MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Indian ODI Double Centuries: వన్డేల్లో 8 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు

Indian ODI Double Centuries: వన్డేల్లో 8 డబుల్ సెంచరీలు కొట్టిన భారత ప్లేయర్లు

Indian ODI Double Centuries: వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీలు బాదిన ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ లిస్టులో ఐదుగురు భారత క్రికెటర్లు ఉన్నారు. ఈ ఐదుగురు ఏకంగా 8 డబుల్ సెంచరీలతో రికార్డుల మోత మోగించారు. ఆ ప్లేయర్ల పూర్తి వివరాలు మీకోసం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 01 2026, 07:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సచిన్ నుంచి గిల్ వరకు: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు వీరే
Image Credit : Chatgpt

సచిన్ నుంచి గిల్ వరకు: వన్డేల్లో డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్లు వీరే

వన్డే అంతర్జాతీయ క్రికెట్ (ODI) లో భారత బ్యాటర్ల హవా కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు పురుషుల వన్డే క్రికెట్‌లో మొత్తం ఐదుగురు భారత బ్యాటర్లు కలిపి 8 డబుల్ సెంచరీలు నమోదు చేశారు. వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ బాదిన దేశంగా చరిత్ర సృష్టించిన భారత్, ఆ తర్వాత బ్యాటింగ్ మైలురాళ్లలో సరికొత్త రికార్డులు సాధిస్తూనే ఉంది. ప్రపంచ క్రికెట్‌లో ఎవరికీ సాధ్యంకాని రీతిలో మన బ్యాటర్లు భారీ స్కోర్లతో రికార్డుల వేట సాగిస్తున్నారు.

వన్డే ఫార్మాట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ నిలవగా, అతనికి తోడుగా శుభ్‌మన్ గిల్ కూడా ఒకటి కంటే ఎక్కువ డబుల్ సెంచరీలు చేసిన రెండో బ్యాటర్‌గా ఘనత సాధించాడు. ఇప్పటివరకు డబుల్ సెంచరీలు బాదిన భారత ప్లేయర్ల వివరాలు గమనిస్తే..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
డబుల్ సెంచరీల రికార్డును ప్రారంభించిన సచిన్ టెండూల్కర్
Image Credit : Getty

డబుల్ సెంచరీల రికార్డును ప్రారంభించిన సచిన్ టెండూల్కర్

వన్డే క్రికెట్ చరిత్రలోనే మొదటి డబుల్ సెంచరీ నమోదు చేసిన క్రికెటర్‌గా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించారు. 2010 ఫిబ్రవరి 24న గ్వాలియర్ లో సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ ఈ ఘనత సాధించారు.

ఈ మ్యాచ్‌లో సచిన్ కేవలం 147 బంతుల్లో 200 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. 200 పరుగుల మార్కును 147 బంతుల్లోనే చేరుకుని వన్డేల్లో డబుల్ సెంచరీ చేయడం సాధ్యమేనని ప్రపంచానికి నిరూపించారు. ఈ ఇన్నింగ్స్ క్రికెట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచిపోయింది.

36
సచిన్ రికార్డును బద్దలు కొట్టిన వీరేందర్ సెహ్వాగ్
Image Credit : Getty

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన వీరేందర్ సెహ్వాగ్

సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డును భారత డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ బద్దలు కొట్టారు. 2011 డిసెంబర్ 8న ఇండోర్ లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సెహ్వాగ్ విరుచుకుపడ్డారు.

కేవలం 140 బంతుల్లోనే 219 పరుగులు చేసి, అప్పటికి వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించారు. సెహ్వాగ్ తన 200 పరుగుల మార్కును 140 బంతుల్లోనే అందుకున్నారు. తనదైన మార్క్ అటాకింగ్ గేమ్‌తో విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు.

46
రోహిత్ శర్మ హిట్‌మ్యాన్ షో: ఏకంగా 3 డబుల్ సెంచరీలు
Image Credit : ANI

రోహిత్ శర్మ హిట్‌మ్యాన్ షో: ఏకంగా 3 డబుల్ సెంచరీలు

వన్డే క్రికెట్‌లో మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ప్రపంచ క్రికెటర్ మన రోహిత్ శర్మ మాత్రమే. హిట్‌మ్యాన్‌గా పేరుగాంచిన రోహిత్ శర్మ వన్డేల్లో తన రికార్డులతో సరికొత్త చరిత్ర సృష్టించాడు.

ఆస్ట్రేలియాపై 209: 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 209 పరుగులు చేశారు. ఇందులో 200 పరుగులను 156 బంతుల్లో చేరుకున్నారు.

శ్రీలంకపై 264: 2014 నవంబర్ 13న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో శ్రీలంకపై 173 బంతుల్లో 264 పరుగులు బాదారు. 151 బంతుల్లోనే 200 పూర్తి చేసుకున్న రోహిత్, వన్డే చరిత్రలోనే అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఈ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది.

శ్రీలంకపై 208: 2017 డిసెంబర్ 13న మొహాలీలో శ్రీలంకపైనే మరోసారి విరుచుకుపడి 153 బంతుల్లో 208 పరుగులు (నాటౌట్) చేశారు. ఇందులో 200 పరుగుల మార్కును 151 బంతుల్లో అందుకున్నారు.

56
యువ తుపాను ఇషాన్ కిషన్ రికార్డు
Image Credit : X/BCCI

యువ తుపాను ఇషాన్ కిషన్ రికార్డు

భారత యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా వన్డే డబుల్ సెంచరీల క్లబ్‌లో చేరాడు. 2022 డిసెంబర్ 10న బంగ్లాదేశ్‌లోని ఛట్టోగ్రామ్ లో జరిగిన మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.

ఇషాన్ కిషన్ కేవలం 131 బంతుల్లో 210 పరుగులు చేశాడు. అతి తక్కువ సమయంలో అంటే కేవలం 126 బంతుల్లోనే 200 పరుగుల మైలురాయిని చేరుకుని, ఆ సమయంలో అత్యంత వేగంగా డబుల్ సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ ప్లేయర్‌గా నిలిచాడు.

66
చరిత్ర తిరగరాసిన శుభ్‌‌మన్ గిల్: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ
Image Credit : X@BCCI

చరిత్ర తిరగరాసిన శుభ్‌‌మన్ గిల్: ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ

భారత ప్రిన్స్ శుభ్‌మన్ గిల్ వన్డేల్లో రెండు డబుల్ సెంచరీలు సాధించి రోహిత్ శర్మ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో భారత బ్యాటర్‌గా నిలిచాడు. గిల్ తన అద్భుత ఫామ్‌తో సరికొత్త మైలురాళ్లను అందుకున్నాడు.

న్యూజిలాండ్‌పై 208: 2023 జనవరి 18న హైదరాబాద్ లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 149 బంతుల్లో 208 పరుగులు చేశాడు. 200 పరుగులను 145 బంతుల్లో పూర్తి చేశాడు.

వెస్టిండీస్‌పై 223: 2026 సెప్టెంబర్ 30న గువాహటిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్ శివతాండవం చేశాడు. కేవలం 133 బంతుల్లో 223 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో గిల్ కేవలం 117 బంతుల్లోనే 200 పరుగుల మార్కును అందుకుని వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించిన ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇషాన్ కిషన్ (126 బంతులు) పేరిట ఉన్న రికార్డును గిల్ అధిగమించాడు.

మొత్తంగా సెప్టెంబర్ 30 నాటికి భారత పురుషుల వన్డే క్రికెట్‌లో ఐదుగురు బ్యాటర్లు కలిసి మొత్తం 8 డబుల్ సెంచరీలు బాదగా, అందులో రోహిత్ శర్మ (3), శుభ్‌మన్ గిల్ (2) సాధించడం విశేషం. వన్డేల్లో భారత్ సాధించిన ఈ రికార్డులు ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
రోహిత్ శర్మ
శుభ్‌మన్ గిల్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Fastest Double Centuries: వన్డేల్లో టాప్ 5 ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీలు ఇవే.. గిల్ దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image2
కొండంత ల‌క్ష్యాన్ని ఊదిపడేసిన టీమిండియా.. వెస్టిండిస్ మ్యాచ్‌లో అరుదైన రికార్డులు
Recommended image3
IND vs WI: వెస్టిండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన గిల్.. డబుల్ సెంచరీతో చెలరేగిన కెప్టెన్
Related Stories
Recommended image1
October 1 Rule Changes: ఎల్పీజీ సబ్సిడీ నుంచి ఎస్‌బీఐ ఏటీఎం వరకు.. అక్టోబర్ 1 నుంచి మారనున్న టాప్ 10 రూల్స్
Recommended image2
Best SUVs Under 8 Lakhs: 8 లక్షల లోపే 5 స్టార్ సేఫ్టీ, 21 కిమీ మైలేజ్ ఇచ్చే బెస్ట్ ఎస్‌యూవీలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved