MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు

Hyderabad లో బైక్ ఉంటే చాలు... నెలనెలా ఈజీగా రూ.60,000 సంపాదించవచ్చు

బైక్‌ను కేవలం వ్యక్తిగత రవాణాకే కాదు పెట్టుబడిగా కూడా వాడుకుని డబ్బులు సంపాదించచ్చు. సరైన ప్లానింగ్‌తో బైక్ మీకు మంచి ఆదాయ మార్గంగా మారుతుంది. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Arun Kumar P
Published : Mar 30 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
బైక్ తో భళే ఆదాయం..
Image Credit : stockPhoto

బైక్ తో భళే ఆదాయం..

ఈ జమానాలో బైక్ కేవలం ప్రయాణానికి మాత్రమే కాదు, అదొక పెట్టుబడి. మీ దగ్గర ఒక బైక్, చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు... మీరే బాస్‌గా మారి మంచి ఆదాయం సంపాదించవచ్చు. ఫుడ్ డెలివరీ, బైక్ ట్యాక్సీ, ఇ-కామర్స్ సర్వీసుల ద్వారా నెలకు రూ.40,000 నుంచి రూ.60,000 వరకు పొందవచ్చు.. కమిట్మెంట్ తో పనిచేసుకుంటూ ఇంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నవారు ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
ఫుడ్ డెలివరీ...
Image Credit : Getty

ఫుడ్ డెలివరీ...

ఇది చాలా పాపులర్, వెంటనే డబ్బు సంపాదించే మార్గం. Swiggy, Zomato, Zepto, Dunzo, Blinkit లాంటి కంపెనీలు 24 గంటలూ పనిచేస్తాయి. ప్రతి డెలివరీకి డబ్బుతో పాటు, వారం వారం ఇన్సెంటివ్‌లు కూడా ఇస్తాయి. మధ్యాహ్నం (12 PM - 3 PM), రాత్రి (7 PM - 11 PM) వేళల్లో పనిచేస్తే 'సర్జ్' ఫీజుతో అదనపు ఆదాయం వస్తుంది. వర్షాకాలం, పండగ రోజుల్లో బోనస్ రెట్టింపు అవుతుంది.

38
బైక్ ట్యాక్సీ
Image Credit : stockPhoto

బైక్ ట్యాక్సీ

నగరాల్లో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండటంతో, ప్రజలు కార్ల కన్నా బైక్‌లనే ఇష్టపడుతున్నారు. Rapido, Ola, Uber లాంటి యాప్స్ దీనికి బాగా ఉపయోగపడతాయి. ఫుడ్ డెలివరీలా హోటల్ దగ్గర వేచి చూడాల్సిన పనిలేదు. ఒకరిని ఎక్కించుకుని, మరోచోట దింపడం చాలా సులభం. పీక్ అవర్స్‌లో (ఆఫీస్ వేళలు), సాయంత్రం పూట ఎక్కువ బుకింగ్స్ వస్తాయి. రోజుకు 15-20 రైడ్లు చేస్తే మంచి లాభం చూడొచ్చు.

48
ఆన్లైన్ డెలివరీలతో అధిక ఆదాయం..
Image Credit : Getty

ఆన్లైన్ డెలివరీలతో అధిక ఆదాయం..

Amazon, Flipkart, Delhivery లాంటి కంపెనీలు రోజూ లక్షల కొద్దీ పార్శిళ్లను డెలివరీ చేస్తాయి. ఉదయాన్నే మీ ఏరియాకు సంబంధించిన పార్శిళ్లను తీసుకుని, ఆ రోజులోగా డెలివరీ చేయాలి. ఒకే ఏరియాలో పనిచేయడం వల్ల పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. ప్రతి పార్శిల్‌కు కొంత మొత్తం డబ్బు వస్తుంది.

58
మీరే సొంతంగా అవకాశాలు వెతుక్కొండి..
Image Credit : honda

మీరే సొంతంగా అవకాశాలు వెతుక్కొండి..

స్థానిక దుకాణాలు, మందుల షాపులు, చిన్న రెస్టారెంట్లతో మీరే నేరుగా ఒప్పందం చేసుకోవచ్చు. కొన్ని ఏరియాలోని ఫార్మసీ లేదా బట్టల షాపు వాళ్లు తమ కస్టమర్లకు హోమ్ డెలివరీ చేయడానికి బైక్ రైడర్ కోసం చూస్తుంటారు. మీరు 5 నుంచి 10 షాపులతో టై-అప్ అయితే, వాళ్లకు అవసరమైనప్పుడు పార్శిళ్లు డెలివరీ చేస్తూ నెలకు స్థిరమైన ఆదాయం పొందవచ్చు.

68
మీ బైక్ పై యాడ్స్..
Image Credit : Getty

మీ బైక్ పై యాడ్స్..

మీ బైక్ వెనుక లేదా పక్కన కంపెనీల యాడ్ బోర్డులు/బాక్సులు పెట్టుకోవడం ద్వారా పాసివ్ ఇన్‌కమ్ (Passive Income) సంపాదించవచ్చు. కొన్ని స్టార్టప్ కంపెనీలు తమ యాడ్స్‌ను జనసమ్మర్థం ఉన్న ప్రాంతాలకు తీసుకెళ్లడానికి బైక్ ఓనర్లకు డబ్బు ఇస్తాయి. మీరు రోజూలాగే బైక్ నడుపుతున్నా, ఈ యాడ్స్ ద్వారా నెలకు అదనంగా ₹2,000 - ₹5,000 వరకు వస్తాయి.

78
రోజును ఇలా డివైడ్ చేసుకొండి..
Image Credit : Getty

రోజును ఇలా డివైడ్ చేసుకొండి..

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ సమయాన్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు.

ఉదయం (7 AM - 11 AM): బైక్ ట్యాక్సీ లేదా పాలు/కిరాణా డెలివరీ (Zepto/Blinkit).

మధ్యాహ్నం (12 PM - 4 PM): ఇ-కామర్స్ పార్శిల్ డెలివరీ (Amazon/Flipkart).

రాత్రి (7 PM - 11 PM): ఫుడ్ డెలివరీ (Swiggy/Zomato).

88
గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు
Image Credit : BAJAJ

గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు

వాహన నిర్వహణ (Vehicle Maintenance): బైక్‌ను సరిగ్గా సర్వీసింగ్ చేయించడం ముఖ్యం. లేదంటే మెయింటెనెన్స్ ఖర్చులే మీ ఆదాయాన్ని తినేస్తాయి.

ఇన్సూరెన్స్ (Insurance): కమర్షియల్ అవసరాలకు కావాల్సిన ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి.

భద్రత (Safety): ఎప్పుడూ హెల్మెట్ పెట్టుకుని, నిదానంగా నడపడం మీ ప్రాణాలకే కాదు, మీ సంపాదనకు కూడా రక్షణ.

ఇంధన ఆదా (Fuel Efficiency): ఎలక్ట్రిక్ బైక్ (EV) ఉంటే పెట్రోల్ ఖర్చు ఆదా అవుతుంది. దీనివల్ల మీ లాభం 30% వరకు పెరుగుతుంది.

బైక్ కేవలం ఇనుప యంత్రం కాదు, కష్టపడేవారికి అదొక బంగారు గని. టైమ్ మేనేజ్‌మెంట్, పట్టుదల ఉంటే.. ఏ ఆఫీస్ ఉద్యోగం ఇవ్వలేని స్వేచ్ఛను, ఆదాయాన్ని మీ బైక్ మీకు అందిస్తుంది..!

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
పర్సనల్ పైనాన్స్
తెలంగాణ
విశాఖపట్నం
విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Recommended image2
Farmer ID: రైతులకు బిగ్ అలర్ట్.. పీఎం కిసాన్, రైతు భరోసా ఆగిపోవద్దంటే వెంటనే ఇలా చేయండి
Recommended image3
Heavy Rains Alert: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో వారం రోజులు వర్షాలే వర్షాలు
Related Stories
Recommended image1
Business Idea: తక్కువ పెట్టుబడితో లక్షల్లో సంపాదన.. ఈ టాప్ 3 బిజినెస్‌లు మీరూ చూడండి
Recommended image2
Business Ideas: ఐస్ క్యూబ్స్‌తో మీ ఇంట ఐశ్వ‌ర్యం.. ఈ వ్యాపారంతో మీ త‌ల‌రాత మారాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved