MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Summer Holidays : తెలుగు పిల్లలు ఎగిరిగంతేసే సమాచారం.. మరో 13 రోజులు వేసవి హాలిడేస్ పొడిగింపు

Summer Holidays : తెలుగు పిల్లలు ఎగిరిగంతేసే సమాచారం.. మరో 13 రోజులు వేసవి హాలిడేస్ పొడిగింపు

Summer Holidays Extended : జూన్ లోకి ఎంటర్ అయినా తెలుగు రాష్ట్రాల్లో ఎండలుమాత్రం తగ్గడంలేదు. దీంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నాయి ప్రభుత్వాలు. తెలంగాణలో ఎప్పటివరకు సెలవులు ఇచ్చారో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 05 2026, 01:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు
Image Credit : unsplash

తెలంగాణలో వేసవి సెలవులు పొడిగింపు

Summer Holidays : నైరుతి రుతుపవనాలు ఇండియాలోకి ఆలస్యంగా ఎంట్రీ ఇచ్చాయి... దీంతో వర్షాల రాక కూడా ఆలస్యం అవుతోంది. ఇప్పటికే కేరళను తాకిన రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో విస్తరించేందుకు మరింత సమయం పడుతుంది.. అందుకే ఇంకా వర్షాలు జోరందుకోలేవు... కాబట్టి ఎండలు కొనసాగుతున్నాయి. కొన్నిచోట్ల భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు... ఇంకా 40 డిగ్రీలకు పైగానే ఎండలు నమోదవుతున్నాయి. దీంతో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటివరకు..?
Image Credit : Getty

తెలంగాణలో వేసవి సెలవులు ఎప్పటివరకు..?

తెలంగాణలోని అంగన్వాడీ సెంటర్లకు మే 1 నుండి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. సరిగ్గా నెలరోజుల పాటు ఈ సెలవులు కొనసాగాయి... జూన్ 2 నుండి రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ సెంటర్లు పున:ప్రారంభం కావాలి. అయితే మండుటెండలు కొనసాగుతుండటంతో చిన్నారులను పంపించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందుకే మరికొన్నిరోజులు సెలవులు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

చిన్నారుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీలకు కూడా జూన్ 12 వరకు వేసవి సెలవులు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఆదేశాల మేరకు అధికారులు సెలవుల పొడిగింపుపై ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో అంగన్వాడీలకు అదనంగా మరో 13 రోజుల సమ్మర్ హాలిడేస్ వచ్చాయి.

Related Articles

Related image1
Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?
Related image2
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
34
జూన్ 14 వరకు సెలవులే... జూన్ 15న రీఓపెన్
Image Credit : Getty

జూన్ 14 వరకు సెలవులే... జూన్ 15న రీఓపెన్

జూన్ 12 వరకు అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇచ్చారు... వీటికి మరో రెండ్రోజుల సాధారణ హాలిడేస్ కలిసిరానున్నాయి. జూన్ 13న రెండో శనివారం కాబట్టి సెలవు ఉంటుంది. ఇక జూన్ 14న ఆదివారం సెలవే. ఈ రెండ్రోజులు కూడా వేసవి సెలవులతో కలిసిరానున్నాయి... కాబట్టి ఇక అంగన్వాడీలు తెరుచుకునేది జూన్ 15నే. అంటే ఈ నెలలో సగంరోజులు సమ్మర్ హాలిడేసే... మిగతా సగంరోజులే అంగన్వాడీలు నడిచేది.

44
సమ్మర్ హాలిడేస్ ముగిశాక కూడా స్కూళ్లకు సెలవులు..?
Image Credit : getty

సమ్మర్ హాలిడేస్ ముగిశాక కూడా స్కూళ్లకు సెలవులు..?

తెలంగాణలో ఏప్రిల్ 24 నుండి సమ్మర్ హాలిడేస్ మొదలయ్యాయి... జూన్ 11 వరకు కొనసాగనున్నాయి. జూన్ 12న రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ విద్యాసంస్థలన్నీ తెరుచుకుంటాయి. అయితే ఇలా స్కూళ్లు ప్రారంభం అవుతాయో లేదో అలా మళ్లీ సెలవులు వస్తున్నాయి.

జూన్ 12న ఒక్కరోజు స్కూళ్లు నడుస్తాయో లేదో జూన్ 13 రెండో శనివారం, జూన్ 14 ఆదివారం రెండ్రోజులు సెలవులే. ఇక జూన్ 26న మొహర్రం పండగ నేపథ్యంలో మరో సెలవు ఉంది. వీటితో పాటు జూన్ 21, 28 ఆదివారం సెలవులున్నాయి. మొత్తంగా వేసవి సెలవులు కాకుండా జూన్ లో మరో ఐదురోజుల స్కూళ్లకు సెలవులు వస్తున్నాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారతదేశంలో ప్రభుత్వ సెలవులు
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert: వచ్చే 3 రోజులు ఆ జిల్లాల వాళ్ళు అస్సలు బయటకు రావొద్దు.. భారీ వర్షాలు !
Recommended image2
Now Playing
Ameerpet Fire: అమీర్‌పేటలో అగ్ని ప్రమాదంఅసలు కారణాలు ఇవే వెల్లడించిన అధికారులు| Asianet News Telugu
Recommended image3
Now Playing
పాతబస్తీలో కేటీఆర్ సందడి..Osmania Biscuits in Old City Hyd | KTR Charminar Visit | Asianet Telugu
Related Stories
Recommended image1
Summer Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే న్యూస్.. ఎక్స్ట్రాగా మరో వారం వేసవి సెలవులు, ఎప్పటినుండి ఎప్పటివరకు?
Recommended image2
School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. ఇలా స్కూళ్లు రీఓపెన్ కాగానే అలా సెలవులు.. ఎన్నిరోజులో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved