MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Common Pass: ఈ ఒక్క పాస్‌ ఉంటే చాలు.. బస్సు, మెట్రోల్లో రోజంతా తిరగొచ్చు!

Common Pass: ఈ ఒక్క పాస్‌ ఉంటే చాలు.. బస్సు, మెట్రోల్లో రోజంతా తిరగొచ్చు!

Common Pass: హైదరాబాద్‌ వాసులకు గుడ్ న్యూస్. నగరంలో ఆర్టీసీ బస్సు, మెట్రో రైళ్లకు కామన్ పాస్ అందుబాటులోకి వచ్చింది. ఈ కామన్ పాస్ ధరలు, మీ టికెట్ యాప్ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 02 2026, 11:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఒక్క పాస్‌తోనే ఆర్టీసీ బస్సు, మెట్రో ప్రయాణం
Image Credit : Chatgpt

హైదరాబాద్‌ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఒక్క పాస్‌తోనే ఆర్టీసీ బస్సు, మెట్రో ప్రయాణం

హైదరాబాద్ మహా నగరంలో ప్రతిరోజూ లక్షలాది మంది తమ ఉద్యోగాలు, వ్యాపారాల నిమిత్తం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రాకపోకలు సాగిస్తుంటారు. సిటీలో ప్రతిరోజూ ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 25 లక్షల మంది, మెట్రో రైళ్లలో సుమారు 4.50 లక్షల మంది ప్రయాణిస్తుంటారు.

అయితే, ఇప్పటివరకు బస్సుకు ఒక టికెట్, మెట్రోకు మరొక టికెట్ లేదా పాస్ తీసుకోవాల్సి రావడంతో సమయం వృథా అవ్వడమే కాకుండా ప్రయాణికులపై ఆర్థిక భారం కూడా పడేది. ఈ సమస్యకు చెక్ పెడుతూ తెలంగాణ ప్రభుత్వం, టీజీఎస్‌ఆర్టీసీ, హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థలు కలిసి సంయుక్తంగా ఒకే కామన్ పాస్ విధానాన్ని రంగంలోకి దించాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గాంధీ జయంతి కానుకగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం
Image Credit : X/@ram_views

గాంధీ జయంతి కానుకగా డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రారంభం

అక్టోబర్ 02 గాంధీ జయంతిని పురస్కరించుకుని బేగంపేట్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ సరికొత్త ‘ఆర్టీసీ - మెట్రో కామన్ పాస్’ సేవలను, అలాగే ‘మీ టికెట్’ మొబైల్ యాప్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు వివేక్ వెంకటస్వామి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ కోర్ అర్బన్ రీజియన్ (కూర్) పరిధిలో సమగ్ర ప్రజా రవాణాను ప్రోత్సహించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.

35
కామన్ పాస్ ధరల లెక్కలు ఇవే
Image Credit : Gemini AI

కామన్ పాస్ ధరల లెక్కలు ఇవే

ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అధికారులు రోజువారీ, నెలవారీ కామన్ పాస్‌లను ఖరారు చేశారు.

• రోజువారీ పాస్: మొత్తం ధర రూ. 400 (దీనిలో మెట్రో వాటా రూ. 300, ఆర్టీసీ వాటా రూ. 100)

• నెలవారీ పాస్: మొత్తం ధర రూ. 8,500 (దీనిలో మెట్రో వాటా రూ. 7,000, ఆర్టీసీ వాటా రూ. 1,500)

ఈ పాస్ పొందడానికి మొదటిసారి కార్డు కొనుగోలు చేసినప్పుడు రూ. 100 సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ భవిష్యత్తులో కార్డును తిరిగి ఇచ్చేస్తే ఆ రూ. 100 వాపస్ ఇస్తారు. ఈ కామన్ కార్డులు అన్ని ప్రధాన మెట్రో స్టేషన్లలోనూ, బస్ టెర్మినల్స్‌లోనూ లభిస్తాయి.

45
ఔటర్ రింగ్ రోడ్ లోపల అపరిమిత ప్రయాణం
Image Credit : Asianet News

ఔటర్ రింగ్ రోడ్ లోపల అపరిమిత ప్రయాణం

ఈ కామన్ పాస్‌తో ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల నడిచే ఆర్డినరీ, మెట్రో లగ్జరీ, ఎలక్ట్రిక్, ఏసీ సహా అన్ని రకాల ఆర్టీసీ సిటీ బస్సుల్లో (పుష్పక్ ఏసీ బస్సులు మినహా) ఉచితంగా ప్రయాణించవచ్చు. దీనితో పాటు మెట్రోలోని మూడు కారిడార్లలోనూ అపరిమితంగా తిరగొచ్చు. నగర శివారు ప్రాంతాల నుంచి ప్రతిరోజూ హైదరాబాద్ సెంట్రల్ ప్రాంతాలకు వచ్చిపోయే ఉద్యోగులకు, విద్యార్థులకు ఈ విధానం వల్ల సమయం బాగా ఆదా అవుతుంది. టికెట్ కౌంటర్ల వద్ద గంటల తరబడి క్యూలో నిలబడే తిప్పలు పూర్తిస్థాయిలో తప్పుతాయి.

55
'మీ టికెట్' యాప్‌తో డిజిటల్ విప్లవం
Image Credit : Mee Ticket APP

'మీ టికెట్' యాప్‌తో డిజిటల్ విప్లవం

ప్రజా రవాణాలో పేపర్‌లెస్ విధానాన్ని తీసుకురావడానికి ఆర్టీసీ ప్రత్యేకంగా ‘మీ టికెట్’ (Mee Ticket) అనే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా ప్రయాణికులు ఎక్కే స్టాప్, దిగే స్టాప్ ఎంచుకుని ఆన్‌లైన్‌లో చెల్లింపు చేయవచ్చు. పేమెంట్ పూర్తి కాగానే యాప్‌లో డైనమిక్ క్యూఆర్ కోడ్ వస్తుంది. బస్సులో కండక్టర్‌కు ఆ డిజిటల్ క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. చిల్లర సమస్యలు, కాగితపు టికెట్ల గోల ఇక ఉండదు.

అంతేకాకుండా, ఈ యాప్‌లోనే రూ. 600లకే డిజిటల్ వీక్లీ బస్ పాస్ సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. బస్ పాస్ కౌంటర్లకు వెళ్లకుండానే నేరుగా ఫోన్ నుంచే రూ. 600 చెల్లించి పాస్ పొంది, వారం రోజుల పాటు సిటీ బస్సుల్లో అపరిమితంగా ప్రయాణించవచ్చు. గడువు ముగిశాక యాప్‌లోనే అప్పటికప్పుడు రెన్యూవల్ కూడా చేసుకోవచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
తెలంగాణ
హైదరాబాద్
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
డ‌బ్బులుంటే ఇప్పుడే కొనేయండి.. త్వ‌ర‌లోనే ఈ ప్రాంతం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం
Recommended image2
KTR : తొమ్మిదో తరగతి ఫెయిలైన రేవంత్ బ్రదర్ ఏరోస్పేస్ ఇంజనీరా..! : కేటీఆర్
Recommended image3
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Related Stories
Recommended image1
Indian ODI Double Centuries: వన్డేల్లో 8 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు
Recommended image2
Beer vs Wine: బీరు vs వైన్.. తేడాలు ఏంటి? ఈ రెండింటిలో బాడీకి ఏది మంచిది? అసలు మేటర్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved