- Home
- Andhra Pradesh
- Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ రానుందంటే
Andhra Pradesh: ఆసియాలోనే అతి పెద్ద డేటా సెంటర్.. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ రానుందంటే
Google Data Center: ఆంధ్రప్రదేశ్‌ను టెక్ రంగంలో అగ్రగామిగా నిలుపుతాం.. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు చెప్పిన మాట ఇది. తాజాగా జరుగుతోన్న పరిణామాలు చూస్తుంటే ఈ దిశగా వేగంగా అడుగులు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.

సింగపూర్ పర్యటన తర్వాత కీలక పరిణామం
ఐటీ శాఖమంత్రి నారా లోకేష్ ఇటీవల సింగపూర్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగా పలు కీలక ఒప్పందాలు చేసుకున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినట్లు తెలుస్తోంది. వార్తా సంస్థ రాయిటర్స్ ఇందుకు సంబంధించి ఒక కీలక కథనాన్ని అందించింది.
KNOW
విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ప్రణాళిక
రాయిటర్స్ వెల్లడించిన సమాచారం ప్రకారం, అమెరికా వెలుపల అతి పెద్ద డేటా సెంటర్‌ను గూగుల్ విశాఖలో నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 1 గిగావాట్‌గా ఉండనుంది. దాదాపు 6 బిలియన్ డాలర్ల పెట్టుబడి (భారత కరెన్సీ ప్రకారం సుమారు 50 వేల కోట్ల రూపాయలు)తో దీనిని నిర్మించనున్నారు. ఇందులో 2 బిలియన్ డాలర్లు కేవలం పునర్వినియోగ విద్యుత్ (రిన్యూవబుల్ ఎనర్జీ) కేంద్రాల అభివృద్ధికి వినియోగించనున్నారు.
లోకేష్ సింగపూర్ టూర్..
గూగుల్ నుంచి గుడ్ న్యూస్..
విశాఖలో 1GW డేటా సెంటర్
విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లో గూగుల్ క్లౌడ్ డైరక్టర్‌తో భేటీ సత్ఫలితాలను ఇస్తోంది. సింగపూర్ టూర్ ముగించుకుని లోకేష్ తిరుగు ప్రయాణంలో ఉండగా... గూగుల్ గుడ్ న్యూస్ బయటకు… pic.twitter.com/SdlwL3Bon4— Telugu Desam Party (@JaiTDP) July 30, 2025
ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ప్రత్యేకతలు
విశాఖలో రూపుదిద్దుకోబోయే ఈ సెంటర్ ఆసియాలో అతిపెద్దదిగా, అమెరికా వెలుపల అత్యంత భారీ డేటా మౌలిక సదుపాయంగా గుర్తింపు పొందనుంది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్‌లలో కొనసాగుతున్న గూగుల్ డేటా నెట్‌వర్క్ విస్తరణలో ఇది కీలక భాగమవుతుందని సమాచారం.
కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ప్రాధాన్యం
డేటా సెంటర్ పనితీరుకు అనుగుణంగా మూడు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్లను విశాఖలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సముద్ర గర్భ కేబుళ్ల ద్వారా వచ్చే డేటాను స్వీకరించి నిల్వ చేయడానికి ఇవి ఉపయోగపడనున్నాయి. ప్రస్తుత ముంబై సదుపాయాల కంటే రెండింతల సామర్థ్యంతో వీటిని నిర్మించాలని లక్ష్యంతో ఉన్నారు. భవిష్యత్తులో 10 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవసరాన్ని అంచనా వేస్తూ, ఇంధన మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తున్నారు.
టెక్ హబ్‌గా మారుతున్న మధురవాడ
మధురవాడ పరిసరాల్లో 500 ఎకరాల టెక్నాలజీ క్లస్టర్‌ను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. గూగుల్ ఇప్పటికే ఇక్కడ 80 ఎకరాలు సొంతం చేసుకుంది. ఆనందపురం–భీమిలి ప్రాంతంలో భారీ AI క్యాంపస్ ఏర్పాటు ప్రణాళికలో ఉంది. భోగాపురం విమానాశ్రయానికి సమీపంలో ఉండటంతో ఈ ప్రాంతం లాజిస్టిక్స్ దృష్ట్యా అనుకూలంగా ఉంది. ఈ పెట్టుబడి దేశంలో మౌలిక సదుపాయాల రంగంలోనే అతిపెద్ద ప్రాజెక్టుగా భావిస్తున్నారు.