MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Telangana
  • School Holidays : వీకెండ్, బోనాలు, బంద్ భలే కలిసొచ్చాయే... తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?

School Holidays : వీకెండ్, బోనాలు, బంద్ భలే కలిసొచ్చాయే... తెలుగు స్టూడెంట్స్ కి సెలవులే సెలవులు, ఎన్నిరోజులో తెలుసా?

ఈ వీకెండ్ లో తెలుగు విద్యార్థులకు వరుస సెలవులు రానున్నారు. ఏ రోజు,  ఎవరికి, ఎందుకు సెలవులు ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 16 2025, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విద్యాసంస్థలకు సెలవులే సెలవులు
Image Credit : getty

విద్యాసంస్థలకు సెలవులే సెలవులు

School Holidays : సెలవులు... ఈ మాట వింటేచాలు స్కూల్ విద్యార్థులకు పట్టరాని ఆనందం. ఎప్పుడూ వచ్చే ఆదివారం సెలవుకోసమే ఎదురుచూస్తుంటారు... అలాంటిది వారం మధ్యలో ఏదైనా పండక్కో, పర్వదినానికో సెలవు వచ్చిందంటే చాలు ఎగిరిగంతేస్తారు. ఇక భారీ వర్షాలు, బంద్ ల కారణంగా సడన్ హాలిడేస్ వచ్చాయో మురిసిపోతారు.

అయితే ఈ సెలవులన్ని ఒకేసారి కలిసివస్తే... తెలంగాణ విద్యార్థులకు ఈ వీకెండ్ లో ఇలాగే వరుస సెలవులు వస్తున్నాయి. వీకెండ్ కు బోనాల పండగ,  విద్యార్థి సంఘాల బంద్ కలిసి రావడంతో నాలుగు రోజులు సెలవులు వస్తున్నాయి. సరిగ్గా ప్లాన్ చేసుకుంటే తెలంగాణ విద్యార్థులకు వరుసగా ఐదురోజుల సెలవులు కూడా పొందవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
జులై 19 శనివారం వీకెండ్ సెలవు
Image Credit : unsplash

జులై 19 శనివారం వీకెండ్ సెలవు

హైదరాబాద్ లో ఐటీ, కార్పోరేట్ ఉద్యోగులకు ప్రతి శని, ఆదివారం సెలవు ఉంటుంది. దీంతో వీరి పిల్లలు ఎక్కువగా ఉండే విద్యాసంస్థలు శనివారం సెలవు ఇస్తుంటాయి. ఇలాంటి విద్యార్థులకు ఇంకా రెండ్రోజులే స్కూళ్లు నడిచేది... జులై 19న సెలవు వస్తుంది.

37
జులై 20 ఆదివారం సెలవు
Image Credit : Getty

జులై 20 ఆదివారం సెలవు

ప్రతి ఆదివారం విద్యాసంస్థలకు సాధారణంగా సెలవు ఉంటుంది. ఇక ఈ ఆదివారం తెలంగాణోళ్లకు మరీముఖ్యంగా హైదరబాదీలకు చాలా ప్రత్యేకం. ప్రస్తుతం ఆషాడమాసం బోనాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే... ఇప్పటికే గోల్కొండ, బల్కంపేట, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు పూర్తయ్యాయి. ఈ ఆదివారం హైదరబాద్ వ్యాప్తంగా బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈరోజు తెలంగాణలో విద్యాసంస్ధలకు ఎలాగూ సెలవే కాబట్టి పండక్కి ప్రత్యేకంగా సెలవు ప్రకటించాల్సిన అవసరం లేకుండాపోయింది.

47
జులై 21 సోమవారం సెలవు
Image Credit : getty

జులై 21 సోమవారం సెలవు

ఆదివారం హైదరాబాద్ ఆడపడుచులు బోనమెత్తి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటారు. అలాగే మేకలు, కోళ్లను బలిచ్చి కుటుంబసభ్యులంతా విందు చేసుకుంటారు. ఇక పురుషులు అమ్మవారికి కల్లు సాకపోసి వారుకూడా తాగుతారు... కొందరు బంధువులు, స్నేహితులతో మందుపార్టీ చేసుకుంటారు. ఇలా ఆదివారమంతా విందు, మందు, ఊరేగింపులతో సందడి నెలకొంటుంది. 

సోమవారం కూడా ఈ బోనాల సందడి కొనసాగుతుంది... అలాగే ఆదివారం వేడుకల్లో పాల్గొని ప్రజలు అలసిపోయివుంటారు. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఈ సోమవారం అంటే జులై 21న తెలంగాణవ్యాప్తంగా అధికారికంగానే సెలవు ప్రకటించింది. అంటే ఉద్యోగులు, విద్యార్థులకు ఈ సెలవు వర్తిస్తుంది. 

57
జులై 22 మంగళవారం లీవ్ తీసుకుంటే?
Image Credit : getty

జులై 22 మంగళవారం లీవ్ తీసుకుంటే?

వరుసగా మూడ్రోజుల సెలవుల తర్వాత మంగళవారం తిరిగి స్కూళ్లు తెరుచుకుంటాయి. అయితే ఈ ఒక్కరోజు మేనేజ్ చేసారంటే మరో సెలవు కలిసివస్తుంది. అంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులతో ఏదైనా లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసుకోవాలనుకుంటే ఈ రోజు విద్యార్థులు సెలవు పెట్టుకోవచ్చు. ఇలా చేస్తే వరుసగా ఐదురోజులు సెలవులు కలిసివస్తాయి.

67
జులై 23 తెలంగాణలో విద్యాసంస్థల బంద్
Image Credit : iSTOCK

జులై 23 తెలంగాణలో విద్యాసంస్థల బంద్

తెలంగాణలో విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. జులై 23 (మంగళవారం) తెలంగాణలోని స్కూళ్ళు, కాలేజీలు స్వచ్చందంగా బంద్ పాటించాలని ఏఐఎస్ఎఫ్ (All India Students Federation) కోరుతోంది. ప్రైవేట్ విద్యాసంస్ధల అధికంగా వసూలుచేస్తున్న ఫీజులను నియంత్రించాలని, విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు.

77
వరుసగా ఐదురోజుల సెలవులు?
Image Credit : ANI

వరుసగా ఐదురోజుల సెలవులు?

తెలంగాణలోని అన్ని విద్యాసంస్థలకు ఖచ్చితంగా మూడ్రోజులు సెలవులు వచ్చే అవకాశాలున్నాయి... కొందరికి మాత్రం నాలుగురోజుల సెలవులు వస్తాయి. అయితే విద్యార్థులు మధ్యలో ఒకరోజు లీవ్ తీసుకుంటే వరుసగా ఐదురోజులు సెలవులే.

గమనిక : విద్యార్థులు సెలవు తీసుకోవాలని చెప్పడం మా ఉద్దేశం కాదు... అవసరం అనుకుంటే తీసుకోవచ్చు. 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
తెలంగాణ
ఆంధ్ర ప్రదేశ్
హైదరాబాద్
విద్య
 

Latest Videos
Recommended Stories
Recommended image1
తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అరెస్ట్.. ఎందుకో తెలుసా?
Recommended image2
Govt Jobs : కేవలం ఇంజనీరింగ్ చేస్తే చాలు.. నెలకు రూ.1,33,630 శాలరీతో మేనేజర్ లెవెల్ ప్రభుత్వ ఉద్యోగం, హైదరాబాద్ లోనే పోస్టింగ్
Recommended image3
Bank Holidays : సెప్టెంబర్ 25 నుంచి 30 వరకు బ్యాంకులు బంద్‌.. ఏరోజు, ఎందుకు సెలవు?
Related Stories
Recommended image1
School Holidays : తెలంగాణ స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త.. ఈ వీకెండ్ లో రెండు, కొందరికైతే మూడ్రోజుల సెలవులు?
Recommended image2
School College Bandh: జూలై 23న స్కూల్స్, కాలేజీలు బంద్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved