Christmas Holidays 2025 : ఒకటి రెండ్రోజులు కాదు... వచ్చే వారమంతా స్కూళ్ళకు సెలవులే..?
Christmas Holidays 2025 : తెలుగు రాష్ట్రాల్లో చదువుకునే విద్యార్థులకు గుడ్ న్యూస్. ఒకటి రెండ్రోజులు కాదు వచ్చే వారమంతా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఉండనుంది. ఎందుకో తెలుసా?

వచ్చేవారం సెలవులే సెలవులు
Christmas Holidays 2025 : డిసెంబర్ వచ్చిందంటే చాలు క్రిస్టి యన్స్ సంబరాలు మొదలుపెడతారు. తమ ఇష్టదైవం యేసుక్రీస్తు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు... చర్చిలను ముస్తాబు చేస్తారు. ఇక డిసెంబర్ చివర్లో క్రిస్మస్ పండగవేళ మరింత సందడి ఉంటుంది... ఈ క్రమంలోనే ఉద్యోగులు, విద్యార్థులకు వరుస సెలవులు ఇస్తుంటారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లోని విద్యాసంస్థలకు ఈ క్రిస్మస్ సెలవులు ఎన్నిరోజులో తెలుసుకుందాం.
వచ్చే వారమంతా సెలవులే...
తెలుగు రాష్ట్రాల్లోని క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలకు క్రిస్మస్ సెలవులు ఏకంగా వారంరోజులు ఉండే అవకాశాలున్నాయి. డిసెంబర్ 21 నుండి 28 వరకు సెలవులు ఉండనున్నాయి... ఇందులో ఆరురోజులు పండగ సెలవులు కాగా రెండు ఆదివారాలున్నాయి… తిరిగి డిసెంబర్ 29న విద్యాసంస్థలు ప్రారంభం అవుతాయి.
అయితే క్రిస్మస్ సెలవులు ముగిసి మూడ్రోజులు గడుస్తాయో లేదో మళ్లీ న్యూ ఇయర్ సెలవు ఉంటుంది. ఇలా క్రిస్టియన్ మైనారిటీ విద్యార్థులకు ఇకపై వరుస సెలవులు రానున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు క్రిస్మస్ సెలవులపై అధికారిక ప్రకటన చేస్తాయి... దాని ప్రకారమే సెలవులుంటాయని విద్యార్థులు గమనించాలి.
రెండ్రోజులు సెలవులు కన్ఫర్మ్
క్రిస్టియన్ మైనారిటీ విద్యాసంస్థలు కాకుండా మిగతా స్కూళ్లు, కాలేజీలకు రెండ్రోజులు క్రిస్మస్ సెలవులుంటాయి. డిసెంబర్ 25న క్రిస్మస్, డిసెంబర్ 26న భాక్సింగ్ డే సెలవులు ఉంటాయని ఇప్పటికే విద్యాశాఖ ప్రకటించింది. అయితే కొన్ని విద్యాసంస్థలు క్రిస్మస్ కి ముందురోజు కూడా సెలవు ఇచ్చే అవకాశాలుంటాయి... క్రిస్మస్ ఈవ్ సందర్భంగా ఈ ప్రత్యేక సెలవు ఉంటుంది. మొత్తంగా తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లలో క్రిస్మస్ కి రెండ్రోజులు సెలవులు ఇచ్చారు.
రెండ్రోజుల సెలవులు నాలుగు రోజులకు పొడిగింపు?
క్రిస్మస్ కి రెండ్రోజులే సెలవులు... కానీ వీటిని ఐదు రోజులకు పొడిగించుకోవచ్చు. క్రిస్మస్ గురువారం (డిసెంబర్ 25) వస్తోంది... శుక్రవారం (డిసెంబర్ 26) ఎలాగూ భాక్సింగ్ డే సందర్భంగా ప్రభుత్వమే సెలవు ఇస్తోంది. ఇక శనివారం (డిసెంబర్ 27) హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోని కార్పోరేట్ విద్యాసంస్థలకు సాధారణంగానే సెలవు ఉంటుంది. ఇక ప్రభుత్వ, ఇతర ప్రైవేట్ విద్యాసంస్థల స్టూడెంట్స్ ఈ ఒక్కరోజును కవర్ చేయగలిగితే మరో సెలవు కలిసివస్తుంది. తర్వాతిరోజు ఆదివారమే (డిసెంబర్ 28) కాబట్టి సాధారణ సెలవు ఉంటుంది. ఇలా డిసెంబర్ 25, 26, 27, 28 నాల్రోజులు క్రిస్మస్ సెలవులు పొందవచ్చు... కుటుంబసభ్యులు, స్నేహితులతో క్రిస్మస్ వేడులకను ఎంజాయ్ చేసి తిరిగి డిసెంబర్ 29న బడిబాట పట్టవచ్చు.
వచ్చే నెలలో సెలవులే సెలవులు
జనవరి 2026 లో తెలుగు విద్యార్థులకు భారీగా సెలవులు రానున్నాయి. సంక్రాంతి తెలుగు రాష్ట్రాల్లో పెద్దపండగ... మరీముఖ్యంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఘనంగా జరుపుకుంటారు. ఉద్యోగాలు, ఉపాధి కోసం ఎక్కడెక్కడో స్థిరపడినవారు కూడా ఈ పండక్కి సొంతూళ్లకు చేరుకుంటారు... కుటుంబసభ్యులు, స్నేహితులతో ఆనందంగా పండగను జరుపుకుంటారు. ఈ పండక్కి విద్యాసంస్థలకు పది రోజులకు పైగానే సెలవులుంటాయి.
పండగ సెలవులు ఇలా ముస్తాయో లేదో రిపబ్లిక్ డే (జనవరి 26) వచ్చేస్తుంది. జాతీయ పర్వదినం సందర్భంగా స్కూళ్లు, కాలేజీల్లో మువ్వన్నెల జెండా ఆవిష్కరణ, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు... అంటే ఈరోజు జాతీయ సెలవుదినం. కొన్ని విద్యాసంస్థలకు జనవరి 1న న్యూఇయర్ సందర్భంగా సెలవు ఉంటుంది. ఇలా జనవరి 2026 లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు భారీగానే సెలవులు వస్తున్నాయి.

