MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!

Hyderabad Haunted House : నగర నడిబొడ్డున దెయ్యాల నివాసం.. కుందన్‌బాగ్‌ బంగ్లా అసలు కథ ఇదే..!

హైదరాబాద్‌లో ఓ బంగ్లా పేరు చెబితే చాలు చాలామంది భయంతో వణికిపోతారు. దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాల్లో ఇదీ ఒకటి. నగర నడిబొడ్డున గల ఈ ''దెయ్యాల కోట'' గురించి మీకు తెలుసా..? 

2 Min read
Author : Arun Kumar P
Published : Apr 29 2026, 02:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
హైదరాబాద్ లో బూత్ బంగ్లా..
Image Credit : Freepik

హైదరాబాద్ లో బూత్ బంగ్లా..

హైదరాబాద్ నడిబొడ్డున గల ప్రాంతం కుందన్ బాగ్. బేగంపేట పరిధిలోని ఈ ప్రాంతంలో ఓ పురాతన బంగ్లాలో దెయ్యాలున్నాయని ఈ టెక్ జమానాలో కూడా చాలామంది నమ్ముతున్నారు అందుకే ఈ కుందన్‌బాగ్‌ బంగ్లాను దేశంలోనే అత్యంత భయానకమైన, రహస్యమైన ప్రదేశాలలో ఒకటిగా మారింది.

ఈ కుందన్ బాగ్ బంగ్లా చుట్టూ కొవ్వొత్తులు పట్టుకున్న ఆత్మలు తిరుగుతాయని… రాత్రిపూట వింత శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు కూడా చెబుతుంటారు. దీంతో దెయ్యాలున్నాయనే నమ్మకం మరింత పెరిగింది. ఇక్కడ అనేక అతీంద్రియ సంఘటనలు జరిగాయని, అందుకే సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రాంతానికి వెళ్లడానికి జనం భయపడతారు. కుందన్‌బాగ్‌ బంగ్లా కథ ఇప్పటికీ ప్రజలను వణికిస్తోంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24
కుందన్ బాగ్ బంగ్లా స్టోరీ ఇదే...
Image Credit : Getty

కుందన్ బాగ్ బంగ్లా స్టోరీ ఇదే...

హైదరాబాద్‌లోని ఖరీదైన ప్రాంతంలో ఉన్న కుందన్‌బాగ్‌ హౌస్ కథ కేవలం కట్టుకథ కాదు, ఇది భయంకరమైన నిజం. 2002లో ఈ కథ వెలుగులోకి వచ్చింది. రెండంతస్తుల బంగ్లాలో నివసించే ఓ మహిళ, ఆమె ఇద్దరు కుమార్తెల వింత ప్రవర్తన ఇరుగుపొరుగు వారిని భయపెట్టడం ప్రారంభించింది.

స్థానికుల కథనం ప్రకారం… ఆ మహిళ, ఆమె కూతుళ్లు రాత్రిపూట నల్ల బట్టలు ధరించి, కొవ్వొత్తులు పట్టుకుని తమ ఇంటి బాల్కనీలో తిరిగేవారు. కొన్నిసార్లు ఇంటి బయట ఉన్న చెత్తకుండీలలో రక్తంతో నిండిన సీసాలు విసిరేస్తూ వింత శబ్దాలు చేసేవారు. దీంతో వారు చేతబడి చేస్తున్నారనే వదంతులు వ్యాపించాయి.

Related Articles

Related image1
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Related image2
దెయ్యాల గ్రామాల్లో వలస కార్మికులకు క్వారంటైన్‌.. ఉత్తరాఖండ్ వినూత్న ఆలోచన
34
కుందన్ బాగ్ బంగ్లా సీక్రెట్ బైటపెట్టిన దొంగ..
Image Credit : Getty

కుందన్ బాగ్ బంగ్లా సీక్రెట్ బైటపెట్టిన దొంగ..

ఈ కథలో అసలు మలుపు ఓ దొంగ ఆ ఇంట్లోకి దొంగతనం చేయడానికి వెళ్లినప్పుడు వచ్చింది. ఇంట్లోకి రహస్యంగా వెళ్లిన అతను, భయంతో కేకలు వేస్తూ బయటకు పరుగెత్తుకొచ్చాడు. పోలీసులు తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా, వారికి భయంకరమైన దృశ్యం కనిపించింది. తల్లి, ఆమె ఇద్దరు కుమార్తెల కుళ్లిన మృతదేహాలు మంచంపై పడి ఉన్నాయి.

అంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆ ముగ్గురూ దాదాపు ఆరు నెలల క్రితమే చనిపోయారని తేలింది. కానీ చనిపోయిన తర్వాత కూడా చాలా నెలల పాటు ఆ మహిళలు బాల్కనీలో కొవ్వొత్తులు వెలిగించడం చూశామని ఇరుగుపొరుగు వారు చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

44
సోషల్ మీడియాలో బూత్ బంగ్లా వీడియోలు...
Image Credit : Getty

సోషల్ మీడియాలో బూత్ బంగ్లా వీడియోలు...

ఇప్పటికీ ఆ కుందన్ బాగ్ బంగ్లా పాడుబడిన స్థితిలోనే ఉంది. ఇందులోంచి రాత్రిపూట కేకలు వినిపిస్తాయని, మసక కొవ్వొత్తి వెలుగు కనిపిస్తుందని స్థానికులు చెబుతుంటారు. కుందన్‌బాగ్‌ ఇంటికి సంబంధించిన ఈ రహస్యం ఇప్పటికీ వీడలేదు.

అయితే ఇటీవల చాలామంది ''గోస్ట్ హంటింగ్'' పేరుతో ఈ కుందర్ బాగ్ బంగ్లా వద్ద వీడియోలు తీస్తున్నారు... గ్రాఫిక్స్ యాడ్ చేసి నిజంగానే దెయ్యాలను చూసినట్లుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసి స్థానికులకు మరింత భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇలా భయపెట్టేలా కుందన్ బాగ్ బంగ్లా వీడియోలను పోస్ట్ చేసిన 35 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ భవనం వద్ద వీడియోలు తీసేవారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇలా సోషల్ మీడియా వీడియోలతో కుందన్ బాగ్ బంగ్లా వార్తల్లో నిలిచింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
హైదరాబాద్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
వైరల్ న్యూస్
నేరాలు, మోసాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
100 కోట్లకు పైగా ఆస్తులు.. ఏసీబీ వలలో భారీ అవినీతి తిమింగళం| ACB Raids on Hyderabad | Asianet Telugu
Recommended image2
RTC: ఎర్ర బ‌స్సులు ప‌చ్చ‌గా ఎందుకు మారాయి.? దీని వెన‌కాల ఉన్న అస‌లు కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image3
Now Playing
Big Twist In Johny Master Case : జానీ మాస్టర్ కేసుపై లాయర్ అల్లం నాగరాజు ఊహించని ట్విస్ట్ ??
Related Stories
Recommended image1
Haunted Railway Stations : భారత్‌లోని టాప్ 5 మిస్టరీ రైల్వే స్టేషన్లు.. కర్నూల్ స్టేషన్ దీ వింత కథే..!
Recommended image2
దెయ్యాల గ్రామాల్లో వలస కార్మికులకు క్వారంటైన్‌.. ఉత్తరాఖండ్ వినూత్న ఆలోచన
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved