MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Business
  • Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక

Flats in Hyderabad: హైదరాబాద్‌లో ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్ కొనేయకండి, మునిగిపోతారు.. హైడ్రా హెచ్చరిక

Flats in Hyderabad: హైదరాబాద్ లో ఇల్లు కొనాలని ఎంతోమంది కోరుకుంటారు. ముఖ్యంగా ఫ్లాట్లు అధికంగా అక్కడ అమ్ముడవుతాయి. అయితే ఎక్కడపడితే అక్కడ ఫ్లాట్లు కొంటే అన్ని రకాలుగా నష్టపోతారని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 27 2026, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
హైదరాబాద్ లో సొంత ఫ్లాట్
Image Credit : gemini

హైదరాబాద్ లో సొంత ఫ్లాట్

ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కి చేరుకున్న ఎంతోమంది అక్కడ సొంత ఇల్లు కొనాలని కలలు కంటారు. రూపాయి రూపాయి దాచుకొని కష్టపడి జమ చేసిన డబ్బులతో ఫ్లాట్ కొంటారు. కానీ దానికి సరైన అనుమతులు ఉన్నాయా? ఎలాంటి స్థలంలో కట్టారు? వంటి వాటిని చెక్ చేసుకోరు. దీనివల్ల ఎంతో మంది వినియోగదారులు నిండా మునిగిపోతున్నారని హైడ్రా అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్ లో ఇల్లు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారికి హైడ్రా అధికారులు కొన్ని కీలకమైన సూచనలు కూడా చేశారు. మంచి ఆఫర్లు, తక్కువ ధరలు అని చెబితే వెంటనే లొంగిపోవద్దని ఆ ప్రకటనలు నమ్మి ఇల్లు కొనడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఇలాంటి చోట్ల కొనవద్దు
Image Credit : Getty

ఇలాంటి చోట్ల కొనవద్దు

హైడ్రా అధికారులు చెబుతున్న ప్రకారం ఫ్లాటు లేదా ఇల్లు కొనే ముందు దానికి సంబంధించిన పత్రాలను పూర్తిగా సరిచూసుకోవాలి. ఆ భూమికి సంబంధించిన పాస్ బుక్, రిజిస్ట్రేషన్ పేపర్లు, అనుమతులు అన్నీ క్లియర్ గా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఒక్కసారి ఇంటిపై డబ్బులు పెట్టాక మళ్ళీ తిరిగి రావడం చాలా కష్టం. అందుకే ఎలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోవద్దని చెబుతున్నారు. ముఖ్యంగా చెరువులు, కుంటలు, నీటి వనరులు దగ్గర ఉన్న ఫ్లాట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. మంచి స్థలంలాగా బయటికి కనిపిస్తున్నా అది ఫుల్ ట్యాంక్ లెవెల్ (FTL) పరిధిలో ఉండే అవకాశం ఉంటుందని అలాంటి చోట్ల ఇల్లు కట్టుకుంటే వర్షాకాలంలో నీరు నిలిచిపోయి వరదలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం అలాంటి స్థలాలను అక్రమంగా ఆక్రమించినవని ప్రకటిస్తే ఇంటిని కూడా కోల్పోవాల్సి వస్తుందని చెబుతున్నారు.

Related Articles

Related image1
Monthly interest: నెలకి 50 వేల రూపాయలు వడ్డీగా కావాలనుకుంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి?
Related image2
Viral news: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సర్.. ఇంటర్ ఆన్సర్ షీట్లో విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు
33
ఇవి చెక్ చేయండి
Image Credit : Getty

ఇవి చెక్ చేయండి

చాలామంది ఇప్పుడు లేఅవుట్ అనుమతి ఉందని చెప్పి, మోసం చేసి డబ్బులు తీసుకొని ఫ్లాట్లు అమ్మేస్తున్నారని అలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని వివరించారు. కొనుగోలు చేసే ముందు రెవెన్యూ ఆఫీసు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో వివరాలు చెక్ చేసుకోవాలని.. అలాగే హెచ్ఎండి లేదా సంబంధిత అధికారుల అనుమతి ఉందో లేదో కూడా తెలుసుకోవాలని వివరిస్తున్నారు. ఒకసారి లాయర్ ను కలిసి పేపర్లన్నీ చూపించి అది మంచి ప్రాపర్టీనో కాదో నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని హెచ్చరిస్తున్నారు. తమకు చాలా ఫిర్యాదులు వస్తున్నాయని, చెరువులు ఆక్రమించి, పార్కుల స్థలాల్లో అక్రమ నిర్మాణాలను కట్టి ఫ్లాట్లుగా చేసి అమ్మేస్తున్నారని చెప్పారు. కాబట్టి ఇల్లు కొనాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే నిండా మునిగి పోవాల్సి వస్తుందని తెలిపారు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్
హైదరాబాద్
స్థిరాస్తి

Latest Videos
Recommended Stories
Recommended image1
Business Idea : అరటి పండు, ఆకులతోనే కాదు... అరటి కాండంతోనూ సూపర్ బిజినెస్, లక్షల లాభం
Recommended image2
Credit Card: ఏం వాడ‌కం సామీ ఇది.. క్రెడిట్ కార్డును ఎంత‌లా వాడేస్తున్నారో తెలుసా.?
Recommended image3
UPI: రూ.100 యూపీఐ పేమెంట్‌ వెనుక అయ్యే ఖర్చు ఎంత? భారతదేశ డిజిటల్ సైలెంట్ హీరో సీక్రెట్స్ ఇవే
Related Stories
Recommended image1
Monthly interest: నెలకి 50 వేల రూపాయలు వడ్డీగా కావాలనుకుంటే బ్యాంకులో ఎంత డిపాజిట్ చేయాలి?
Recommended image2
Viral news: కాళ్లు మొక్కుతా పాస్ చేయండి సర్.. ఇంటర్ ఆన్సర్ షీట్లో విద్యార్థి ఫన్నీ రాతలు, బొమ్మలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved