MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • KTR : తొమ్మిదో తరగతి ఫెయిలైన రేవంత్ బ్రదర్ ఏరోస్పేస్ ఇంజనీరా..! : కేటీఆర్

KTR : తొమ్మిదో తరగతి ఫెయిలైన రేవంత్ బ్రదర్ ఏరోస్పేస్ ఇంజనీరా..! : కేటీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్దం సాగుతోంది. సిరిసిల్ల పర్యటనలో సీఎం ప్రసంగానికి తాజాగా కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు.

3 Min read
Author : Arun Kumar P
Published : Oct 01 2026, 05:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
సీఎం కుటుంబంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు
Image Credit : X/BRS Party

సీఎం కుటుంబంపై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు

అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ మధ్య మాటలయుద్దంతో తెలంగాణ రాజకీయాలు హీటెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల బహిరంగ సభలో చేసిన కామెంట్స్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులపై పలు ఆరోపణలు చేసిన కేటీఆర్... రైతులు, చేనేత కార్మికులు, బీసీలు, మైనారిటీలు, నిరుద్యోగుల సమస్యలను ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి తనపై చేసిన అవినీతి ఆరోపణలకు కూడా కేటీఆర్ సమాధానం ఇచ్చారు.

సీఎం రేవంత్ రెడ్డి కుటుంబసభ్యులు, బంధువులకు సంబంధించిన వ్యాపారాలు, టెండర్లు, భూముల వ్యవహారాలపై కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. ముఖ్యమంత్రి బావమరిది సృజన్ రెడ్డికి చెందిన కంపెనీలకు ఎలాంటి అర్హతలు లేకున్నా రూ.1,000 కోట్ల టెండర్ ఎలా వచ్చింది? ఇది అడిగితే ముఖ్యమంత్రికి కోపం వస్తోందన్నారు. తొమ్మిదో తరగతి ఫెలైన సీఎం సోదరుడు కొండల్ రెడ్డి ఏరోస్పేస్ ఇంజనీరు అయిపోయిండని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రూ.200 కోట్ల విలువైన భూమిని రూ.7 కోట్లకు ఎలా ఇచ్చావని అడిగినా సీఎంకు కోపం వస్తోందన్నారు.

ఇక అమెరికా నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి సోదరుడు జగదీష్ రెడ్డి వెయ్యికోట్లతో భారీ పెట్టుబడులు పెడతానని అంటున్నాడని కేటీఆర్ ప్రస్తావించారు. గతంలో పెద్దగా ఆస్తులు లేని వ్యక్తులు ఇప్పుడు వేల కోట్ల పెట్టుబడులు ఎలా పెడుతున్నారనే దానిపై తాను ప్రశ్నించానని చెప్పారు. ఆస్తుల్లో అదానీని దాటిపోయేలా ఉన్నావు అనేసరికి రేవంత్ రెడ్డికి కోపం వస్తోందన్నారు కేటీఆర్.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
నాకు హోటళ్లు ఉన్నది నిజమే : కేటీఆర్
Image Credit : ktrtrs/Instagram

నాకు హోటళ్లు ఉన్నది నిజమే : కేటీఆర్

తన ఆస్తులు, హోటల్ వ్యాపారంపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా కేటీఆర్ స్పందించారు. అమెరికాలో ఉద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో 2006లో హోటల్ వ్యాపారం ప్రారంభించానని తెలిపారు. 2009లో ఎన్నికల అఫిడవిట్‌లోనే తన వ్యాపారం, ఆస్తులకు సంబంధించిన వివరాలను వెల్లడించానని చెప్పారు.

తాను వ్యాపారం చేయడం తప్పేమీ కాదని, తన కుటుంబాన్ని పోషించేందుకు సంపాదించుకోవాల్సిన బాధ్యత తనకు ఉందని కేటీఆర్ అన్నారు. రేవంత్ రెడ్డి తన హోటళ్ల గురించి మాట్లాడటం ద్వారా ఉచితంగా ప్రచారం కల్పించారని వ్యాఖ్యానించారు. తన ఆస్తుల గురించి తాను ఎన్నికల అఫిడవిట్లలోనే వివరాలు ఇచ్చానని, ఇప్పుడు కొత్తగా ఏదో బయటపడినట్లు ప్రచారం చేయడం సరికాదని కేటీఆర్ అన్నారు.

రైతులు ఇబ్బంది పడుతున్నారు : కేటీఆర్

ఈ కాంగ్రెస్ పాలనలో అటు ఆదిలాబాద్ నుంచి ఇటు అలంపూర్ వరకు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని కేటీఆర్ ఆరోపించారు. వ్యవసాయానికి కనీసం ఆరు గంటల విద్యుత్ కూడా అందడం లేదని రైతులు తన దృష్టికి తీసుకొస్తున్నారని చెప్పారు. రైతుబంధు అందడం లేదని, యూరియా దొరకడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతులు ఫోన్ చేస్తే యూరియా పొలం వద్దకు చేరే పరిస్థితి ఉండేదని రైతులు చెబుతున్నారని కేటీఆర్ అన్నారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో రైతులు విద్యుత్ సరఫరాపై ఆందోళనలు చేస్తున్నారని కేటీఆర్ అన్నారు.

కేసీఆర్ హెచ్చరిక నిజమైందన్న కేటీఆర్

మాజీ సీఎం కేసీఆర్ గతంలోనే ‘మోసపోకండి.. మోసపోతే గోసపడ్తం’ అని హెచ్చరించారు... ఇప్పుడు ఇదే నిజమైందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత కొత్త ప్రభుత్వాన్ని చూడాలనే ఉద్దేశంతో ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇచ్చారని, కానీ ఇప్పుడు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు సాగునీరు, విద్యుత్, రైతుబంధు, రైతు భీమా వంటి అంశాల్లో సమస్యలు ఎదురవుతున్నాయని కేటీఆర్ విమర్శించారు.

33
420 హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీస్తూనే ఉంటాం : కేటీఆర్
Image Credit : X/BRS

420 హామీలు, ఆరు గ్యారెంటీలపై నిలదీస్తూనే ఉంటాం : కేటీఆర్

కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూడా కేటీఆర్ ప్రస్తావించారు. ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకే ఇతర అంశాలను తెరపైకి తీసుకొస్తున్నారని ఆయన ఆరోపించారు.

ఎస్సీ డిక్లరేషన్, యువత డిక్లరేషన్, రైతు డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్‌తో పాటు ఆరు గ్యారెంటీల అమలుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. దళితబంధు కింద రూ.12 లక్షలు, బీసీలకు రూ.లక్ష కోట్లు, మైనారిటీలకు రూ.4 వేల కోట్ల బడ్జెట్ వంటి హామీలను ప్రస్తావిస్తూ.. వాటి అమలు ఎంతవరకు జరిగిందో ప్రజలకు వివరించాలని అన్నారు.

మళ్లీ నేతన్నల ఆత్మహత్యలు : కేటీఆర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటనలో చేనేత కార్మికుల సమస్యలను ముందుకు తెచ్చారని కేటీఆర్ అన్నారు. అసలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలు తగ్గాయని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ పరిస్థితి దారుణంగా మారిందని ఆయన ఆరోపించారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు, పాఠశాల యూనిఫాం ఆర్డర్లు, నేతన్న భీమా వంటి వాటిద్వారా నేతన్నలకు అండగా నిలిచామన్నారు. చేనేత కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం, భీమా పునరుద్ధరణ వంటి అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

బీజేపీపై కూడా కేటీఆర్ విమర్శలు

కాంగ్రెస్‌పై విమర్శలు చేసిన కేటీఆర్.. కేంద్రంలోని బీజేపీపై కూడా ఫైర్ అయ్యారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, బుల్లెట్ రైలు, ప్రతి ఇంటికీ కుళాయి నీరు, పక్కా ఇళ్లు, ఐదు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ వంటి హామీలను ప్రస్తావించారు. ఈ హామీల అమలుపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.

తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం తిరిగి అభివృద్ధి బాటలోకి వస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ప్రశ్నిస్తారని కేటీఆర్ అన్నారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
భారత రాష్ట్ర సమితి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్
Recommended image2
Revanth Reddy: కేటీఆర్ అడ్డాలో రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్‌పై నిప్పులు చెరిగిన సీఎం
Recommended image3
తెలంగాణ‌లో అధికారంలోకి రాబోయేది ఎవ‌రో తేల్చే ఎన్నిక‌.. సెమీ ఫైన‌ల్‌కి సిద్ధ‌మ‌వుతోన్న పార్టీలు
Related Stories
Recommended image1
KTR : కోర్టు మెట్లెక్కిన కేటీఆర్ .. ఎందుకో తెలుసా?
Recommended image2
Ktr Review on Paradise: నాని ప్యారడైజ్‌ మూవీపై కేటీఆర్‌ రివ్యూ.. కానీ అసలు విషయం చెప్పలేదేంటి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved