- Home
- Telangana
- High Security Number Plate: మీ నెంబర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
High Security Number Plate: మీ నెంబర్ ప్లేట్ మార్చారా, లేదా? లేదంటే ఫైన్ చెల్లించాల్సిందే. లాస్ట్ డేట్ ఎప్పుడంటే
HSRP Deadline: తెలంగాణ రాష్ట్రంలో వాహనదారులకు కీలక అప్డేట్ వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల మేరకు వాహనాల నెంబర్ ప్లేట్లను మార్చడానికి సెప్టెంబర్ 30వ తేదీతో గడువు ముగియనుంది. పూర్తి వివరాలు..

హై స్కూరిటీ నెంబర్ ప్లేట్స్
తెలంగాణలో వాహనం నడిపేవారికి కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాతవైనా, కొత్తవైనా అన్ని వాహనాలకు హై సెక్యూరిటీ నెంబర్ ప్లేట్ (HSRP) ఉండాల్సిందే. లేకపోతే బీమా, రిజిస్ట్రేషన్, కాలుష్య సర్టిఫికెట్ తదితర సేవలు ఆగిపోవచ్చు. అంతేకాదు వాహనం రోడ్డు ఎక్కితే జరిమానాలు చెల్లించకతప్పదు.
KNOW
ఎందుకు హై సెక్యూరిటీ ప్లేట్ తప్పనిసరి?
* నకిలీ నెంబర్ ప్లేట్లను అరికట్టడం.
* వాహన దొంగతనాలు, మోసాలు తగ్గించడం.
* ట్రాఫిక్ అమలు సులభం చేయడం.
* ప్రమాదాల సమయంలో వాహన గుర్తింపు వేగవంతం చేయడం.
కేంద్రం నిర్ణయంతో 1 ఏప్రిల్ 2019 తర్వాత రిజిస్టర్ అయిన వాహనాలకు ఇప్పటికే HSRP అమర్చారు. అయితే 2019కి ముందు రిజిస్టర్ అయిన వాహనాలందరికీ ఈ ప్లేట్లు మార్చుకోవాల్సిందే.
ఎలా పొందాలి?
* ఇందుకోసం ముందుగా www.siam.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
* అనతరం వాహనం నంబర్, వివరాలు నమోదు చేసి బుకింగ్ చేయాలి.
* మీ కారు లేదా బైక్ మోడల్ సెలక్ట్ చేసుకుని ఇంజన్ నెంబర్, చాసిస్ నెంబర్ ఎంటర్ చేయాలి. అనంతరం ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి.
* ప్లేట్ ఇంటికే డెలివరీ అవుతుంది లేదా ఎంపిక చేసిన డీలర్ వద్ద ఫిట్ చేసుకోవచ్చు.
* చివరిగా ప్లేట్ ఫోటో తీసి అదే వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేయాలి.
ప్లేట్ లేకపోతే ఏం జరుగుతుంది?
* వాహన కొనుగోలు అమ్మకాలు నిలిచిపోతాయి.
* బీమా, కాలుష్య ధృవపత్రాలు జారీ చేయరు.
* రవాణా శాఖ తనిఖీల్లో కేసులు నమోదు అవుతాయి.
* ప్రమాదాల సమయంలో ప్రభుత్వ సహాయం పొందడం కష్టమవుతుంది.
* రిజిస్ట్రేషన్ మార్పు జరగదు.
* కొత్త నెంబర్ ప్లేట్ల ఏర్పాటుకు సెప్టెంబర్ 30ని చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత రోడ్లపై నడిపితే జరిమానాలు తప్పవు.
ఫీజు ఎంతంటే.?
వాహనం రకం ఆధారంగా ప్రభుత్వమే రుసుములు ఖరారు చేసింది. కనీసం రూ.320 నుంచి గరిష్టంగా రూ.800 వరకు ఉంటుంది.
* ద్విచక్రవాహనం రూ. 320 – రూ. 380
* దిగుమతి చేసుకున్న బైక్ అయితే రూ. 400 – రూ. 500
* కార్లు రూ. 590 – రూ. 700
* దిగుమతి చేసుకున్న కార్లు రూ. 700 – రూ. 800
* త్రీవీలర్ వాహనాలు రూ. 350 - రూ. 450
* కమర్షియల్ వెహికిల్స్ రూ. 600 నుంచి రూ. 800
వాహనదారులకు సూచన
పాత నెంబర్ ప్లేట్లు ఇక చెల్లవు. కొత్తగా కొనుగోలు చేసినా లేదా ప్లేట్ విరిగినా సాధారణ ప్లేట్లు వాడకూడదు. తప్పనిసరిగా HSRP అమర్చుకుని మాత్రమే వాహనం నడపాలి. గడువు ముగియకముందే ప్లేట్ మార్చుకోవడం ద్వారా చట్టపరమైన ఇబ్బందులు తప్పించుకోవచ్చు.