివల్ల గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్‌తో వెహికల్స్ దూసుకెళ్లొచ్చు. నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కరీంనగర్ జిల్లాల ప్రజల ప్రయాణ కష్టాలు ఇక తీరిపోనున్నాయి.

46
ఎకనామిక్ హబ్స్, టూరిజం స్పాట్స్‌కు కనెక్టివిటీ
Image Credit : stockPhoto

ఎకనామిక్ హబ్స్, టూరిజం స్పాట్స్‌కు కనెక్టివిటీ

ఈ అప్‌గ్రేడెడ్ రోడ్లు కేవలం ప్రయాణానికే కాదు, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు పెద్ద అసెట్ కానున్నాయి. ఇవి ఐదు ఎకనామిక్ నోడ్స్, ఏడు సోషల్ నోడ్స్, పది లాజిస్టిక్స్ నోడ్స్‌ను కలుపుతాయి. సిద్దిపేట, వరంగల్ అర్బన్‌లోని స్పెషల్ ఎకనామిక్ జోన్లు, నిజామాబాద్, సిద్దిపేటలోని మెగా ఫుడ్ పార్కులు, రాజన్న సిరిసిల్లలోని ఫిషింగ్ అండ్ సీఫుడ్ క్లస్టర్‌లకు ఈ రోడ్ల ద్వారా కనెక్టివిటీ పెరుగుతుంది.

వీటితో పాటు వేములవాడ, కొండగట్టు, నగునూరు కోట, ధర్మపురి, కాళేశ్వరం, లోయర్ మానేరు డ్యామ్, ఖిల్లా కోట లాంటి ఫేమస్ టూరిజం, ఆధ్యాత్మిక ప్రాంతాలకు వెళ్లడం ఈజీ అవుతుంది. నిజామాబాద్, జగిత్యాల, కోరుట్ల, పెద్దపల్లి, మంచిర్యాల, పొద్దూరు, గంగాధర, కరీంనగర్ రైల్వే స్టేషన్లకు కూడా కనెక్టివిటీ మెరుగుపడటంతో మల్టీమోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ సూపర్ సక్సెస్ అవుతుంది.

56
టైమ్ సేవ్.. ఫ్యూయల్ సేవ్.. భారీగా ఉద్యోగాలు
Image Credit : Gemini

టైమ్ సేవ్.. ఫ్యూయల్ సేవ్.. భారీగా ఉద్యోగాలు

ఈ ప్రాజెక్ట్ పూర్తయితే టైమ్ చాలా సేవ్ అవుతుంది. ఆఫీషియల్ లెక్కల ప్రకారం, ఆర్మూర్ నుంచి మంచిర్యాల వెళ్లే వారికి దాదాపు గంటన్నర టైమ్ కలిసి వస్తుంది. అలాగే జగిత్యాల నుంచి కరీంనగర్ జర్నీ టైమ్ 45 నిమిషాల వరకు తగ్గుతుంది. దీనివల్ల ఇంధనం ఆదా అవ్వడమే కాకుండా, కాలుష్యం తగ్గుతుంది. వెహికల్ మెయింటెనెన్స్ ఖర్చు కూడా తగ్గుతుంది.

ఈ ప్రాజెక్టులో గ్రీన్‌ఫీల్డ్ డెవలప్‌మెంట్ కూడా భారీగానే ఉంది. ఆర్మూర్-జగిత్యాలలో 45.65 కి.మీ, జగిత్యాల-మంచిర్యాలలో 66.10 కి.మీ, జగిత్యాల-కరీంనగర్‌లో 34.96 కి.మీ మేర కొత్తగా రోడ్లు వేస్తారు. ఈ నిర్మాణ పనుల వల్ల సుమారు 34.43 లక్షల డైరెక్ట్ మ్యాన్ డేస్, 42.7 లక్షల ఇన్‌డైరెక్ట్ మ్యాన్ డేస్ ఉపాధి లభిస్తుంది.

66
ఈ హైవేల విస్తరణ ఎందుకు అంత ముఖ్యం?
Image Credit : Asianet News

ఈ హైవేల విస్తరణ ఎందుకు అంత ముఖ్యం?

ఈ రూట్లలో ప్రయాణించే వాహనాల సంఖ్య ఏ రేంజ్‌లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు. 2024-25 నాటి యాన్యువల్ యావరేజ్ డైలీ ట్రాఫిక్ రికార్డుల ప్రకారం.. ఆర్మూర్-జగిత్యాల సెక్షన్‌లో రోజుకు 14,949 పిసియు (ప్యాసింజర్ కార్ యూనిట్స్), జగిత్యాల-మంచిర్యాల సెక్షన్‌లో 12,084 పిసియు, అలాగే జగిత్యాల-కరీంనగర్ రూట్‌లో ఏకంగా 20,446 పిసియు ట్రాఫిక్ నమోదైంది. ట్రాఫిక్ ఈ రేంజ్‌లో ఉంది కాబట్టే, ఈ రోడ్లను వెంటనే 4 లేన్లుగా మార్చడం అత్యంత అవసరంగా మారింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
అంబర్ పేట బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | CM Revanth Reddy Powerful Speech
Recommended image2
కేసీఆర్ కు రూ.12400000 కోట్లు ఇచ్చాం... ఇంకా ఇస్తున్నాం..: సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Recommended image3
School Holidays : ఈ వారంలో ఇంకా మూడ్రోజులే స్కూళ్లు, కాలేజీలు నడిచేది.. తర్వాత వరుస సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?
Related Stories
Recommended image1
IRCTC South India Tour: ఒక్క టికెట్‌తో రామేశ్వరం, అరుణాచలం సహా 7 పుణ్యక్షేత్రాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్
Recommended image2
Plastic Water Bottle Ridges: వాటర్ బాటిళ్లపై ఆ లైన్స్ ఎందుకు ఉంటాయో తెలుసా? క్రేజీ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ట్రిక్ !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved