MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • Rain Alert : హైదరబాదీలూ... ఈ సాయంత్రం జాగ్రత్త సుమా..! డేంజర్ వెదర్ అప్డేట్

Rain Alert : హైదరబాదీలూ... ఈ సాయంత్రం జాగ్రత్త సుమా..! డేంజర్ వెదర్ అప్డేట్

Hyderabad Rains : సాధారణంగా వేసవిలో కురిసే వర్షాలు చాలా ప్రమాదకరం. వర్షపాతం తక్కువే అయినా ఈదురుగాలులు, పిడుగులు ప్రమాదాలకు కారణం అవుతాయి. హైదరాబాద్ కు ఈ సాయంత్రం ఇలాంటి ప్రమాదమే పొంచివుందట… కాబట్టి నగరవాసులు జాగ్రత్తగా ఉండాలి.

2 Min read
Author : Arun Kumar P
| Updated : Mar 16 2026, 02:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలు
Image Credit : Gemini AI

తెలుగు రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలు

Weather Update : మండువేసవిలో తెలుగు రాష్ట్రాలను వర్షాలు పలకరిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణలో వర్షాలు మొదలయ్యాయి... నిన్న (ఆదివారం, మార్చి 15న) కొన్నిచోట్ల చిరుజల్లులు కురిశాయి. ఇవాళ ఈ వర్షాలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశాలున్నాయని వాతావరణ నిపుణులు తెలంగాణ వెదర్ మ్యాన్ హెచ్చరించారు. ప్రస్తుతం ఎండ కొనసాగుతున్నా సాయంత్రం ఆకాశాన్ని మేఘాలు కమ్మేసి వర్షాలు మొదలవుతాయని తెలిపారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
హైదరాబాద్ లో వర్షాలే వర్షాలు
Image Credit : Getty

హైదరాబాద్ లో వర్షాలే వర్షాలు

హైదరాబాద్ లో సాయంత్రం 4 గంటల తర్వాత వర్షం మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. కొన్నిచోట్ల చిరుజల్లులే కురిసినా ఈదురుగాలులు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. ఇక ఎండాకాలం వానల సమయంలో పిడుగుల ప్రమాదం కూడా ఎక్కువే. సాయంత్రం నుండి రాత్రి వరకు నగరంలో వర్షం కురిసే అవకాశాలున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెదర్ మ్యాన్ సూచించారు.

36
శివారు ప్రాంతాల్లోనూ వానలు
Image Credit : Gemini AI

శివారు ప్రాంతాల్లోనూ వానలు

కేవలం హైదరాబాద్ లో మాత్రమే కాదు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల్లోని శివారు ప్రాంతాలనూ వర్షాలు ముంచెత్తనున్నాయి. గంటకు 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెదర్ మ్యాన్ హెచ్చరిస్తున్నారు. కొన్నిచోట్ల వడగళ్ల వానలు కురిసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఈ ఈదురుగాలులు, వడగళ్ళ వానలు అన్నదాతలను మరీముఖ్యంగా మామిడి రైతులను నిండా ముంచేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చిన్నచిన్న పిందెల రూపంలోని మామిడిపంట ఈదురుగాలులు, వడగళ్ల వానలకు నేలరాలుతుంది, నాణ్యత కూడా దెబ్బతింటుంది.

46
ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు
Image Credit : X/APSDMA

ఈ తెలంగాణ జిల్లాల్లో వర్షాలు

ప్రస్తుతం కొనసాగుతున్న ద్రోణి... తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి వీస్తున్న తేమగాలుల వల్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ సాయంత్రం నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, సిరిసిల్ల, జనగాం, యాదాద్రి భువనగిరి, ములుగు, భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. కరీంనగర్, హన్మకొండ, వరంగల్, పెద్దపల్లి లో కూడా ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు కురుసే అవకాశాలున్నాయట. ఇవాళ మధ్యాహ్నం లేదా సాయంత్రం మొదలయ్యే వర్షాలు రాత్రి కూడా కొనసాగుతాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు.

UNSEASONAL RAINS ALERT - MARCH 16 ⚠️

Today, scattered INTENSE THUNDERSTORMS ahead in Nizamabad, Kamareddy, Medak, Sangareddy , Vikarabad, Siddipet, Sircilla, Jangaon, Yadadri - Bhongir, Rangareddy, Mulugu, Bhupalapally, Mancherial, Asifabad, Bhadradri - Kothagudem during…

— Telangana Weatherman (@balaji25_t) March 16, 2026

56
తెలంగాణ బార్డర్ లో వర్షాలు
Image Credit : Getty

తెలంగాణ బార్డర్ లో వర్షాలు

తెలంగాణ-కర్ణాటక బార్డర్ ప్రాంతాలైన జహిరాబాద్, నారాయణఖేడ్, బీదర్ ప్రాంతాల్లో నిన్న(ఆదివారం) వర్షం కురిసింది. సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ ప్రాంతాల్లోనూ చిరుజల్లులు కురిశాయి. భారీ ఉరుములు, ఈదురుగాలులతో వానలు పడ్డాయి. మెదక్, సింగూర్, కంకోల్, అల్లాదుర్గ్, పోచారం, బాన్సువాడ ప్రాంతాల్లోనూ వర్షాలు పడ్డాయి. ఇలా ఆదివారం అనేక ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి... ఇవాళ (సోమవారం) కూడా కొనసాగే అవకాశాలున్నాయని హెచ్చరించారు. ఈ వారమంతా ఎండల తీవ్రత తక్కువగా ఉండి చెదురుమదురు జల్లులు కురుస్తాయని... వాతావరణం చల్లగా ఉంటుందని తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు.

66
ఏపీలోనూ వర్షాలే వర్షాలు...
Image Credit : Asianet News

ఏపీలోనూ వర్షాలే వర్షాలు...

ఇక ఆంధ్ర ప్రదేశ్ లో ఈ మూడ్రోజులు ఓవైపు ఎండలు కొనసాగుతాయని... మరోవైపు ఆకాశం మేఘావృతమై కొన్నిచోట్ల వానలు కూడా పడతాయని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) ప్రకటించింది. ద్రోణితో పాటు నైరుతి దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో ఈ విభిన్న వాతావరణం ఏర్పడిందని తెలిపింది. ఇవాళ (సోమవారం) శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA హెచ్చరించింది. అలాగే అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని విపత్తు సంస్థ వెల్లడించింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విశాఖపట్నం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
Rain Alert: బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి... ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, అల్ల‌క‌ల్లోలం ఖాయం
Recommended image2
Rain Alert : ద్రోణితో జతకట్టిన నైరుతి గాలులు.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved