MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Heavy Rains : సాయంత్రం ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్, ఇక అల్లకల్లోలమే..!

Heavy Rains : సాయంత్రం ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు... రెడ్ అలర్ట్, ఇక అల్లకల్లోలమే..!

Heavy Rains in Telugu States : తెలుగు ప్రజలకు భారత వాతావరణ విభాగం (IMD) చల్లని కబురు చెప్పింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఏఏ జిల్లాల్లో అత్యధిక వర్షాలు కురుస్తాయో తెలుసా..?

2 Min read
Author : Arun Kumar P
Published : Jun 05 2026, 03:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..
Image Credit : Gemini AI

ఇక తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే వర్షాలు..

IMD Rain Alert : ఇండియాలోకి నైరుతి రుతుపవనాలు ఎంటరయ్యాయి... అంటే వర్షాకాలం మొదలైనట్లే. కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు మెళ్లిగా తెలుగు రాష్ట్రాలకు చేరువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎండలతీవ్రత తగ్గి వర్షాలు మొదలవుతున్నాయి. గత నాలుగైదు రోజులుగా చెదురుమదురు జల్లులు కురుస్తున్నా ఇవాళ (జూన్ 5, శుక్రవారం) భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..
Image Credit : Gemini AI

ఈ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు..

వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ అంచనా ప్రకారం... మరికొద్దిసేపట్లో రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు మొదలవుతాయి. ముఖ్యంగా యాదాద్రి భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి , మహబూబ్ నగర్ జిల్లాల్లో అక్కడక్కడ రాబోయే రెండుమూడు గంటల్లో కుండపోత వర్షం కురుస్తుందని హెచ్చరించారు. ఇక సూర్యాపేట, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట, జనగాం జిల్లాల్లోనూ జోరువానలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. ఈ జిల్లాల్లో ఏకంగా 80 మిల్లిమీటర్ల వరకు వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయట.

ఇక నిర్మల్, ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, రంగారెడ్డి జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవశాలున్నాయని హెచ్చరించారు. వర్షాల తీవ్రత తక్కువగా ఉన్న ఉరుములు మెరుపులు, పిడుగులు, ఈదురుగాలులతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

34
హైదరాబాద్ లో వర్షం పడుతుందా...?
Image Credit : Gemini AI

హైదరాబాద్ లో వర్షం పడుతుందా...?

పశ్చిమ, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరించారు. హైదరాబాద్ లో ఇప్పటికయితే వర్ష సూచనలేమీ లేవు... సాయంత్రం కొన్నిచోట్లు చిరుజల్లులు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. మొత్తంగా చూసుకుంటే నగరంలో పొడి వాతావరణమే కొనసాగుతుందని... వర్షాలకు పెద్దగా అవకాశం లేదని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

44
ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు..
Image Credit : Gemini AI

ఈ ఏపీ జిల్లాల్లో వర్షాలు..

రుతుపవనాలకు ఉపరితల ఆవర్తనం కూడా తోడయ్యింది... దీంతో ఆంధ్ర ప్రదేశ్ లో జోరువానలు ఉంటాయని ఐపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శుక్రవారం (05-06-2026): పోలవరం, కాకినాడ, తూర్పు గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడవచ్చని ప్రకటించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
IMD Monsoon Rain Alert: కేరళను తాకిన రుతుపవనాలు.. ఏపీ, తెలంగాణలకు ఐఎండీ అలర్ట్.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు
Recommended image2
IMD Rain Alert: రుతుపవనాల ఎంట్రీపై ఐఎండీ అలర్ట్.. వచ్చే 4 రోజులు ఈ ప్రాాంతాాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved