- Home
- Telangana
- Real Estate: హైదరాబాద్‌కు కాస్త దూరంగా, అభివృద్ధికి చాలా దగ్గరగా.. ఇక్కడ ఈరోజు భూమి కొంటే రేపు బంగారమవుతుంది!
Real Estate: హైదరాబాద్‌కు కాస్త దూరంగా, అభివృద్ధికి చాలా దగ్గరగా.. ఇక్కడ ఈరోజు భూమి కొంటే రేపు బంగారమవుతుంది!
భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎప్పటికీ నష్టపోరని చాలా మంది చెబుతుంటారు. పెరుగుతోన్న జనాభాకు అనుగుణంగా భూమి పెరగదు అనేది లాజిక్. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలనే విషయంలో చాలా మందికి ఓ క్లారిటీ ఉండదు.

ఔటర్ రింగ్ రైలుతో మారుతోన్న భవితవ్యం
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్‌కు ఊపునిస్తోంది. రీజినల్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా ప్రతి పాదించిన ఈ ప్రాజెక్ట్ తెలంగాణలో రవాణా రంగానికే కాకుండా రియల్ ఎస్టేట్ రంగానికి కూడా మలుపు తిప్పబోతోంది. వంగపల్లి–ఆలేరు, గుట్లగూడ–చిట్టిగడ్డ, బూర్గుల–బాలానగర్, మాసాయిపేట–శ్రీనివాసనగర్, వలిగొండ–రామన్నపేట, గజ్వేల్–కొడకండ్ల మార్గాల గుండా ఈ ప్రాజెక్టు సాగనుంది. వీటిలో గజ్వేల్ హాట్ స్పాట్‌గా మారనుంది.
KNOW
ప్రజ్ఞాపూర్‌లో భూముల ధరలు పెరుగుతాయా?
ప్రజ్ఞాపూర్ పరిసరాల్లో ఇప్పటికే భూముల రేట్లు స్థిరంగా పెరుగుతున్నాయి. రాబోయే రైలు మార్గం ఈ ప్రాంతానికి చేరువలో ఉండడంతో ధరలు మరింత పెరిగే అవకాశముంది. గజ్వేల్ చుట్టుపక్కల ఉన్న మౌలిక సదుపాయాలు హైదరాబాద్‌కు కనెక్టివిటీ, ఇక్కడ ఉన్న కంపెనీలు వంటివి ఇక్కడ రియల్ ఎస్టేట్ పెరుగుదలకు ఊతమివ్వనున్నాయి. రియల్ ఎస్టేట్ ఈగురూ అనే రియల్ ఎస్టేట్ ఈ పేపర్ తెలిపిన వివరాల ప్రకారం. గజ్వేల్ ప్రాంతంలో భూమి ధరలు గత రెండేళ్లలో ఎకరానికి రూ.1.2 కోట్లు నుంచి రూ.2.2 కోట్ల వరకు పెరిగాయి. ప్రజ్ఞాపూర్ లో చదరపు గజానికి రూ.15,000-28,000 వరకు ధరలు నమోదయ్యాయి.
మెట్రో కనెక్టివిటీతో ప్రయాణం సులభం
హైదరాబాద్‌లో జేబీఎస్ నుంచి శామీర్‌పేట వరకు మెట్రో రైలు అందుబాటులోకి రానుంది. అలాగే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రాజీవ్ రహదారిని కూడా విస్తరించే ప్రతిపాదనలు ఉన్నాయి. ఈ కారణంగా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. పట్టణాల్లో ఉద్యోగాలు చేసే వారు కూడా సులభంగా రాకపోకలు చేయగలుగుతారు. ఇది కూడా ఈ ప్రాంతంలో భూముల విలువ పెరగడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.
కంపెనీల విస్తరణకు అవకాశాలు
హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్ (ORR), రీజియన్ రింగ్ రోడ్ (RRR) మధ్య ప్రాంతంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున కంపెనీలు స్థాపనకు వచ్చే అవకాశం ఉంది. ఈ విస్తరణ గజ్వేల్ ప్రాంతానికి మల్టీపుల్ ఎంప్లాయ్‌మెంట్ అవకాశాలు తీసుకురావడంతో పాటు, భూముల విలువను కూడా పెంచబోతోంది.
పెట్టుబడిదారులకు గజ్వేల్ ఎందుకు బెస్ట్?
అత్యంత తక్కువ ధరల్లో ఇప్పుడే భూములు కొనుగోలు చేసే అవకాశం ఉంది. రాబోయే రవాణా ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, ఐటీ కంపెనీల విస్తరణ కలిపి చూస్తే గజ్వేల్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వచ్చే ఐదేళ్లలో భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రజ్ఞాపూర్ ప్రాంతం భవిష్యత్తులో ప్రధాన హాట్‌స్పాట్‌గా మారనుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
గమనిక: పైన తెలిపిన వివరాలను కేవలం ప్రాథమిక సమాచారంగానే భావించాలి. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి అనేది లాభ, నష్టాలతో కూడుకున్న అంశం. కాబట్టి పెట్టుబడి పెట్టే ముందు ఈ రంగంలో నిపుణులను సంప్రదించడం మంచిది.